మమత మోహన్ దాస్‌ని మోసం చేసిన నటుడు?
గాయని కం నటి మమతా మోహన్ దాస్ తన జీవితంలోని అత్యంత కష్టతరమైన ఎపిసోడ్స్ గురించి, వ్యక్తిగత నష్టాల గురించి ఇటీవల ఒక పాడ్ కాస్ట్‌లో వెల్లడించారు.
By: Sivaji Kontham | 16 Feb 2026 9:58 AM ISTగాయని కం నటి మమతా మోహన్ దాస్ తన జీవితంలోని అత్యంత కష్టతరమైన ఎపిసోడ్స్ గురించి, వ్యక్తిగత నష్టాల గురించి ఇటీవల ఒక పాడ్ కాస్ట్‌లో వెల్లడించారు. ముఖ్యంగా ప్రేమలో నమ్మక ద్రోహం, మోసం గురించి చెప్పి ఆవేదన చెందారు. మమత ఒక ప్రముఖ మలయాళ నటుడితో ప్రేమలో ఉన్న సమయంలో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని బయటపెట్టారు.
ఓవైపు క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్న క్లిష్ట సమయంలోనే ఆ నటుడితో ప్రేమలో ఉన్నానని చెప్పిన మమత, అతడికి అప్పటికే వేరే అమ్మాయితో నిశ్చితార్థం జరిగిందని.. ఆ విషయాన్ని దాచిపెట్టి తనను మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేకాదు తన మ్యారేజ్ లైఫ్ లో కలతల గురించి బహిరంగంగా మాట్లాడారు. తాను రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. 2011లో తన చిన్ననాటి స్నేహితుడు ప్రజిత్ పద్మనాభన్‌ను వివాహం చేసుకున్న మమత మనస్పర్థల కారణంగా కేవలం ఆరు నెలల్లోనే విడిపోయారు. 2012లో వారు అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ఇటీవల సుహాసిని మణిరత్నం నిర్వహించిన ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. సరైన వ్యక్తి దొరికితే మళ్లీ పెళ్లి చేసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని మమతా మోహన్ దాస్ వెల్లడించారు.
నటిగా మమత కెరీర్ మ్యాటర్ కి వస్తే... ప్రస్తుతం విభిన్న పాత్రలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. మైడియర్ సిస్టర్, 3 కంట్ంరీస్,జూతన్, ఓ మై విళిగల్ వంటి చిత్రాలలో మమతా మోహన్ దాస్ నటిస్తున్నారు. మై డియర్ సిస్టర్ తమిళ చిత్రం. ఇందులో మమత టిప్పర్ లారీ డ్రైవర్‌గా.. పక్కా ఫెమినిస్ట్ పాత్రలో నటించారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన టూ కంట్రీస్ సీక్వెల్ 3 కంట్రీస్ లో దిలీప్ సరసన నటిస్తున్నారు. భద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న మలయాళ చిత్రం జూతన్ ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. ప్రభుదేవాతో కలిసి నటిస్తున్న ఓమై విళిగల్ సినిమా కూడా షూటింగ్ దశలో ఉంది. ఇక గాయనిగా కెరీర్ మ్యాటర్ కి వస్తే.. నటనతో పోలిస్తే పాటల సంఖ్య తగ్గించినప్పటికీ, తనకు నచ్చిన ప్రత్యేకమైన సాంగ్స్, మ్యూజిక్ వీడియోలలో పాడుతున్నారు.
