Begin typing your search above and press return to search.

దావూద్ ఇబ్రహీంపై కామెంట్స్.. బాలీవుడ్ నటి చుట్టూ వివాదం..

అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం ఉగ్రవాది కాదని సన్యాసినిగా మారిన బాలీవుడ్‌ నటి మమతా కులకర్ణి చేసిన సంచలన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

By:  M Prashanth   |   1 Nov 2025 5:00 PM IST
దావూద్ ఇబ్రహీంపై కామెంట్స్.. బాలీవుడ్ నటి చుట్టూ వివాదం..
X

అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం ఉగ్రవాది కాదని సన్యాసినిగా మారిన బాలీవుడ్‌ నటి మమతా కులకర్ణి చేసిన సంచలన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. భారత్‌ కు మోస్ట్‌ వాంటెడ్‌ డాన్‌ గా ఉన్న దావూద్‌ ఇబ్రహీం గురించి ఆమె చేసిన ఆ కామెంట్స్ తీవ్ర దుమారాన్ని కూడా రేపాయి. దీంతో ఇప్పుడు తన మాటను మార్చేశారు!

అసలేం జరిగిందంటే?

ఒకప్పుడు మమతా కులకర్ణి బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా సందడి చేశారు. కరణ్ అర్జున్, దిల్‌బర్, క్రాంతివీర్, కిస్మత్, సబ్‌సే బడా ఖిలాడి వంటి వివిధ సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. తెలుగులో కూడా పలు చిత్రాల్లో కథానాయికగా నటించి మెప్పించారు. కానీ కొంతకాలం క్రితం సన్యాసాన్ని తీసుకున్నారు.

ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన మహాకుంభమేళలో ఆమె హల్ చల్ చేశారు. మహామండలేశ్వర్‌ గా మారినట్లు ప్రకటించారు. ఆధ్యాత్మిక బాటలో పయనించాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. తన పేరును శ్రీ యామై మమత నందగిరిగా మార్చుకున్నట్లు చెప్పారు. కాషాయ దుస్తులు ధరించిన ఆమె, సాధ్విగా మారిపోయానని పేర్కొన్నారు.

దాదాపు 25 ఏళ్ల తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చిన ఆమెను అంతా చూసి షాకయ్యారు. అయితే ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా రీసెంట్ గా ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్ పూర్ కు వచ్చారు. ఆ సమయంలో మీడియాతో మాట్లాడారు. అప్పుడు దావూద్‌ ఇబ్రహం ముంబై పేలుళ్లను జరపలేదని అన్నారు. అతడు ఉగ్రవాది కాదంటూ వ్యాఖ్యానించారు.

చాలా మంచి వ్యక్తి అంటూ కితాబిచ్చారు. తనకు ప్రస్తుతం రాజకీయాలు లేదా సినిమా పరిశ్రమతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. పూర్తిగా ఆధ్యాత్మికతకు అంకితభావంతో ఉన్నానని తెలిపారు. తాను సనాతన ధర్మాన్ని నమ్మిన ఒక వ్యక్తిగా జాతి వ్యతిరేక శక్తులతో సంబంధాలు అసాధ్యమంటూ చెప్పుకొచ్చారు.

అయితే దావూద్ గురించి ఆమె వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. అనేక మంది నెటిజన్లు మండిపడ్డారు. దీంతో మళ్లీ స్పందించారు. తాను వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. దావూద్‌ ఇబ్రహీం కచ్చితంగా ఉగ్రవాదేనని తెలిపారు. తాను విక్కీ గోస్వామి గురించి చెప్పానంటూ కవర్ చేశారు. ప్రస్తుతం ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో మళ్లీ వైరలవుతున్నాయి.