Begin typing your search above and press return to search.

అక్క‌డాయ‌న అందుకే మెగాస్టార్ అయ్యారు!

‘ఓమ్ – చాప్టర్ 1: ఉధిరమ్’ సినిమా కోసం మమ్ముట్టి రెండున్నర రోజుల పాటు స్క్రిప్ట్ చర్చల్లో పాల్గొన్నారని దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి తెలిపారు. ప్రతి పాత్ర, కథలోని మలుపులు, డైలాగ్‌లను క్షుణ్ణంగా పరిశీలించి, పూర్తి స్పష్టత వచ్చాకే షూటింగ్‌లో పాల్గొన్నారని వెల్లడించారు. ప్రతి సినిమాను కొత్త విద్యార్థిలా నేర్చుకోవడం మమ్ముట్టి ప్రత్యేకతని ప్రశంసించారు.

By:  Srikanth Kontham   |   13 Nov 2026 3:49 PM IST
అక్క‌డాయ‌న అందుకే మెగాస్టార్ అయ్యారు!
X

మాలీవుడ్ మెగాస్టార్ మ‌మ్ముట్టి స్టార్ డ‌మ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. కోట్లాది మంది అభిమానులున్న పెద్ద స్టార్. మూడు షిప్టులు ప‌నిచేసే న‌టుడాయ‌న‌. ఇప్ప‌టికే న‌టుడిగా 400 పైగా చిత్రాల్లో న‌టించిన ఓ లెజెండ్. న‌టుడిగా ఏ భాష‌లో అవ‌కాశం వ‌చ్చినా ప్రాత న‌చ్చిందంటే నో చెప్ప‌కుండా ప‌ని చేస్తారు. మాలీవుడ్ తో పాటు త‌మిళ‌, క‌న్న‌డ‌, తెలుగు భాష‌ల్లో సైతం ఎన్నో సినిమాల్లో న‌టించారు. ప్ర‌స్తుతం రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం `ఓమ్ – చాప్టర్ 1: ఉధిరమ్`లో ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవడానికి పది రోజుల ముందు కొచ్చిలోని తన నివాసానికి రాజ్‌కుమార్ పెరియ సామిని మమ్ముట్టి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ నేప‌థ్యంలో మ‌మ్ముట్టి గురించి ఓ ఇంట్రెస్టింగ్ విష‌యాన్ని రాజ్ కుమార్ రివీల్ చేసారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో మమ్ముట్టి బర్మ కార్తికేయన్ అనే శక్తివంతమైన పాత్ర పోషిస్తున్నారు. రాత్రి సమయం మిన‌హా మిగతా రెండున్నర రోజులు స్క్రిప్ట్ డిస్కషన్స్ కోసమే మ‌మ్ముట్టి సమయాన్ని కేటాయిం చిన‌ట్లు తెలిపారు.

`ఆయ‌న స్క్రిప్ట్ రీడింగ్ నామమాత్రంగా ఉండ‌దు. మొదటి అర్ధభాగం నుంచి రెండో అర్ధభాగం వరకు ప్రతి పాత్ర తాలూకా ఆర్క్, ప్లాట్ పాయింట్స్, చివరికి ప్రతి ఒక్కరి డైలాగ్‌లను కూడా మమ్ముట్టి క్షుణ్ణంగా పరిశీలించారని దర్శకుడు తెలిపారు. ఇతర పాత్రల ప్రవర్తన ఎలా మారుతుందనే చిన్న చిన్న విషయాలపై కూడా ఆయన అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. తన డైలాగ్‌లు మాత్రమే కాకుండా.. సినిమా కథ మొత్తం తన వేళ్లతో లెక్కపెట్టేంత స్పష్టతకు వచ్చిన తర్వాతే మ‌మ్ముట్టి సెట్స్‌లోకి అడుగుపెట్టార‌న్నారు.

`ఇండస్ట్రీలో దశాబ్దాలుగా అగ్ర హీరోగా కొన‌సాగుతున్నా? ప్రతి ప్రాజెక్ట్‌ను ఓ కొత్త విద్యార్థిలా బాధ్యతగా స్వీకరించే మమ్ముట్టి తత్వమే ఆయ‌న్ని లెజెండరీ నటుడిగా నిల‌బెట్టింది. మ‌మ్ముట్టి చూపిస్తున్న‌ ఈ ప్రొఫెషనల్ అప్రోచ్ యువ నటులకు గొప్ప పాఠంగా నిలుస్తుంద`న్నారు. రాజ్ కుమార్ వ్యాఖ్య‌ల‌తో మ‌మ్ముట్టి క‌థ‌ల విష‌యంలో ఎంత క్లారిటీగా ఉంటారో మ‌రోసారి క్లారిటీ వ‌చ్చింది.

మ‌మ్ముట్టి ఏ ప్రాజెక్ట్ క‌మిట్ అయినా? పాత్ర ప‌రంగా ఎలాంటి విశ్లేష‌ణ చేస్తారన్న‌ది అర్ద‌మ‌వుతుంది. ప్ర‌స్తుతం లైన‌ప్ లో మూడు నాలుగు ప్రాజెక్టులున్నాయి. గ‌తంలో ఏడాది కి క‌నీసం ఆరు సినిమాలైనా రిలీజ్ చేయాలి? అన్న ప‌ట్టుద‌లతో ప‌ని చేసేవారు. ఇప్పుడా స్పీడ్ త‌గ్గించారు. త‌న‌యుడు దుల్క‌ర్ స‌ల్మాన్ కూడా న‌టుడిగా స్థిర‌ప‌డ‌టంతో డాడ్ నెమ్మ‌దిగా సినిమాలు చేస్తున్నారు.