వయసు హీరో పాత్రలకే విలన్ పాత్రలకు కాదు!
పరిపూర్ణ నటుడు అవ్వాలంటే అన్ని రకాల పాత్రలు పోషించాలంటారు. కానీ స్టార్ హీరోల విషయంలో అలా ఉండదు
By: Srikanth Kontham | 1 Dec 2025 7:00 PM ISTపరిపూర్ణ నటుడు అవ్వాలంటే అన్ని రకాల పాత్రలు పోషించాలంటారు. కానీ స్టార్ హీరోల విషయంలో అలా ఉండదు. హీరోలెవరు నెగిటివ్ పాత్రలు అంత సులభంగా యాక్సెప్ట్ చేయరు. హీరో అనే ఇమేజ్ చట్రం నుంచి బయటకు వచ్చి నటించే వారు చాలా అరుదు. హీరో పాత్ర కాకపోతే హీరోకి ధీటుగా ఉండే పాత్ర చేస్తారు తప్ప నెగిటివ్ రోల్ అనే సరికి ముందుకు రారు. తాజాగా ఈ తరహా పాత్రలను ఉద్దేశించి మలయాళ నటుడు మమ్ముట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. హీరో పాత్రలకు వయసుంటుంది తప్ప విలన్ పాత్రలకు ఎలాంటి వయసు ఉండదన్నారు.
హీరో విలన్ ఒక్కరేనా?
ఇమేజ్ కు కట్టుబడి పాత్రలను ఎంపిక చేసుకునే ఆలోచన తనకెప్పుడు లేదన్నారు. ఎలాంటి పాత్రలోనైనా నాలోని నటుడిని సంతృప్తి పరచాలనుకుంటానన్నారు. అలాగే దర్శకులకు ఓ సూచన కూడా చేసారు. తన ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని పాత్రలు రాయోద్దన్నారు. డైరెక్టర్లు ఊహించిన పాత్రలు రాసినప్పుడే అందులో భిన్నమైన నటుడు బయటకు వస్తాడన్నారు. ఇలా చూసుకుంటే ప్రేక్షకుల్ని ఆకట్టుకునే చిత్రాలు చాలా తక్కువే ఉంటాయ న్నారు. `కలాంకావల్` కూడా అందరూ ఇష్టపడాలని తాను కోరుకోవడం లేదన్నారు. ఎందుకంటే ఈ సినిమాలో హీరో-విలన్ పాత్ర తానే పోషిస్తున్నట్లు తెలుస్తోంది.
సినిమాలో ఇద్దరు విలన్లా?
ఐదు దాశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో సినిమాలు చేసారు. గతంలో మమ్ముట్టి పోషించిన పాత్రలన్నింటి కంటే
భిన్నంగా ఈ నెగిటివ్ రోల్ ఉంటుందని తెలుస్తోంది.ఆ పాత్రలో మమ్ముట్టి ఆహార్యం సహా గెటప్ పూర్తిగా కొత్తగా ఉంటుందని..ఆ పాత్ర రివీల్ అనంతరం ప్రేక్షకులు థ్రిల్ ఫీలవుతారని ఇప్పటికే మీడియా కథనాలు వెడెక్కి స్తున్నాయి. మమ్ముట్టి తాజా వ్యాఖ్యలతో అంచనాలు రెట్టింపు అవ్వడం ఖాయం. వినాయకన్ కూడా సినిమాలో నటించడంతో అతడే ప్రధాన విలన్ అనుకున్నారంతా. కానీ అందుకు భిన్నంగా సన్నివేశం మారిందిప్పుడు.
దర్శకత్వం ఆలోచనా?
వినాయకన్ కూడా విలనే కానీ..మెయిన్ విలన్ మాత్రం మమ్ముట్టేనని తెలుస్తోంది. ప్రస్తుతం మమ్ముట్టి హీరోగా రెం డు సినిమాలు తెరకెక్కుతున్నాయి. అందులో ఒకటి `పేట్రియేట్` కాగా, మరోపేరు లేని చిత్రంలో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. జితిన్ . కె. జోస్ తెరకెక్కించిన `కలాంకావల్` మాత్రం డిసెంబర్ 5న రిలీజ్ అవుతుంది. ఇదే ఏడాది మమ్ముట్టి నుంచి రిలీజ్ అవుతోన్న మూడవ చిత్రమిది. అలాగే మమ్ముట్టి దర్శకత్వం దిశగా కూడా ఆలోచన చేస్తున్నట్లు మాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. నటుడిగా, నిర్మాతగా పరిశ్రమకు సేవలందించిన మమ్ముట్టి క్రియేటివ్ పరంగానూ రాణించాలనే ఆసక్తితో ఉన్నారుట. మరి 70 ఏళ్లు దాటిన మమ్ముట్టి ఎలాంటి చిత్రాలు చేస్తారో చూడాలి.
