మెగాస్టార్ బ్యాక్ టూ సెట్స్..ఈసారి దరువే!
అంతా ఓ ప్లానింగ్ ప్రకారం షూటింగ్ నిర్వహించడంతో ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తలేదన్నారు. మమ్ముట్టి లేని సమయంలో ఇతర నటీనటులపై సన్నివేశాలు చిత్రీకరించారు.
By: Srikanth Kontham | 30 Sept 2025 4:00 PM ISTమలయాళం మెగాస్టార్ మమ్ముట్టి అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. దీంతో కొన్ని నెలలుగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ కారణంగా ఆయన కమిట్ అయిన చిత్రాలు కూడా వాయిదా పడ్డాయి. అందులో ఒకటి `పేట్రియాట్` ఒకటి. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన తర్వాతే మమ్ముట్టి అనారోగ్యానికి గురవ్వడంతో? బ్రేక్ తీసుకున్నారు. తాజాగా మమ్ముట్టి అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నట్లు ‘పేట్రియాట్’ దర్శకుడు మహేశ్ నారాయణన్ తాజాగా వెల్లడించారు. అక్టోబర్ 1 నుంచి యధావిధిగా తిరిగి హైదరాబాద్ లో జరగనున్న షూటింగ్ లో పాల్గొంటారని తెలిపారు.
ఆయన తిరిగి కోలుకోవడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. సార్ ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నా? సినిమా గురించే ఆలోచించేవారన్నారు. రోజు సినిమా అప్ డేట్స్ అడిగి తెలుసుకునేవారని..తాను కూడా ఏ రోజు మిస్ కాకుండా ఇంటికెళ్లి అప్ డేట్ ఇచ్చేవాడినన్నారు. మమ్ముట్టి గారు లోకేషన్స్ లో లేకపోయినా? ఆయన ఆధ్వర్యంలో చిత్రీకరణ జరుగుతున్నట్లు అనిపించేదన్నారు. అందుకే కొన్ని నెలలు పాటు సెట్స్ లో లేకపో్యినా ఆ వెలితి ఎక్కడా కనిపించలేదన్నారు. ఆయన లేకపోయినా ఆ ప్రభావం షూటింగ్ పై ఎక్కడా పడలేదన్నారు.
అంతా ఓ ప్లానింగ్ ప్రకారం షూటింగ్ నిర్వహించడంతో ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తలేదన్నారు. మమ్ముట్టి లేని సమయంలో ఇతర నటీనటులపై సన్నివేశాలు చిత్రీకరించారు. దాదాపు జూన్ నుంచి మమ్ముట్టి షూటింగ్ కి హాజరవ్వడం లేదు. అప్పటి నుంచి సినిమాలో ఇతర ప్రధాన పాత్రలపైనే షూటింగ్ నిర్వహించారు. ఆ సన్నివేశాలు దాదాపు పూర్తయ్యాయి. అయితే మమ్ముట్టితో కొన్ని కాంబినేషన్స్ సన్నివేశాలు పెండింగ్ ఉన్నాయి.
అవి సహా మమ్ముట్టిపై చిత్రీకరించాల్సిన సోలో సన్నివేశాల చిత్రీకరణ అక్టోబర్ 1 నుంచి మొదలవుతుంది. నాటి నుంచి ఎలాంటి గ్యాప్ లేకుండా షూటింగ్ జరుతుంది. మమ్ముట్టి మూడు షిప్టులు పనిచేసే నటుడు. ఇప్పటికీ అలా సినిమాలు చేయడం ఆయనకే సాధ్యమైంది. ఐదు దశాబ్దాల ప్రయాణం లో 400లకు పైగా సినిమాలు చేసారంటే? అతడి అంకిత భావం ఎలా ఉంటుందన్నది చెప్పాల్సిన పనిలేదు.
