Begin typing your search above and press return to search.

లోకా ఫ్రాంఛైజీలోకి మెగాస్టార్.. కల నెరవేరనుందా?

అసలు విషయంలోకి వెళ్తే.. సాధారణంగా సెలబ్రిటీ వారసులు ఇండస్ట్రీలోకి రావాలి అంటే తల్లిదండ్రుల సహాయం ఎంతో ఉంటుంది. కానీ మిగతా వారందరికీ కాస్త భిన్నం దుల్కర్ అనే చెప్పుకోవాలి.

By:  Madhu Reddy   |   12 Nov 2025 8:00 PM IST
లోకా ఫ్రాంఛైజీలోకి మెగాస్టార్.. కల నెరవేరనుందా?
X

కళ్యాణి ప్రియదర్శన్.. అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన హలో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత పలు చిత్రాలు చేసి సరైన సక్సెస్ లభించకపోవడంతో కొంతకాలం ఇండస్ట్రీకి దూరమైంది. తెలుగు ఇండస్ట్రీకి దూరమైనా.. తమిళ్, మలయాళంలో చిత్రాలు చేస్తూ వచ్చిన ఈమె మలయాళం 'లోక చాప్టర్ 1: చంద్ర' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. ఇదే చిత్రాన్ని తెలుగులో 'కొత్తలోక' అంటూ డబ్బింగ్ చేసి విడుదల చేశారు. ఇక్కడ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది ఈ చిత్రం.

ఇకపోతే ఈ సినిమా సుమారుగా రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు మలయాళంలో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. దీనికి తోడు ఈ సినిమా సీక్వెల్ ఉంటుంది అంటూ మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఫ్రాంచైజీలో తన తండ్రి మమ్ముట్టి , మాలీవుడ్ మెగాస్టార్ నటించబోతున్నట్లు దుల్కర్ స్వయంగా స్పందించడంతో అందరూ ఆ మూవీ కోసం ఎగ్జైట్ గా ఎదురు చూస్తున్నారు.

అసలు విషయంలోకి వెళ్తే.. సాధారణంగా సెలబ్రిటీ వారసులు ఇండస్ట్రీలోకి రావాలి అంటే తల్లిదండ్రుల సహాయం ఎంతో ఉంటుంది. కానీ మిగతా వారందరికీ కాస్త భిన్నం దుల్కర్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలోకి రావడానికి తన తండ్రి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగపడినా.. ఆ తర్వాత నుంచి తన సొంత టాలెంట్ తో ఒక్కో మెట్టు ఎదుగుతూ.. నేడు స్టార్ హీరోగా.. స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు సొంతం చేసుకున్నారు దుల్కర్.

ఇదిలా ఉండగా.. దుల్కర్ సల్మాన్ కెరియర్ కి 15 ఏళ్లు అవుతున్నప్పటికీ.. ఇప్పటికీ కూడా తన తండ్రితో కలిసి ఆయనకు నటించే అవకాశం కలగలేదు. పైగా సినిమాలలో మమ్ముట్టి ఏ రకంగా కూడా జోక్యం చేసుకోలేదు. తన తండ్రితో కలిసి నటించాలని గత 15 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న దుల్కర్ సల్మాన్ ఇప్పుడు ఆ కలను నెరవేర్చుకోబోతున్నట్లు స్పష్టం చేశారు.

ప్రస్తుతం ఈయన నటించి, నిర్మించిన కాంతా సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నారు దుల్కర్. నవంబర్ 14న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన మాట్లాడుతూ.. "లోకా ఫ్రాంఛైజీ లో మా నాన్న మమ్ముట్టి కూడా భాగం కాబోతున్నాడు. మేమిద్దరం కలిసి తొలిసారి తెరపై కనిపించనున్నాము. నిజానికి మా నాన్నతో కలిసి సినిమా చేయడం కోసం.. ఆయనను ఒప్పించడానికి నాకు 15 ఏళ్లు పట్టింది.

ఇది ఊరికే వచ్చింది కాదు.. నేను సంపాదించుకున్నది..లోక సినిమాకి అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ అవ్వడంతో నాన్న టెన్షన్ పడ్డారు. కానీ మేము ఊహించిన దాని కంటే ఎక్కువ హిట్ అయింది సినిమా. అందుకే నాన్న కూడా ఈ సినిమాలో భాగమవడానికి అంగీకరించారు" అంటూ దుల్కర్ తెలిపారు. ఇకపోతే లోక చాప్టర్ 1: చంద్ర సినిమాలో దుల్కర్ క్యామియో రోల్ పోషించగా.. ఇప్పుడు చాప్టర్ 2 లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.