మమ్ముట్టి మూవీపై తెలుగు ప్రజల దృష్టి!
మరి ఎవరు ఆ దర్శకుడు? ఎవరా హీరో ? ఏంటా సినిమా టైటిల్ ? తెలుగు ప్రజలు ఆ టైటిల్ పై ఆసక్తి కనబరచడానికి గల కారణం ఏమిటి ? అనే విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.
By: Madhu Reddy | 24 Jan 2026 6:00 PM IST84 సంవత్సరాల దర్శకుడితో 74 సంవత్సరాల వయసున్న స్టార్ హీరో మళ్ళీ 30 ఏళ్ల తర్వాత కలిసి నటించబోతున్నారు అని ఒక ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే ఈ సినిమా టైటిల్ చూసిన తర్వాత తెలుగు ప్రజల దృష్టి ఈ సినిమాలపై పడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి ఎవరు ఆ దర్శకుడు? ఎవరా హీరో ? ఏంటా సినిమా టైటిల్ ? తెలుగు ప్రజలు ఆ టైటిల్ పై ఆసక్తి కనబరచడానికి గల కారణం ఏమిటి ? అనే విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.
మలయాళం మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న మమ్ముట్టి తన తదుపరి సినిమా టైటిల్ శుక్రవారం రోజు అధికారికంగా ప్రకటించారు. మలయాళ చిత్ర పరిశ్రమలో దిగ్గజ దర్శకుడిగా పేరు దక్కించుకున్న 84 సంవత్సరాల వయసున్న అదూర్ గోపాలకృష్ణన్ దర్శకత్వంలో 74 ఏళ్ల మమ్ముట్టితో కలిసి పనిచేయనున్నారు. ఈ సినిమాకి 'పాదయాత్ర' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇకపోతే దాదాపు 30 ఏళ్ల తర్వాత మళ్లీ వీళ్లిద్దరి కలయికలో సినిమా రాబోతుండడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక వీరిద్దరూ కలిసి పనిచేయడం ఇది నాలుగవసారి కావడం విశేషం.
ఇందులో మమ్ముట్టితో పాటు జీనత్, శ్రీష్మ చంద్రన్, గ్రేస్ ఆంటోనీ, ఇంద్రాన్స్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇకపోతే మమ్ముట్టి సొంత బ్యానర్ పై మమ్ముట్టి కంపెనీ, ఆయన వారసుడు దుల్కర్ సల్మాన్ వేఫేరర్ ఫిలిమ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, మాటలను కెవి మోహన్ కుమార్ తో కలిసి అదూర్ గోపాలకృష్ణన్ స్వయంగా అందిస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ముజీబ్ మజీద్ వ్యవహరిస్తున్నారు.
ఇక ఇదంతా బాగానే ఉన్నా ఈ చిత్రానికి పాదయాత్ర అని టైటిల్ ఖరారు చేయడంతో తెలుగు ఆడియన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. ఎందుకంటే మమ్ముట్టి ఇదివరకే గతంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా యాత్ర సినిమా తెరకెక్కింది. దీనిపై రాజకీయంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ.. రాజశేఖర్ రెడ్డి పాత్రకు మమ్ముట్టి పూర్తి న్యాయం చేశారు. యాత్ర 2 లో కూడా ఆయన కొన్ని సన్నివేశాలలో నటించారు. ఇక విశేషం ఏమిటంటే ఇప్పుడు మమ్ముట్టి మలయాళం లో పాదయాత్ర పేరుతో ఇంకో సినిమా చేయడం విశేషం. నిజానికి తెలుగులో చేసిన యాత్రకు దీనికి సంబంధం లేకపోయినా పాదయాత్ర అనే టైటిల్ పెట్టడంతోనే తెలుగు ప్రేక్షకుల దృష్టి ఈ సినిమాపై పడింది. మరి టైటిల్ తోనే తెలుగు ప్రజల దృష్టిని ఆకర్షించిన మమ్ముట్టి ఈ సినిమాతో ఇలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి
