Begin typing your search above and press return to search.

మ‌మ్ముట్టి నిక‌ర ఆస్తుల విలువ‌?

మలయాళ చిత్ర‌సీమ‌లో మ‌మ్ముట్టి శిఖ‌రం ఎత్తు. ఐదు దశాబ్దాలకు పైగా ప్రేక్షకాభిమానుల‌ను అల‌రిస్తున్న‌ అగ్ర క‌థానాయ‌కుడు.

By:  Sivaji Kontham   |   8 Sept 2025 9:31 AM IST
మ‌మ్ముట్టి నిక‌ర ఆస్తుల విలువ‌?
X

మలయాళ చిత్ర‌సీమ‌లో మ‌మ్ముట్టి శిఖ‌రం ఎత్తు. ఐదు దశాబ్దాలకు పైగా ప్రేక్షకాభిమానుల‌ను అల‌రిస్తున్న‌ అగ్ర క‌థానాయ‌కుడు. వ‌య‌సుతో సంబంధం లేకుండా ఆయ‌న ఎప్ప‌టికీ అగ్ర క‌థానాయ‌కుడిగా వెలుగుతూనే ఉన్నారు. కెరీర్ లో ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌ల్లో న‌టించిన మ‌మ్ముట్టి భారతీయ సినిమాను ప్రేరేపించే ప్రమాణాలను నెలకొల్పిన ప్ర‌ముఖుడు. అనుభవంగల్ పాలిచకల్ (1971) అనే చిత్రంతో మ‌మ్ముట్టి క‌థానాయ‌కుడిగా అడుగుపెట్టారు. ఇప్ప‌టికీ ఆయ‌న ఎన్నో విల‌క్ష‌ణ‌మైన సినిమాల్లో న‌టిస్తూనే ఉన్నారు.

7 సెప్టెంబర్ 1951న జన్మించిన ఆయ‌న వ‌య‌సు ఇప్పుడు 74. అయితే ఆయ‌న 50 ఏళ్ల ప్ర‌యాణంలో సృష్టించిన సంప‌ద ఎంత‌? అంటే దానికి స‌మాధానం ఉంది. మమ్ముట్టి నికర ఆస్తుల విలువ సుమారు 340 కోట్లు. ఒక్కో సినిమాకి రూ.10-12 కోట్లు అందుకునే మ‌మ్ముట్టి, బ్రాండ్ ప్ర‌చారం ద్వారాను ఆర్జిస్తున్నారు. కేరళ, చెన్నై, బెంగళూరు, దుబాయ్‌లలో రియల్ ఎస్టేట్ లో భారీగా పెట్టుబ‌డులు పెట్ట‌గా, అవ‌న్నీ దిన‌దినాభివృద్ధి చెందాయి. కొచ్చిలోని ఒక సరస్సు ఒడ్డున ఉన్న బంగ్లా కూడా ఆయ‌న ఆస్తుల‌లో భాగం.

మ‌మ్ముట్టి కేవ‌లం న‌టుడు మాత్ర‌మే కాదు.. వ్య‌వ‌స్థాప‌కుడిగాను రాణించారు. కేర‌ళ‌లో ప్ర‌సిద్ధి చెందిన కైరాలీ టీవీ ఆయ‌న సొంతం. సినిమాల పంపిణీ రంగంలోను మ‌మ్ముట్టి రాణిస్తున్నారు. ఆయన కేరళ అంతటా థియేటర్లను సొంతంగా కలిగి ఉన్నారు. ఇది సినీరంగంలో ఆయ‌న, ఆయ‌న కుటుంబీకుల‌ ఉన్న‌తికి దోహ‌ద‌ప‌డుతోంది.

ప్ర‌స్తుతం మ‌మ్ముట్టి వార‌సుడు దుల్కార్ స‌ల్మాన్ భార‌త‌దేశంలో పాన్ ఇండియ‌న్ స్టార్ గా వెలుగొందుతున్నాడు. దుల్కార్ ఒక్కో సినిమాకి 10 కోట్లు పైగా పారితోషికం అందుకుంటున్నాడు. కలాంకావల్ అనే చిత్రంలో మ‌మ్ముట్టి- దుల్కార్ క‌లిసి న‌టిస్తున్నారు. ఇందులో మ‌మ్ముట్టి నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర‌లో న‌టిస్తుండ‌గా, అత‌డి చిన్న‌ప్ప‌టి వెర్ష‌న్ లో దుల్కార్ క‌నిపిస్తారు. జితిన్ కె జోస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి త్వ‌ర‌లో రిలీజ్ చేయ‌నున్నారు. ఈ ఆదివారం నాడు 74వ పుట్టిన‌రోజు జ‌రుపుకున్న మ‌మ్ముట్టి ఎప్ప‌టికీ ఇలానే ఆరోగ్యంగా మ‌రిన్ని ప‌ట్టిన‌రోజులు జ‌రుపుకోవాల‌ని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. `తుపాకి` త‌ర‌పున ప్ర‌త్యేకించి బ‌ర్త్ డే శుభాకాంక్ష‌లు.