Begin typing your search above and press return to search.

మెగాస్టార్ కార్లు అన్నింటికీ అందుకే 369!

చాలా మంది హీరోల‌కు ల‌క్కీ నెంబ‌ర్లు, ప్యాన్సీ నెంబ‌ర్లు అంటూ కొన్ని ఉంటాయి. వాటిని ఓ సెంటిమెంట్ గా భావిస్తుంటారు.

By:  Srikanth Kontham   |   8 Feb 2026 1:16 PM IST
మెగాస్టార్ కార్లు అన్నింటికీ  అందుకే 369!
X

చాలా మంది హీరోల‌కు ల‌క్కీ నెంబ‌ర్లు, ప్యాన్సీ నెంబ‌ర్లు అంటూ కొన్ని ఉంటాయి. వాటిని ఓ సెంటిమెంట్ గా భావిస్తుంటారు. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కు నెంబ‌ర్ 9 అంటే విపరీత‌మైన సెంటిమెంట్. ఎన్టీఆర్ కార్లు అన్నింటికీ9999 అనే నెంబర్ ఉంటుంది. ఆ నెంబ‌ర్ కోసం తార‌క్ ల‌క్ష‌ల రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తాడు. మెగాస్టార్ చిరంజీవి నెంబ‌వ‌ర్ వ‌న్ అంటే ఇష్టం. `1` లేదా `1111` నెంబ‌ర్ ని సెంటిమెంట్ గా భావిస్తారు. ఆయన కార్ల‌న్నీ అదే నెంబ‌ర్ ను క‌లిగి ఉంటాయి. సంఖ్యాశాస్త్రం ప్ర‌కారం అన్న‌య్య ఈ నెంబ‌ర్ ను ల‌క్కీగా భావిస్తారు. అలాగే సూప‌ర్ స్టార్

4005 నెంబ‌ర్ ను ఇష్ట‌ప‌డ‌తారు.

ఆయ‌న కార్లు అన్నింటికి ఇదే నెంబ‌ర్ ఉంటుంది. అంతేకాదు సినిమా రిలీజ్ తేదీల విష‌యంలో కూడా ఆ నెంబ‌ర్లు ఉండేలా చూసుకుంటారు. 4, 5 తేదీలు లేదా? చివ‌ర సున్నా ఉన్న తేదీలైతే బాగుంటుంద‌ని భావిస్తారు. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ కి ఓ ల‌క్కీ నెంబ‌ర్ ఉంది. అదే నెంబ‌ర్ వ‌న్. ప్రభాస్ తన కార్ల కోసం 1 అనే నెంబర్‌ను ప్రాధాన్యత ఇస్తుంటారు. బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ 555 నెంబ‌ర్ ఉండేలా చూసుకుంటారు. కారు నెంబ‌ర్ నుంచి ఇంటి నెంబ‌ర్ స‌హా అన్నింటా 5 ఉండేలా చూస్తారు. అలాగే స‌ల్మాన్ ఖాన్ పుట్టిన రోజు డిసెంబ‌ర్ 27.

దీంతో ఇదే నెంబ‌ర్ ను ఆయ‌న ల‌క్కీగా భావిస్తారు. ఆయ‌న వాడే బ్రాస్లెట్ కూడా ఒక రకమైన సెంటిమెంట్ గాఈ భావిస్తారు. బిగ్ బీ అమితాబ‌చ్చన్ పుట్టింది అక్టోబ‌ర్ 11. దీంతో అమితాబ్ 1+1=2 ని ఆయ‌న ల‌క్కీ నెంబ‌ర్ గా భావి స్తారు. తాజాగా మ‌ల‌యాళం మెగాస్టార్ మ‌మ్ముట్టి ల‌క్కీ నెంబ‌ర్ కూడా తెర‌పైకి వ‌చ్చింది. ఆయ‌న ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన కొత్తలో వెతికి వెతికి ఓ బ్రీఫ్ కేస్ కొన్నారు. దాని లాక్ కోడ్ 369 అట‌. అప్ప‌టి నుంచి ఆ సంఖ్య‌తో త‌న‌కి ప్ర‌త్యేక‌మైన అనుబంధం ఏర్ప‌డింద‌న్నారు. త‌న కార్లు అన్నింటికి అదే నెంబ‌ర్ ఉంటుంద‌న్నారు.

ఏదైనా హోట‌ల్ కి వెళ్లినా? అదే నెంబ‌ర్ గ‌ల రూమ్ ను తీసుకోవ‌డానికి ఆస‌క్తి చూపిస్తాన‌న్నారు. ఇంకా చాలా చోట్ల సంఖ్య అనే టాపిక్ రాగానే 369 గురించే ఎక్కువ‌గా చ‌ర్చిస్తాన‌న్నారు. మ‌మ్ముట్టి న‌టించిన 369వ చిత్రం `ఉండ‌`.

ఈ చిత్రం 2019 లో రిలీజ్ అయిన యాక్ష‌న్ డ్రామాకు ఖాలీద్ రెహ‌మాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. చ‌త్తీస్ ఘ‌డ్ న‌క్స‌ల్స్ ప్ర‌భావిత ప్రాంతంలో ఎన్నికల విధి నిర్వహణ కోసం వెళ్ళిన కేరళ పోలీస్ బృందం ఎదుర్కొన్న సవాళ్ల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఇందులో మమ్ముట్టి `మణి` అనే సబ్-ఇన్ స్పెక్టర్ పాత్రలో చాలా సహజంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ప్ర‌స్తుతం మ‌మ్ముట్టి సినిమాల సంఖ్య 400 దాటేసింది.