టాలీవుడ్ స్పెషల్ బ్యూటీస్ గా ఆ త్రయం!
టాలీవుడ్ లో సక్సెస్ అయినా భామలంతా బాలీవుడ్ అంటూ జంప్ అవుతున్నారు. ఒకేసారి పరిశ్రమకు దూరం కాకుండా తెలివిగా బ్యాలెన్స్ చేస్తూ దృష్టంతా హిందీ సినిమాలపై మళ్లీస్తున్నారు.
By: Srikanth Kontham | 9 March 2026 10:22 AM ISTటాలీవుడ్ లో సక్సెస్ అయినా భామలంతా బాలీవుడ్ అంటూ జంప్ అవుతున్నారు. ఒకేసారి పరిశ్రమకు దూరం కాకుండా తెలివిగా బ్యాలెన్స్ చేస్తూ దృష్టంతా హిందీ సినిమాలపై మళ్లీస్తున్నారు. రష్మిక మందన్న , శ్రీలీల, కీర్తి సురేష్, సమంత లాంటి వారు ఇదే ప్లాన్ లో ఉన్నారు. ఇక టాలీవుడ్ కి కొత్త భామల వెల్లువ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. వచ్చిన వారందరూ నిలదొక్కుకోలేరు. వాళ్ల లో కొందరికే స్థిరపడే అవకాశం ఉంటుంది. అయితే ఈ ముగ్గురు మాత్రం టాలీవుడ్ స్పెషల్ బ్యూటీలగా హైలైట్ అవుతున్నారు. మమితా బైజు, త్రిప్తీ డిమ్రి, ఇమాన్వీ ఇస్మాయిల్ తమదైన క్రేజ్‌తో టాలీవుడ్ భవిష్యత్తు స్టార్ హీరోయిన్లుగా మారుతున్నారు.
2026లో ముగ్గురు భామలు టాలీవుడ్ సమీకరణాలను మార్చేలా కనిపిస్తున్నారు. ఈ ముగ్గురు ఇంత వరకూ నటించిన ఒక్క తెలుగు సినిమా కూడా రిలీజ్ కాలేదు. కానీ రిలీజ్ కు ముందే మార్కెట్ లో సంచలనం అవు తున్నారు. తెలుగింట సోషల్ మీడియాలో ఈ ముగ్గురు భామల ఫాలోయింగ్ అసాధారణం. స్టార్ హీరోయిన్ల రేంజ్ లో అభిమానులు సంపాదించుకుంటున్నారు. మరి ఇదంతా ఎలా సాధ్యమైందంటే? మలయాళ చిత్రం `ప్రేమలు` రిలీజ్ అనంతరం సౌత్ ఇండియా మొత్తం మమితా బైజు నామజపం చేసింది. అమ్మడి క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, సహజమైన నటనకు తెలుగు యువత ఫిదా అయింది.
సొగసరి కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, ఎమోషన్స్‌ను పండించగలదని తొలి ప్రయత్నంలోనే నిరూపించుకుంది. ప్రస్తుతం సూర్య సరసన వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `విశ్వనాథ్ అండ్ సన్స్` లో నటిస్తోంది. ఇదే ఏడాది ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా కంటే ముందే? విజయ్ సరసన నటించిన `జన నాయగన్` తో అలరించనుంది.`యానిమల్` సినిమాతో నేషనల్ క్రష్‌గా మారింది త్రిప్తీ డిమ్రి. ఈ బ్యూటీకీ పాన్ ఇండియాలో మాములు క్రేజ్ లేదు.`స్పిరిట్` సక్సెస్ అయితే టాలీవుడ్ లో అమ్మడి రేంజ్ ఆకాశాన్నంటడం ఖాయం.
పాకిస్తాన్ బ్యూటీ ఇమాన్వీ ఇస్మైల్ ఒక్క డాన్స్ వీడియోతోనే సోషల్ మీడియాను షేక్ చేసింది. `ఫౌజీ` సినిమా కమిట్ మెంట్ అనంతరం ఆ వీడియో రిలీజ్ అవ్వడంతో నెట్టింట సంచలనంగా మారింది. అక్కడ `పౌజీ` ఇమేజ్ కూడా ఎంతో కలిసొచ్చింది. ప్రభాస్ సరసన నటిస్తోంది అన్న కారణం మరింత కలిసొచ్చింది. ఇన్స్టాగ్రామ్ డాన్స్ వీడియోలతో కోట్ల మంది మనసు గెలుచుకుంది. అమ్మడిని హను రాఘవపూడి `పౌజీ`కి ఎంపిక చేయడం వెనుక ఆమెలోని క్లాసిక్ బ్యూటీ తెరపైకి వచ్చింది. ఇలా ముగ్గురు భామలు టాలీవుడ్ లో సంచలనంగా మారారు.
