ప్రేమలు బ్యూటీ బంగారం లాంటి మనసు.. వీడియా వైరల్..!
ప్రేమలు సినిమాతో సౌత్ ఆడియన్స్ మనసులు దోచేసింది మమితా బైజు. ఆ సినిమాలో అమ్మడు యాక్టింగ్ కి యూత్ ఆడియన్స్ అయితే ఫిదా అయిపోయారు.
By: Ramesh Boddu | 18 Oct 2025 9:27 AM ISTప్రేమలు సినిమాతో సౌత్ ఆడియన్స్ మనసులు దోచేసింది మమితా బైజు. ఆ సినిమాలో అమ్మడు యాక్టింగ్ కి యూత్ ఆడియన్స్ అయితే ఫిదా అయిపోయారు. ఆ తర్వాత మమితాకు వరుస ఆఫర్లు వచ్చాయి. ఆల్రెడీ తమిళ్ లో సినిమాలు చేస్తున్న మమితా బైజు తెలుగులో డ్యూడ్ సినిమాతో తెరంగేట్రం చేసింది. ప్రదీప్ రంగనాథన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న మమితా బైజు సినిమాలో తన యాక్టింగ్ తో మెప్పించింది. డ్యూడ్ సినిమాలో మమితా, ప్రదీప్ ఇద్దరు తమ నటనతో అలరించారు.
అందమైన అమ్మాయిలు అంతే అందమైన మనసు కలిగి ఉంటే..
ఐతే అందమైన అమ్మాయిలు అంతే అందమైన మనసు కలిగి ఉంటే ఇంకా బాగుంటుంది. ఆ విషయంలో మమితా బైజు ఇంప్రెస్ చేస్తుంది. డ్యూడ్ చెన్నై ఈవెంట్ లో ఆమెతో ఫోటో దిగేందుకు ఒక అభిమాని ప్రయతించాడు. అతను హెల్త్ పరంగా ఇబ్బంది పడుతున్నట్టు గమనించిన మమితా బైజు అతని చెయి పట్టుకుని హెల్ప్ చేస్తూ అతనికి సెల్ఫీ ఇచ్చింది. తన మీద అభిమానంతో వచ్చిన అతనికి మమితా చూపించిన ప్రేమ అతన్ని టచ్ చేసింది. అతన్నే కాదు అది వీడియో రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ప్రస్తుతం ఈ వీడియో చూసిన ఆడియన్స్ అంతా కూడా మమితా ఈజ్ బ్యూటిఫుల్ ఇన్ అండ్ అవుట్ అనేస్తున్నారు. అంత మంచి మనసు ఉంది కాబట్టే తను చేస్తున్న పాత్రలతో మమితా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటుందని అంటున్నారు. ప్రేమలు డబ్బింగ్ సినిమానే అయినా మమితా తెలుగు ఆడియన్స్ ప్రేమను గెలుచుకుంది. ప్రదీప్ తో డ్యూడ్ సినిమా చేసి మెప్పించిన ఈ చిన్నది నెక్స్ట్ సూర్య సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది.
మమితా బైజు తెలుగులో వరుస సినిమాలు చేయాలని..
మమితా బైజుకి మలయాళంలో కూడా సూపర్ పాపులారిటీ ఉంది. అమ్మడు అక్కడి సినిమాలతో బిజీగా ఉంటుంది. ఐతే తెలుగు, తమిళ్ నుంచి వస్తున్న అవకాశాలను కాదనలేకపోతుంది. మమితా బైజు తెలుగులో వరుస సినిమాలు చేయాలని ఆమెను అభిమానిస్తున్న తెలుగు ఆడియన్స్ కోరుతున్నారు. ఏది ఏమైనా మమితా ఒక సినిమా చేస్తే అందులో కచ్చితంగా తన మార్క్ నటనతో మెప్పిస్తుందని ప్రూవ్ మరోసారి డ్యూడ్ తో ప్రూవ్ చేసింది అమ్మడు.
మమితా బైజు సినిమాలతో పాటు ఆమె సోషల్ మీడియా వీడియోస్ కూడా చాలా వైరల్ అవుతుంటాయి. ప్రేమలు టైం లో ఆమె ఐస్ క్రీం తింటున్న టైం లో ఒక ఫ్యాన్ వచ్చి సెల్ఫీ అడిగితే ఆమె ఇచ్చే వీడియో వచ్చింది. దానితో పాటు ఇప్పుడు ఒక వ్యక్తికి ఆమె ప్రేమతో సెల్ఫీ ఇచ్చిన వీడియో వైరల్ అయ్యింది. మొత్తానికి సినిమాల్లో కాదు మమితా ఇలా తన స్పెషల్ వీడియోస్ తో కూడా ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదిస్తుంది.
