సాంప్రదాయం, చిలిపిదనం కలిస్తే మమితా బైజు.. ఇదిగో ఇదే ప్రూఫ్!
మలయాళీ ముద్దుగుమ్మ మమితా బైజు తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో .. అద్భుతమైన నటనతో యూత్‌లో విపరీతమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.
By: Sivaji Kontham | 30 Sept 2026 10:39 PM ISTమలయాళీ ముద్దుగుమ్మ మమితా బైజు తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో .. అద్భుతమైన నటనతో యూత్‌లో విపరీతమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. `ప్రేమలు` సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని సినీ పరిశ్రమల్లోనూ క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఏ చిన్న పోస్ట్ పెట్టినా క్షణాల్లో వైరల్ అవుతుండటం విశేషం.
తాజాగా మమితా బైజు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కొన్ని కొత్త ఫోటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ``విస్పర్స్ ఆఫ్ సిల్క్ అండ్ లైట్`` అనే క్యాప్షన్‌తో ఈ బ్యూటీ షేర్ చేసిన ఈ అందమైన ఫోటోలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. సంప్రదాయ సిల్క్ దుస్తుల్లో దేవకన్యలా మెరుస్తున్న తన గ్లామర్, క్యూట్ స్మైల్ నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి.
ఈ ట్రెండీ లుక్ వెనుక పెద్ద టీమ్ శ్రమ ఉంది. ప్రముఖ డిజైనర్ దీప్తి అందించిన అవుట్‌ఫిట్ ధరించగా.. అర్చన అఖిల్ రావు స్టైలింగ్ చేశారు. కర్ణిక జ్యువెల్స్ వారి ఆభరణాలు.. ఫోటోగ్రాఫర్ విష్ణు అందించిన అద్భుతమైన కెమెరా యాంగిల్స్ ఈ ఫొటోషూట్‌ను మరింత హైలైట్ చేశాయి. ఇక హెయిర్ అండ్ మేకప్ అందించిన టీమ్ సహకారంతో మమితా రూపం మరింత కళకళలాడుతోంది. ట్రెడిషన్ ప్లస్ అందం అంటూ ఈ లుక్ పై ప్రశంసలు కురుస్తున్నాయి.
ఫోటోలు పోస్ట్ చేసిన క్షణాల వ్యవధిలోనే లైకులు, కామెంట్ల వర్షం కురుస్తోంది. అభిమానులు ఈ బ్యూటీని `నేషనల్ క్రష్` అని, `మాతా పితా మమిత` అంటూ రకరకాల కామెంట్లతో అభినందిస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో లనా డెల్ రే పాటను జోడించడం కూడా ఈ పోస్ట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. మొత్తానికి మమితా బైజు తాజా లుక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
మమితా బైజు నటించిన చిత్రాల్లో `ప్రేమలు` (2024) కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచి దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. అలాగే విభిన్న కథాంశాలతో రూపొందిన `సూపర్ శరణ్య` (2022), `ఆపరేషన్ జావా` (2021), `ప్రణయ విలాసం`(2023) నటిగా మంచి పేరు తెచ్చాయి. ఇటీవలి కాలంలో భారీ వసూళ్లను సాధించిన `బెత్లెహెం కుటుంబ యూనిట్` (2026) నటిగా తన కెరీర్ లో మరో మైలురాయిగా మారింది.
