Begin typing your search above and press return to search.

ఈ అమ్మడిలో ఏదో మ్యాజిక్ ఉందబ్బా..!

ప్రేమలు హీరోయిన్ మమితా బైజు ఏం చేసినా అదో సెన్సేషన్ అవుతుంది. మలయాళ పరిశ్రమలో దాదాపు ఆరేడేళ్ళ క్రితం నుంచి సినిమాలు చేస్తున్న అమ్మడు లాస్ట్ ఇయర్ వచ్చిన ప్రేమలు సినిమాతో సూపర్ పాపులర్ అయ్యింది.

By:  Ramesh Boddu   |   20 Oct 2025 9:28 AM IST
ఈ అమ్మడిలో ఏదో మ్యాజిక్ ఉందబ్బా..!
X

ప్రేమలు హీరోయిన్ మమితా బైజు ఏం చేసినా అదో సెన్సేషన్ అవుతుంది. మలయాళ పరిశ్రమలో దాదాపు ఆరేడేళ్ళ క్రితం నుంచి సినిమాలు చేస్తున్న అమ్మడు లాస్ట్ ఇయర్ వచ్చిన ప్రేమలు సినిమాతో సూపర్ పాపులర్ అయ్యింది. తన క్యూట్ లుక్స్ తో కుర్రాళ్ల హృదయాలను గెలిచేసింది మమితా బైజు. ప్రేమలు తర్వాత తెలుగులో డ్యూడ్ తో మరో సర్ ప్రైజ్ ఇచ్చింది మమితా బైజు. యూత్ హీరో ప్రదీప్ రంగనాథన్ తో మమితా బైజు చేసిన ఈ డ్యూడ్ యూత్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది.

సోషల్ మీడియా సెన్సేషన్ గా..

మమితా బైజు ఏదైనా సినిమా చేసిందంటే చాలు ఆమె సోషల్ మీడియా సెన్సేషన్ గా మారుతుంది. సినిమాలో ఆమె రోల్, ఆమె నటన ఎంత ఇంపాక్ట్ చేస్తాయో తెలిసిందే. ఐతే దానికి మించి ఈవెంట్స్ లో ఆమె యాక్టివిటీస్ అలరిస్తాయి. స్వతహాగా డాన్స్ అంటే ఇష్టం ఉన్న మమితా బైజు తన సినిమా ఈవెంట్ లో డాన్స్ తో అలరిస్తుంది. ఇక ఆమె క్యూట్ స్టిల్స్ ఫోటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి.

అవి చూస్తూ అలా ఉండిపోవాలి అనిపించేలా ఆడియన్స్ భావన ఉంటుంది. అందుకే ఈ అమ్మడిలో ఏదో మ్యాజిక్ ఉందబ్బా అని అనుకుంటారు ఆడియన్స్. నటిగా తనను తాను ప్రూవ్ చేసుకుంటూ మమితా చేస్తున్న సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. తప్పకుండా అమ్మడికి ఇంకా మంచి పాత్రలు పడాలి.. చాలా పెద్ద స్థాయికి చేరుకోవాలని ఆమెని అభిమానించే ఆడియన్స్ కోరుతున్నారు.

మమితా కూర్చున్నా.. నవ్వినా.. డాన్స్ మూమెంట్ వేసినా..

ప్రేమలుతో పలకరించి యువత హృదయాలను కొల్లగొట్టిన ఈ చిన్నది డ్యూడ్ లో కూడా తన బెస్ట్ ఇచ్చింది. ఇక మరోపక్క సూర్య వెంకీ అట్లూరి కాంబో సినిమాలో మమితా ఛాన్స్ అందుకుంది. దళపతి విజయ్ జన నాయగన్ సినిమాలో కూడా మమితా నటిస్తుంది. ఈ సినిమాలన్నీ ఆమెకు మరింత క్రేజ్ తెచ్చేలా ఉన్నాయి. సినిమాల పరంగా ఎలా ఉన్నా మమితా అలా ఈవెంట్స్ లో కనిపిస్తే చాలు సోషల్ మీడియా అంతా షేక్ అయ్యేలా అమ్మడు వైరల్ అయిపోతుంది.

మిగతా హీరోయిన్స్ ఆడియన్స్ అటెన్షన్ కోసం ఏదేదో చేస్తుంటారు. కానీ మమితా అలా కూర్చున్నా.. అలా నవ్వినా.. ఏదో ఒక డాన్స్ మూమెంట్ వేసినా అన్నీ కూడా ఆమెకు కలిసి వస్తున్నాయి. తన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న మమితాను ఆడియన్స్ ఎంత ఇష్టపడుతున్నారు అన్నది ఆమెకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ చూస్తే అర్ధమవుతుంది.

న్యాచురల్ బ్యూటీగా మమితా ఇంపాక్ట్ చూపిస్తుంది. డ్యూడ్ తర్వాత అమ్మడు మరిన్ని స్ట్రైట్ తెలుగు సినిమాలు చేయాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు. ఐతే నచ్చిన పాత్ర వస్తేనే కానీ ఎలాంటి మొహమాటాలకు పోయి సినిమా సైన్ చేయదట మమితా. సో నెక్స్ట్ తెలుగు మూవీ కోసం మమితా ఫ్యాన్స్ కొన్నాళ్లు వెయిట్ చేయక తప్పదు.