నచ్చనంత కాలం ఒకే..మనసుకు నచ్చితేనే సమస్య?
సోషల్ మీడియా ద్వారానే కాకుండా తన ఫోన్ నెంబర్ తెలుసుకుని కూడా చాలా మంది ప్రపోజ్ చేస్తున్నారుట.
By: Srikanth Kontham | 24 Dec 2025 2:00 AM ISTప్రేమ వ్యవహారాలు ఎవరైనా గోప్యంగా ఉంచడానికే చూస్తారు. ఇంట్లో చెప్పాలంటే భయపడతారు. ధైర్యం చేసి చెబి తే పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారు? అన్నయ్యలు ఎలా తీసుకుంటారు? కొడతారు..తిడతారు..ఇంట్లో తాళాలేసి బంధీని చేస్తారు? అనే భయం చాలా మందిలో ఉంటుంది. అందుకు సెలబ్రిటీలు కూడా మినహా యింపు కాదు. కొంత మంది హీరోయిన్లకు ఇంట్లో స్వేచ్ఛ ఉంటుంది. మరికొంత మంది మందికి అలాంటి స్వేచ్ఛ ఉండదు.సెలబ్రిటీలు అంటేనే ప్రేమ వివాహాలకు పెట్టింది పేరుగా కనిపిస్తారు. కాబట్టి వాళ్ల జీవితాల్లో ప్రేమ అన్నది చాలా లైట్ గా తీసుకునే అంశం. మలయాళ నటి మమితా బైజు కూడా ఆ టైపే.
అమ్మడు హీరోయిన్ గా ఫేమస్ అయిన తర్వాత లవ్ ప్రపోజల్స్ ఎక్కువగా వస్తున్నాయట. సోషల్ మీడియా ద్వారానే కాకుండా తన ఫోన్ నెంబర్ తెలుసుకుని కూడా చాలా మంది ప్రపోజ్ చేస్తున్నారుట. అయితే వాటికి చూడటానికి ..రిప్లై ఇవ్వడానికి కూడా తనకి సమయం లేకపోవడంతో ఆ బాధ్యతను అన్నయ్యకు అప్పచెప్పిందిట. వాటన్నింటికి అతడే రిప్లై ఇస్తాడుట. ఇంత వరకూ బాగానే ఉంది. ముక్కు ముఖం తెలియని వారి నుంచి ఎన్నో ప్రపోజల్స్ వస్తాయి? కాబట్టి వాటికి ఎవరు బధులి చ్చిననా ఇబ్బందేమి ఉండదు. ఎందుకంటే అందరికీ రిజెక్షన్ వెళ్తుంది కాబట్టి.
మరి తాను మెచ్చిన చెలికాడు పరిచయమైనా అమ్మడు ఇలాగే వ్యవహరిస్తుందా? అప్పుడు కూడా ఫోన్ అన్నయ్య చేతుల్లోనే పెట్టి మెసెజ్ పెట్టమంటుందా? మమితా బైజు ఇంత వరకూ ప్రేమలో పడలేదు. ఎవర్నీ ప్రేమించలేదు కాబట్టి ఫోన్ అన్నయ్య చేతుల్లో పెట్టి రిజెక్షన్ కొట్టమంది. అదే ఓ యువకుడికి మనసిచ్చిన తర్వాత కూడా అంతే ధైర్యంగా ఫోన్ ఇవ్వగలదా? కాళు చేతులు ఒణికిపోవు. అప్పుడు అదే అన్నయ్యను ఒప్పించడానికి అమ్మడు నానా పాట్లు పడాల్సి ఉంటుంది. రిజెక్షన్ కాబట్టి అన్నయ్య కూడా చెల్లెలకు మద్దతుగా నిలుస్తున్నాడు.
తాను ఓ అబ్బాయిని ప్రేమించినానని నేరుగా ముందుకు తీసుకొస్తే? ఆ అన్నయ్య కు ఇంట్లొకి స్వాగతించేంత గొప్ప మనసు ఉందా? అన్నది ఆమెకే తెలియాలి. ఎందుకంటే బాలీవుడ్ లో ఓ నటి విషయంలో ఇదే జరిగింది. చెల్లెలు అంటే ఇద్దరు అన్నయ్యలకు ఎంతో ఇష్టం. ఎంతో వైభవంగా చెల్లి పెళ్లి చేయాలను కున్నారు. తాను కోరుకున్న వ్యక్తితోనే వివాహమైతే బాగుంటుందని భావించారు. కానీ తీరా మనసుకు నచ్చిన కుర్రాడు దొరికాడు. పెళ్లి చేసుకుంటానని అదే అన్నయ్యల ముందుకెళ్తే చీదరించుకున్నారు. అప్పటి వరకూ స్నేహితులుగా మెలిగిన ఆ అన్నాచెల్లి అప్పటి నుంచి శత్రువుల్లా మారిన ఉదంతాలు లేకపోలేదు.
