బెస్ట్ ఛాయిస్ గా మారుతున్న యంగ్ హీరోయిన్స్.. నిలదొక్కుకునేది ఎవరు?
సినిమా ఇండస్ట్రీలో హీరోలతో పోల్చుకుంటే హీరోయిన్స్ కి లైఫ్ టైం చాలా తక్కువ.
By: Madhu Reddy | 20 July 2026 11:20 AM ISTసినిమా ఇండస్ట్రీలో హీరోలతో పోల్చుకుంటే హీరోయిన్స్ కి లైఫ్ టైం చాలా తక్కువ. అందుకే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ బిజీగా మారిపోతూ ఉంటారు. ఇకపోతే నేటి కాలంలో యంగ్ హీరోయిన్స్ తమ అద్భుతమైన నటనతో అందంతో ఆకట్టుకుంటూ యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొట్టేస్తున్నారు. అంతేకాదు తమ ప్రతిభతో వరుస అవకాశాలు అందుకుంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.అలా ఈ మధ్యకాలంలో తరచుగా వినిపిస్తున్న హీరోయిన్స్ విషయానికి వస్తే.. మమిత బైజు , కాయాదు లోహర్, ప్రీతి ముకుందన్, రుక్మిణి వసంత్ లాంటి యంగ్ హీరోయిన్లు వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటూ నేటితరం హీరోలకు బెస్ట్ ఛాయిస్ గా మారుతున్నారు.
అలా ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ గా మారిన యంగ్ హీరోయిన్స్ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సింది మమిత బైజు.. ప్రేమలు సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈమె.. ఇప్పుడు వరుసగా అవకాశాలు అందుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది. అందులో భాగంగానే జననాయగన్ చిత్రంలో నటించింది. ఈ సినిమా జూలై 23న విడుదల కానుంది. అలాగే ఆగస్టు 14వ తేదీన సూర్య ప్రధాన పాత్రలో నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ విడుదల కానుంది. అలాగే ఆగస్టు 21న బెత్లెహేమ్ కుటుంబ యూనిట్ అనే చిత్రంలో నటించింది. పైగా ఈ చిత్రంలో మమిత సరికొత్త పాత్రలో కనిపించనుంది. ఒక సాధారణ స్థాయి నుండి సూర్యా, నివిన్ పౌలి, విజయ్ వంటి దిగ్గజ నటులతో కలిసి నటించే స్థాయికి నమిత ఎదిగిన తీరు చాలా అద్భుతంగా ఉంది అని చెప్పాలి. మరి ఈ చిత్రాలు ఆమెకు ఎలాంటి విజయాన్ని అందిస్తాయో చూడాలి.
ఈ జాబితాలో అందరినీ ఆకట్టుకుంటున్న మరో హీరోయిన్ కాయాదు లోహర్. తెలుగు ,తమిళ్, మలయాళం చిత్రాలలో నటిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె.. ఇమ్మోర్టల్ అనే తమిళ చిత్రంతోపాటు నాని ది ప్యారడైజ్ సినిమాలో కూడా నటిస్తోంది. అలాగే దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న మలయాళ యాక్షన్ చిత్రంలో కూడా హీరోయిన్ గా ఎంపికైంది. అంతే కాదు టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో హోం భలే ఫిలిమ్స్ బ్యానర్ పై వస్తున్న సూర్య 48వ చిత్రంతోపాటు శింబు 49వ చిత్రంలో కూడా హీరోయిన్ గా ఎంపికైంది కాయాదు లోహర్.
కన్నప్ప సినిమాతో డిజాస్టర్ ను మూటగట్టుకున్న ప్రీతి ముకుందన్ ఇందులో తన నటనతో అందరినీ అబ్బురపరిచింది. ఇక ఇటీవల బ్లాస్ట్ సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఈమె.. ఇదయం మురళి అనే చిత్రంలో కూడా నటించింది. ఇక ఇప్పుడేమో ఏమో ఏమో ఇది అనే తెలుగు చిత్రంతోపాటు నాగ్జిల్లా అనే బాలీవుడ్ చిత్రంలో కూడా హీరోయిన్ గా ఎంపిక అయింది. అలాగే హరీష్ కళ్యాణ్ తో కలిసి దశమకన్ అనే తమిళ చిత్రంలో కూడా హీరోయిన్గా నటిస్తోంది.
ఈ జాబితాలో చేరిన మరో బ్యూటీ రుక్మిణి వసంత్. కాంతార: చాప్టర్ వన్ సినిమాలో కనకావతి పాత్రతో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈమె.. ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. అలాగే యశ్ టాక్సిక్ సినిమాలో కూడా నటిస్తోంది . వీటితోపాటు మరికొన్ని చిత్రాలలో హీరోయిన్గా ఎంపికైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా ఈ యంగ్ హీరోయిన్స్ అంతా కూడా నేటి జనరేషన్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ గా పేరు దక్కించుకొని తమ మాసివ్ లైనప్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. మరి ఈ నలుగురిలో స్టార్ హీరోయిన్ గా ఎవరు పేరు సొంతం చేసుకుంటారో చూడాలి.
