Begin typing your search above and press return to search.

శ్ర‌మ‌ను దోచుకుంటున్నారంటూ న‌టి ఆవేద‌న‌!

`ప్రేమలు` బ్యూటీ మ‌మితా బైజు ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. అమ్మ‌డు తెలుగు సినిమాల్లో న‌టించ‌క‌ముందే బోలెడంత పాపులారిటీ ద‌క్కించుకుంది.

By:  Srikanth Kontham   |   23 April 2026 6:00 AM IST
శ్ర‌మ‌ను దోచుకుంటున్నారంటూ న‌టి ఆవేద‌న‌!
X

`ప్రేమలు` బ్యూటీ మ‌మితా బైజు ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. అమ్మ‌డు తెలుగు సినిమాల్లో న‌టించ‌క‌ముందే బోలెడంత పాపులారిటీ ద‌క్కించుకుంది. ప్ర‌స్తుతం త‌మిళ‌, మ‌ల‌యాళ సినిమాలతో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతోంది. తాజాగా మ‌మితా బైజు నటించిన `జన నాయగన్` చిత్రానికి సంబంధించిన కీలకమైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో లీక్ కావడం సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసిన సంగ‌తి తెలిసిందే. అనుకోని ఈ సంఘటనపై మమితా బైజు ఆవేదన చెందింది. ఈ లీక్‌పై మమితా మాట్లాడుతూ, ` జ‌న‌నాయ‌గ‌న్ లీకు గురించి నా సోద‌రుడు ద్వారా తెలిసింది. తొలుత న‌మ్మ‌లేదు.

ఎందుకంటే సోష‌ల్ మీడియాలో వినిపించేవ‌న్నీ వాస్త‌వాలు కాదు క‌దా. ఉద్దేశ పూర్వ‌కంగా కొంద‌రు ప్ర‌చారం చేస్తున్నార‌కున్నా. కానీ అది నిజం కావ‌డం దుర‌దృష్టం క‌రం. చాలా కష్టపడి ఒక సినిమాను రూపొంది స్తున్నప్పుడు ఇలాంటి లీకులు రావడం ఎంతో బాధ కలిగిస్తుంది. ఇది కేవలం వీడియో క్లిప్ మాత్రమే కాదు. టీమ్ పడ్డ శ్రమను దెబ్బతీయడమే. సాంకేతికత పెరిగిన ఈ రోజుల్లో ఇలాంటి సంఘటనలను అరికట్టడం సవాల్‌గా మారిందని అభిప్రాయపడ్డారు. అలాగే జ‌ననాయ‌గ‌న్ విజ‌యంపైనా ధీమా వ్య‌క్తం చేసింది. క‌థాబ‌లం ఉన్న చిత్రాల‌ను ప్రేక్ష‌కులు ఎప్పుడూ ఆద‌రిస్తార‌ని, ఆలాంటి చిత్రాల్ని ఎలాంటి లీకులు ఆప‌లేవంది.

అలాగే అమ్మ‌డు న‌టిస్తోన్న `క‌ర` సినిమా సెట్స్ లో ఉన్న నేప‌థ్యంలో ఆవిష‌యాలు పంచుకుంది. ధ‌నుష్ సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డ‌తారు. రోజంతా ప‌నిచేసినా ఆయ‌న అలిసిపోవ‌డం చూడ‌లేదు. ప‌ని ప‌ట్ల ఎంత నిబ‌ద్ద‌త‌గా ఉండాల‌నేది ఆయ‌న్ని చూసి నేర్చుకున్నా. రోటీన్ పాత్ర‌ల‌కు ఆయ‌నెప్పుడూ దూరంగానే ఉంటారు. నా కెరీర్‌లో ఇదో విభిన్నమైన పాత్ర అని మమితా వెల్లడించింది. `ప్రేమలు`లో కనిపించిన చురుకైన అమ్మాయి పాత్రకు భిన్నంగా, ఇందులో భావోద్వేగాలతో కూడిన నటనకు అవకాశం ఉన్న పాత్రను పోషిస్తున్నట్లు తెలిపింది. ఈ సినిమా కథాంశం , మేకింగ్ స్టైల్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని ధీమా వ్యక్తం చేసింది.

ప్ర‌స్తుతం అమ్మ‌డికి మలయాళంతో పాటు తెలుగు భాషల నుండి కూడా భారీ ఆఫర్లు వస్తున్నాయి. సహజ సిద్ధమైన నటనతో అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ హోదాకు దగ్గరవుతున్న మ‌మిత కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. `జన నాయగన్`, `కారా` చిత్రాల విజ‌యాల‌తో ఆమె రేంజ్ మరింత పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మ‌మితా బైజు వ్యక్తిగత ఎదుగుదలపై కూడా ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. నటన అనేది నిరంతరం నేర్చుకునే ప్రక్రియ అని ప్రతి సినిమా సెట్‌లోనూ తాను కొత్త విషయాలను తెలుసుకుంటున్నానని తెలిపింది. ముఖ్యంగా భాషా పరమైన ఇబ్బందులు ఎదురైనా? ఇతర భాషా చిత్రాల్లో నటించడం తనలోని నటిని మరింత పరిణితి చెందేలా చేస్తోందని అభిప్రాయపడింది.