తెలుగులోనూ సూపర్ స్ట్రైక్ రేట్.. లక్కీ గర్ల్ లెక్క ఎంతంటే?
ఒక సినిమా హిట్ అయితే అదృష్టం అంటారు. రెండు వరుస విజయాలు వస్తే ఫామ్ లో ఉందంటారు.
By: M Prashanth | 5 Sept 2026 1:18 PM ISTఒక సినిమా హిట్ అయితే అదృష్టం అంటారు. రెండు వరుస విజయాలు వస్తే ఫామ్ లో ఉందంటారు. కానీ.. తాను నటించిన సినిమాలు వరుసగా విజయాలు అందుకుంటే? ఇప్పుడు యంగ్ హీరోయిన్ మమితా బైజు విషయంలో ఇదే చర్చ జరుగుతోంది. ప్రేమలుతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆ మాలీవుడ్ బ్యూటీ.. ఇప్పుడు వరుస విజయాలతో టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ గా మారుతోంది.
మమితా బైజుకు ప్రేమలు సినిమా భారీ గుర్తింపు తీసుకొచ్చింది. క్యూట్ ఎక్స్ప్రెషన్స్, నేచురల్ యాక్టింగ్, అమాయకమైన లుక్స్ తో తెలుగు యువతను ఆకట్టుకుంది. ఆ సినిమా తర్వాత మమితకు వచ్చిన క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో ఆమె నటిస్తున్న సినిమాలపై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఇటీవల మమిత నటించిన మూడు సినిమాలు తక్కువ వ్యవధిలోనే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దాదాపు 29 రోజుల వ్యవధిలో మూడు చిత్రాలు ఆ మార్క్ దాటేశాయ్!
దీంతో భారతీయ సినీ పరిశ్రమలో ఇలాంటి అరుదైన బాక్సాఫీస్ హ్యాట్రిక్ సాధించిన తొలి నటిగా మమిత పేరు వినిపిస్తోంది. దళపతి విజయ్ నటించిన జన నాయకుడులో మమిత కీలక పాత్రలో కనిపించింది. విజయ్ చివరి చిత్రంగా భారీ అంచనాలతో విడుదలైన ఆ సినిమాలో విజ్జి పాత్రలో కనిపించిన మమితకు మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత సూర్య హీరోగా వచ్చిన విశ్వనాథ్ అండ్ సన్స్ లోనూ మమిత నటించింది.
అల్లరి చేసే అమ్మాయిగా కనిపిస్తూనే ఎమోషనల్ సీన్స్ లోనూ ఆకట్టుకుంది. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు సమాచారం. వరుసగా వస్తున్న విజయాలతో మమిత క్రేజ్ మరింత పెరిగింది. ఇప్పుడు నివిన్ పౌలి సరసన మమిత నటించిన బెత్లెహోమ్ కుటుంబ యూనిట్ కూడా అదే జోరును కొనసాగిస్తోంది. మలయాళంలో విడుదలైన ఈ సినిమా ఇప్పటికే రూ.200 కోట్ల మార్క్‌ను దాటినట్లు సమాచారం.
ఆ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. సినిమాలో మమిత పోషించిన ఆష్లే పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆమె క్యూట్ ఎక్స్ప్రెషన్స్, నేచురల్ యాక్టింగ్ తోపాటునివిన్ పౌలితో కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే కెరీర్ జోరందుకోవడంతో మమిత సంపాదనపైనా ఆసక్తి పెరుగుతోంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు సాలిడ్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు టాక్.
సినిమాలతో పాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా కూడా ఆమె ఆదాయం పొందుతున్నట్లు సమాచారం. మమితా బైజు నెట్ వర్త్ రూ.15 కోట్లకుపైగా వరకు ఉంటుందని వినికిడి. కొన్ని ప్రాపర్టీస్ తోపాటు సూపర్ కార్స్ కూడా ఉన్నట్లు సమాచారం. ఏదేమైనా వరుస విజయాలు.. పెరుగుతున్న క్రేజ్.. కోట్లలో పారితోషికం.. పెరుగుతున్న బ్రాండ్ వాల్యూ ఇవన్నీ చూస్తుంటే మమిత ప్రస్తుతం సౌత్ లో మోస్ట్ వాంటెడ్ యంగ్ హీరోయిన్లలో ఒకరిగా మారిందనడంలో డౌట్ అక్కర్లేదు. మరి లక్కీ గర్ల్ సక్సెస్ స్ట్రైక్ రేట్ ను ఇంకా ఎన్ని సినిమాలు కొనసాగిస్తుందో చూడాలి.
