తెలుగు సినిమాకు రూ.4 కోట్లు డిమాండ్ చేసిన మ్యాడీ
విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలో కొన్ని సీన్స్ లో ఏకంగా స్టార్ హీరో సూర్యను డామినేట్ చేసే విధంగా నటించింది అంటూ కొందరు రివ్యూల్లో రాసిన విషయం తెల్సిందే. అందుకే మమిత క్రేజ్ ఒక్కసారిగా పెరిగింది.
By: Ramesh Palla | 31 Aug 2026 9:00 PM ISTమలయాళి ముద్దుగుమ్మ మమితా బైజు ఒక్కసారిగా టాప్ ఆఫ్ ది సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అయింది. ఈమె నటిగా ఇండస్ట్రీలో అkడుగు పెట్టి దాదాపుగా పదేళ్లు అవుతుంది. అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు వరుస సక్సెస్‌లను సొంతం చేసుకుంది. 2024లో వచ్చిన ప్రేమలు సినిమాతో తమిళ్, తెలుగు భాషల్లోనూ పాపులారిటీ సొంతం చేసుకున్న మమితా బైజు తాజాగా విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాతో స్టార్ హీరోయిన్స్ జాబితాలో చేరి పోయింది. అందంతో పాటు అభినయం కావాలంటే మమిత బైజును తమ సినిమాల్లో ఎంపిక చేసుకోవాలి అనుకునే స్థాయికి ఆమె చేరింది అంటే ఆమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలో కొన్ని సీన్స్ లో ఏకంగా స్టార్ హీరో సూర్యను డామినేట్ చేసే విధంగా నటించింది అంటూ కొందరు రివ్యూల్లో రాసిన విషయం తెల్సిందే. అందుకే మమిత క్రేజ్ ఒక్కసారిగా పెరిగింది.
మమిత బైజు వరుస హిట్స్...
ఇన్నాళ్లు మలయాళ సినిమాలు మాత్రమే చేసిన మమిత బైజు గత ఏడాది కాలంగా పూర్తిగా తమిళ సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చింది. ఎట్టకేలకు ఆమె ఒక మలయాళ సినిమాతోనూ వచ్చింది. 2026లో ఈమె నటించిన నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అన్ని సినిమాల్లోనూ ఈమె పోషించిన పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. సూపర్ స్టార్ విజయ్‌తో కలిసి నటించిన జన నాయగన్ ఫలితం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒరిజినల్ వర్షన్ లో శ్రీలీల పోషించిన పాత్రలో మమిత బైజు నటించిన విషయం తెల్సిందే. శ్రీలీల కంటే చాలా బెటర్‌గా మమిత బైజు నటించిందని, యాక్షన్ సీన్స్‌లోనూ వావ్ అనిపించింది అంటూ ప్రశంసలు కురిపించారు. ఇక విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలోని మమిత బైజు నటన, చిలిపితనం, అందం ఇలా అన్ని విషయాలు పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకున్నాయి.
కోలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు...
మలయాళ సినిమాలు ఈమె తక్కువ కమిట్ కావడానికి కారణం పారితోషికం అనే వార్తలు వస్తున్నాయి. తమిళ్, తెలుగు సినిమాల పారితోషికాలతో పోల్చితే మలయాళ సినిమాల పారితోషికాలు దాదాపు సగం, అంతకంటే తక్కువగా ఉంటాయి. అందుకే మలయాళ సినిమాలు వస్తున్నప్పటికీ పారితోషికం ఇష్యూ కారణంగా నో చెబుతుంది అంటూ అక్కడి స్థానిక మీడియా మమితపై విమర్శలు చేస్తూ రాస్తున్నారు. తమిళంలో ఈమె ఒక్క సినిమాకు మొన్నటి వరకు రెండు కోట్ల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా విజయంతో ఆ పారితోషికం ఏకంగా రూ.3 కోట్లకు పెరిగిందని తెలుస్తోంది. తమిళ్‌లో ఈమె ఇటీవల ఒక సినిమాకు సైన్ చేసిందని, అందుకు గాను రూ.3 కోట్ల పారితోషికం ఒప్పందం జరిగిందని తమిళ మీడియా కథనాలు వచ్చాయి. మమిత ఇప్పటి వరకు తెలుగు సినిమా సైన్ చేయలేదు.
టాలీవుడ్ మూవీలో మమిత బైజు...
ఒక స్టార్ హీరో సినిమాలో మమిత ను హీరోయిన్‌గా నటింపజేయడం కోసం సంప్రదించారని తెలుస్తోంది. మమిత అందుకు ఓకే చెప్పిందట, కానీ పారితోషికం గా రూ.4 కోట్లు కావాలంటూ డిమాండ్ చేసిందని తెలుస్తోంది. ఇప్పటి వరకు పారితోషికం విషయంలో తుది చర్చలు జరగలేదని, మమిత కాస్త తగ్గించుకుంటే నిర్మాతలు ఆమెకు అడ్వాన్స్ ఇస్తారని ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. టాలీవుడ్‌లో హీరోయిన్స్ కి భారీ పారితోషికం ఇవ్వడం ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతుంది. కనుక తమిళ్ లో రూ.3 కోట్లకు ఓకే చెప్పిన మమిత, తనకు ఉన్న క్రేజ్, టాలీవుడ్ లో ఉన్న ఆనవాయితీ కారణంగా రూ.4 కోట్ల పారితోషికం డిమాండ్ చేసి ఉంటుందని అంటున్నారు. టాలీవుడ్‌లో సాలిడ్ హిట్‌తో ఎంట్రీ ఇస్తే మమితకు అంతకు మించిన పారితోషికం దక్కినా ఆశ్చర్యం లేదు. ఇంతకు మమిత ఏ హీరోతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతుంది అనేది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
