కొత్త అమ్మాయిలకు బిగ్ బాస్ బ్యూటీ సలహాలు.. ఆదమరిచారో అంతే!
మాల్టీ చాహార్ మాట్లాడుతూ.. "ఒకసారి ఆఫీస్ మీటింగ్లో వీడ్కోలు పలుకుతున్న సమయంలో నాకు ఇలాంటి అనుభవం ఎదురయింది.
By: Madhu Reddy | 19 Dec 2025 7:00 PM ISTసినిమా అనే రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టి.. తమకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకోవాలని ఎంతోమంది అమ్మాయిలు కలలు కంటారు..అందులో భాగంగానే ఇండస్ట్రీలోకి కోటి ఆశలతో అడుగుపెడతారు. అయితే అలా అడుగుపెట్టిన వారికి క్యాస్టింగ్ కౌచ్ ఒక భూతం వారి జీవితాలను పూర్తిగా కబళిస్తోంది. ఇప్పటికే ఎంతోమంది ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయిలకు అవకాశాల పేరిట ఎరగా వేసి వారి జీవితాలతో ఆడుకుంటున్న కొంతమంది.. బయటకు పెద్దమనుషులుగా చలామణి అవుతూ.. లోపల చేస్తున్న పనులు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఈ క్యాస్టింగ్ కౌచ్ భూతంపై ఎప్పటికప్పుడు సెలబ్రిటీలు స్పందిస్తూ.. నిత్యం హాట్ టాపిక్ గా మారుతున్నారు. అయితే ఇప్పుడు మరో బిగ్ బాస్ బ్యూటీ తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ సమస్యను వెల్లడించడమే కాకుండా ఇండస్ట్రీలోకి వచ్చే కొత్త అమ్మాయిలకు తన వంతు సలహాలు కూడా ఇచ్చింది. ఆమె ఎవరో కాదు ప్రముఖ హిందీ బిగ్ బాస్ - 19 బ్యూటీ ప్రముఖ సినీ నటి మాల్టీ చాహార్. స్టార్ క్రికెటర్ దీపక్ చాహార్ సోదరి. తాజాగా ఒక పాడ్ కాస్ట్ కి హాజరైన ఈమె తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ సమస్య గురించి నోరు విప్పింది.
మాల్టీ చాహార్ మాట్లాడుతూ.. "ఒకసారి ఆఫీస్ మీటింగ్లో వీడ్కోలు పలుకుతున్న సమయంలో నాకు ఇలాంటి అనుభవం ఎదురయింది. సాధారణ ఆలింగనమని నేను భావించాను. కానీ అతడు నన్ను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు.. అసౌకర్యంగా భావించాను. వెంటనే అతడిని అడ్డుకొని ఆ తర్వాత కాలంలో అతనితో అన్ని సంబంధాలను దూరం చేసుకున్నాను. అంతేకాదు అక్కడే అతడిని నిలదీశాను కూడా.. మిమ్మల్ని నా తండ్రిలా భావించాను. ఈ సంఘటన నాకు గుణపాఠం నేర్పింది. ఇక ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలని నిర్ణయం తీసుకున్నాను" అంటూ తెలిపింది.
సినిమా ఇండస్ట్రీలోనే కాదు మిగతా రంగాలలో కూడా ఈ సమస్య ఉంది.. అందుకే మహిళలు అవకాశాల కోసం ఇలాంటి వాటికి అస్సలు అంగీకరించవద్దు అని తన మాటగా సూచించింది. అంతేకాదు మనపై మనకు నియంత్రణ ఉండాలని కూడా తెలిపింది మాల్టీ.
మాల్టీ చాహర్ విషయానికి వస్తే. ఉత్తరప్రదేశ్ కి చెందిన ఈమె 2018లో అనిల్ శర్మ దర్శకత్వం వహించిన జీనియస్ అనే బాలీవుడ్ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. 2022లో అరవింద్ పాండే దర్శకత్వం వహించిన రొమాంటిక్ డ్రామా ఇష్క్ పాష్మీనా అనే చిత్రం ద్వారా తన నటన నైపుణ్యాలను మరింత ప్రదర్శించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 2018లో ఐపీఎల్ మ్యాచ్లో మిస్టరీ గర్ల్ గా ఫేమస్ అయిన ఈమె క్రికెటర్ దీపక్ చాహర్ సోదరిగా ప్రపంచానికి పరిచయమైంది. ఇప్పుడు ఇంస్టాగ్రామ్ లో యాక్టివ్గా ఉంటూ గ్లామర్ ఫోటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది. పైగా హిందీ బిగ్ బాస్ సీజన్ 19 లోకి అడుగుపెట్టిన తర్వాత మరింత పాపులారిటీ సొంతం చేసుకుందని చెప్పవచ్చు.
