Begin typing your search above and press return to search.

ఆ స్టార్ కెరీర్ ను నాశ‌నం చేయాల‌ని చూస్తున్న‌దెవ‌రు?

ఏ ఇండ‌స్ట్రీలో అయినా పైకి ఎదగాలంటే ఎత్తులు, పై ఎత్తులు వేయ‌డం స‌హజం. అందుకే ఏ రంగంలోనైనా పోటీ త‌ప్ప‌నిస‌రి అంటారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   28 Nov 2025 3:32 PM IST
ఆ స్టార్ కెరీర్ ను నాశ‌నం చేయాల‌ని చూస్తున్న‌దెవ‌రు?
X

ఏ ఇండ‌స్ట్రీలో అయినా పైకి ఎదగాలంటే ఎత్తులు, పై ఎత్తులు వేయ‌డం స‌హజం. అందుకే ఏ రంగంలోనైనా పోటీ త‌ప్ప‌నిస‌రి అంటారు. అయితే ఆ పోటీ కొన్నిసార్లు హెల్తీగా ఉంటే మ‌రికొన్ని సార్లు మాత్రం చెప్పుకోవ‌డానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. సినీ ఇండ‌స్ట్రీలో కూడా ఇది చాలా కామ‌న్ గా జ‌రుగుతూ ఉంటుంది. ఎవ‌రైనా కాస్త ఎదుగుతున్నారంటే ఎంతోమంది వారిని తొక్కేయాల‌ని చూస్తుంటారు.

అలా ఇండ‌స్ట్రీలో ప‌లువురిని ఎంతోమంది ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో తొక్కేసిన సంద‌ర్భాల గురించి క‌థ‌లు క‌థ‌లుగా చెప్తుంటారు. ఈ విష‌యంలో పలువురు నోరు విప్పితే, మ‌రికొంద‌రు మాత్రం సైలెంట్ గా వ్య‌హ‌రిస్తూ ఉంటారు. తాజాగా త‌న కొడుకు పృథ్వీరాజ్ సుకుమారన్ జీవితాన్ని కొంద‌రు నాశ‌నం చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని అత‌ని త‌ల్లి మ‌ల్లికా సుకుమార‌న్ సెన్సేష‌న‌ల్ కామెంట్స్ చేశారు.

సుకుమార‌న్ కొడుకుగా ఎంట్రీ ఇచ్చిన పృథ్వీరాజ్

మ‌ల‌యాళ స్టార్ యాక్ట‌ర్ సుకుమార‌న్ కొడుకే ఈ పృథ్వీరాజ్ సుకుమార‌న్. 2002లో నంద‌నం అనే మూవీతో ఇండ‌స్ట్రీలోకి అడుగ‌పెట్టిన పృథ్వీరాజ్ సుకుమార‌న్ కెరీర్ స్టార్టింగ్ లో స‌రైన స‌క్సెస్‌లు లేక ఎంతో ఇబ్బంది ప‌డ్డారు. ప‌లు విమ‌ర్శ‌లు, అవ‌మానాలు, ఇబ్బందుల‌ను ఎదుర్కొని న‌టుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీ త‌న 23 ఏళ్ల కెరీర్లో ఎన్నో సినిమాల్లో న‌టించి మెప్పించారు.

ఇంత‌టి నీచానికి దిగజారుతార‌నుకోలేదు

కేవ‌లం న‌టుడిగానే కాకుండా నిర్మాత‌గా, డైరెక్ట‌ర్ గా, సింగ‌ర్ గా స‌త్తా చాటిన పృథ్వీ న‌టించిన విలాయ‌త్ బుద్దా సినిమా రీసెంట్ గానే ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. జ‌య‌న్ నంబియార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ మూవీలో అను మోహ‌న్, ధృవ‌న్, వినోద్ థామ‌స్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌గా, విలాయ‌త్ బుద్ధా, పుష్ప మూవీలా ఉంద‌ని నెటిజ‌న్లు ట్రోలింగ్ చేస్తుండ‌టంతో దానిపై మ‌ల్లికా సుకుమార‌న్ స్పందించారు. త‌న కొడుకు కెరీర్ ను నాశ‌నం చేయ‌డానికి కొంద‌రు కుట్ర చేస్తున్నార‌ని, విలాయ‌త్ బుద్ధ మూవీ విష‌యంలో పృథ్వీని కావాల‌నే టార్గెట్ చేస్తున్నార‌ని, ఈ విష‌యంలో త‌న కొడుకుని స‌పోర్ట్ చేసిన వారు చాలా త‌క్కువ మంది ఉన్నార‌ని, పృథ్వీ ఎదుగుద‌ల‌ను జీర్ణించుకోలేక కెరీర్ ను నాశ‌నం చేయ‌డానికి ట్రై చేస్తున్నార‌ని, ఇంత‌టి నీచానికి దిగ‌జారుతార‌ని అనుకోలేద‌ని, ఇలాంటివి ఆప‌క‌పోతే దీనిపై త‌న పోరాటం ఆగ‌ద‌ని హెచ్చరించారు. మ‌ల్లికా సుకుమార‌న్ చేసిన ఈ వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుండ‌గా, అస‌లు పృథ్వీరాజ్ సుకుమార‌న్ కెరీర్ ను నాశ‌నం చేయాల‌ని కుట్ర చేస్తుందెవ‌ర‌నేది ఇప్పుడ ప్ర‌శ్న‌గా మారింది.