Begin typing your search above and press return to search.

మ‌ల్లికా షెరావ‌త్ పై టామ్ క్రూజ్ క్రష్!

ఇక మ‌ల్లికా షెరావ‌త్ ప్రొఫెషనల్ లైఫ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం డిజిటల్ మాధ్యమంపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు.

By:  Srikanth Kontham   |   12 Aug 2026 12:01 PM IST
మ‌ల్లికా షెరావ‌త్ పై టామ్ క్రూజ్ క్రష్!
X

బాలీవుడ్‌లో గ్లామరస్ నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మల్లికా షెరావత్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. గ్లోబల్ స్టార్ టామ్ క్రూజ్ గురించి అమ్మ‌డు మాట్లాడుతూ ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్‌కు తనపై ప్రత్యేకమైన క్రష్ ఉందని సరదాగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వ‌డంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

ప్రముఖ రియాలిటీ షో `ది ట్రైటర్స్ సీజన్ 2` ప్రమోషన్లలో భాగంగా మల్లికా షెరావత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో అభిషేక్ మల్హన్, కరణ్ జోహార్ వంటి ప్రముఖులతో కలిసి పాల్గొన్న మ‌ల్లిక‌ తన గత హాలీవుడ్ అనుభవాలను, జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఒక అంతర్జాతీయ వేదికపై జరిగిన సమావేశంలో టామ్ క్రూజ్ తనకు ఎదురుపడిన సందర్భాన్ని ఆయన తనతో ప్రవర్తించిన తీరును సరదాగా అందరితో పంచుకున్నారు.

అయితే మల్లికా షెరావత్ చేసిన వ్యాఖ్యలను అక్కడున్న తోటి సెలబ్రిటీలు, ప్రేక్షకులు ఎంతో సరదాగా తీసుకున్నారు. హాలీవుడ్‌లోనూ తనదైన చరిష్మాతో అందరినీ ఆకట్టుకున్న మల్లికా.. టామ్ క్రూజ్ లాంటి గ్లోబల్ స్టార్‌తో ముడిపెట్టి చెప్పిన జోక్ షోకు మరింత హైప్‌ను తెచ్చిపెట్టింది. ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కానున్న ఈ షోపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా తాజా ప్రకటనతో మరింత ఆసక్తి సంతరించుకుంది.

ఇక మ‌ల్లికా షెరావ‌త్ ప్రొఫెషనల్ లైఫ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం డిజిటల్ మాధ్యమంపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. వెండితెరకు కొంతకాలంగా దూరంగా ఉంటున్న అమ్మ‌డు ఓటీటీ వేదికగా వస్తున్న విభిన్నమైన షోలు ..వెబ్ సిరీస్‌ల ద్వారా ప్రేక్షకులను అలరిస్తున్నారు. `ది ట్రైటర్స్ 2` లో మ‌ల్లికా షెరావ‌త్ ప్రదర్శించబోయే మైండ్ గేమ్స్, రియాక్షన్స్ షో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నట్లు తెలుస్తోంది.

కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న ఈ రియాలిటీ షోలో పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, ప్రముఖ సినీ నటీనటులు పోటీ పడుతున్నారు. మోసగాళ్లను కనిపెట్టే ఈ సరికొత్త కాన్సెప్ట్ ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని పంచుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ఈ షోలో మల్లికా షెరావత్ గ్లామర్ .. ఆమె చేసే కామెంట్లు ప్రత్యేక ఆకర్షణగా మారుతున్నాయని ప్రోమోలు చూస్తేనే అర్థమవుతోంది. మ‌రి మ‌ల్లిక వ్యాఖ్య‌లు గ‌నుక టామ్ క్రూజ్ చెవిన ప‌డితే ఎలా స్పందిస్తారు? అన్న‌ది చూడాలి.