Begin typing your search above and press return to search.

వ‌యో భారంతో అవ‌కాశాల‌కు దూరంగా!

గ్లామర్ పాత్రలతో ఓ వెలుగు వెలిగిన నటీమణులు కాలక్రమేణా మారుతున్న ట్రెండ్‌కు తగినట్లుగా సర్దుకుపోవడం సవాలుగానే ఉంటుంది.

By:  Srikanth Kontham   |   5 Aug 2026 2:58 PM IST
వ‌యో భారంతో అవ‌కాశాల‌కు దూరంగా!
X

గ్లామర్ పాత్రలతో ఓ వెలుగు వెలిగిన నటీమణులు కాలక్రమేణా మారుతున్న ట్రెండ్‌కు తగినట్లుగా సర్దుకుపోవడం సవాలుగానే ఉంటుంది. ఒకప్పుడు అగ్ర హీరోల సరసన న‌టించి స్పెషల్ సాంగ్స్‌తో కుర్రకారును ఊపిన మల్లికా షెరావత్, మలైకా అరోరా వంటి తారల విషయంలోనూ ఇదే జరుగుతోంది. మల్లికా షెరావత్ వయస్సు 50కి దగ్గర పడుతుండగా, మలైకా అరోరా వయస్సు 52 ఏళ్లుగా ఉంది. వయస్సు రీత్యా వస్తున్న అవకాశాలు తగ్గిపోవడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

సాధారణంగా పరిశ్రమలో వయస్సు అనేది నటీమణుల కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. మేల్ నటులు ఎంత వయస్సు వచ్చినా? హీరోలుగా కొనసాగడానికి వెసులుబాటు ఉంటుంది. కానీ నటీమణుల విషయంలో మాత్రం దర్శక నిర్మాతలు చాలా నిబంధనలు పాటిస్తుంటారు. మల్లికా షెరావత్, మలైకా అరోరాల వయస్సు పెరుగు తుండటంతో వారిని ప్రధాన పాత్రల్లో .. గ్లామర్ సాంగ్స్‌లో తీసుకోవడానికి మేకర్స్ ఆసక్తి చూపడం లేదు. దీంతో ఇటు వెండితెరకు, అటు పెద్ద ప్రాజెక్ట్‌లకు సీనియర్ భామలు క్రమంగా దూరమవుతున్నారు.

ఈ మార్పునకు వయస్సు ఒక్కటే కార‌ణం కాదు. పరిశ్రమలో మారుతున్న సంస్కృతి కూడా మరో ముఖ్య కారణం. గతం లో స్పెషల్ సాంగ్స్ అనగానే ప్రత్యేకంగా వాటి కోసం ప్ర‌త్యేక‌మైన తారలుండేవారు వారినే తీసుకునేవారు. కానీ కాలక్రమేణా ఆ ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం ప్రత్యేక పాటల్లో వాళ్ల‌ని ప‌క్క‌న‌బెట్టి ఏకంగా చిత్రంలోని ప్రధాన హీరోయిన్లనే ఎంపిక చేస్తున్నారు. అగ్ర‌ హీరోయిన్లు సైతం స్పెషల్ సాంగ్స్ చేయడానికి ముందుకు రావడంతో ఇలాంటి సీనియ‌ర్లు...స్పెష‌ల్ ఐటం భామ‌లు అవకాశాలు కోల్పోతున్నారు అన్న‌ది కాద‌న‌లేని నిజం.

ఇండస్ట్రీలో డిమాండ్ త‌గ్గినా మ‌ల్లికా..మ‌లైకా ఇద్దరు తారలు సోషల్ మీడియా వేదికగా, రియాలిటీ షోల ద్వారా మాత్ర నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఫిట్‌నెస్, గ్లామర్ లుక్స్ ద్వారా యువ నటీమణులకు సైతం గట్టి పోటీ ఇస్తున్నారు. అయినా? వెండితెరపై పెద్ద పాత్రలు దక్కకపోవడం అభిమానులను నిరాశపరుస్తోంది. దశాబ్దాల పాటు ఇండస్ట్రీని అందంతో శాసించిన భామలకు దర్శకనిర్మాతలు సరైన పాత్రలు కేటాయించకపోవడం శోచ‌నీయం.

మరొక కోణంలో చూస్తే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు మహిళా ప్రధాన పాత్రల చిత్రాల సంఖ్య పెరుగుతున్నా? వాటిలో కూడా నూతన తరానికి .. మార్కెట్ ఉన్న స్టార్ హీరోయిన్లకే ప్రాధాన్యత దక్కుతోంది. మధ్యవయస్సు దాటిన నటీమణులకు బలమైన పాత్రలను సృష్టించడంలో రచయితలు, దర్శకులు ఇంకా వెనకంజనే వేస్తున్నారు. ఫలితంగా మల్లికా షెరావత్, మలైకా అరోరా లాంటి టాలెంటెడ్, గ్లామరస్ ఆర్టిస్టుల అనుభవాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేకపోతున్నారు.

గ్లామర్ ప్రపంచం అత్యంత వేగంగా మారుతుంటుంది. ఇక్కడ నిల‌దొక్కుకోవాల‌న్నా? సుదీర్ఘకాలం రాణించాలన్నా? అందం మాత్రమే సరిపోదు. కాలంతో పాటు మారే దర్శకనిర్మాతల ఆలోచనా విధానాన్ని తట్టుకుని నిలబడాల్సి ఉంటుంది. మల్లికా షెరావత్, మలైకా అరోరాలు తమదైన శైలిలో ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ ముందుకు సాగుతున్నా? ఇండస్ట్రీలో వారికి మళ్లీ పూర్వవైభవం రావాలంటే బలమైన క్యారెక్టర్ ఓరియంటెడ్ పాత్రలు పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.