పవన్ కళ్యాణ్ 3 కోట్ల ఆఫర్ కాదన్న మల్లారెడ్డి..?
ఈ మధ్య సినిమాలకు సంబంధించిన ఈవెంట్స్ ని మల్లారెడ్డి కాలేజ్ లో నిర్వహిస్తున్నారు. అలా మరింత పాపులర్ అవుతున్నారు మల్లారెడ్డి.
By: Ramesh Boddu | 8 Oct 2025 9:59 AM ISTప్రముఖ బిజినెస్ మ్యాన్, మల్లారెడ్డి ఇన్స్ ట్యూట్ అధినేత మల్లా రెడ్డి తను మాటలతో కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు. కాస్త కామెడీగా చెప్పినట్టు ఉంటుంది కానీ పూలమ్మిన, పాలమ్మిన అంటూ ఆయన జీవితంలో ఎంత కష్టపడ్డాడో చేసిన వ్యాఖ్యలు అప్పట్లో చాలా పాపులర్ అయ్యాయి. రాజకీయాల్లో ఉన్న ఎవరికి కూడా పెద్దగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండదు. కానీ మల్లారెడ్డికి మాత్రం సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఆయన మైక్ తీసుకుంటే చాలు మాట్లాడే మాటలు, చేసే కామెంట్స్ భలే అనిపిస్తాయి.
మల్లారెడ్డి ఫాలోయింగ్ ని సినిమాల్లో వాడుకోవాలని..
ఈమధ్య సినిమాలకు సంబంధించిన ఈవెంట్స్ ని మల్లారెడ్డి కాలేజ్ లో నిర్వహిస్తున్నారు. అలా మరింత పాపులర్ అవుతున్నారు మల్లారెడ్డి. ఇక ఈ క్రమంలో జనాల్లో ఆయనకు ఉన్న ఈ ఫాలోయింగ్ ని సినిమాల్లో వాడుకోవాలని అనుకున్నారు. ఐతే ఆయన వాటిని తిరస్కరించాడని తెలుస్తుంది. మల్లారెడ్డి రీసెంట్ ఇంటర్వ్యూలో డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ సినిమాలో తనకు ఆఫర్ ఇచ్చాడని.. నా కోసం ఆఫీస్ లో గంట వెయిట్ చేశాడని చెప్పారు. 3 కోట్ల దాకా పారితోషికం ఇస్తానన్నారు కానీ ఆ ఆఫర్ ని తాను సున్నితంగా తిరస్కరించానని చెప్పారు మల్లారెడ్డి.
ఫస్ట్ హాఫ్ మొత్తం నేను ఆయన్ను తిడతా.. సెకండ్ హాఫ్ ఆయన నన్ను తిడతాడు, కొడతాడు ఇదంతా ఎందుకని సినిమా ఆఫర్ కాదన్నా అని తన మార్క్ కామెంట్స్ చేశారు మల్లారెడ్డి. పవన్ కళ్యాణ్ తో సినిమా.. హరీష్ శంకర్ లాంటి డైరెక్టర్ వచ్చి అడిగితే ఎవరైనా చేస్తారు. కానీ మల్లారెడ్డి మాత్రం అందుకు ఒప్పుకోలేదు. 3 కోట్ల దాకా రెమ్యునరేషన్ ఇస్తానన్నా మల్లా రెడ్డి సినిమాకు ఒప్పుకోలేదంటే ఆయన డబ్బుకి లొంగడని అర్ధమవుతుంది.
పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్..
సో హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ కోసమే మల్లారెడ్డిని కలిసి ఉండొచ్చు. కోలీవుడ్ సినిమా తెరికి రీమేక్ గా ఉస్తాద్ భగత్ సింగ్ వస్తుంది. ఆ సినిమా మూల కథ తీసుకుని పూర్తిగా మార్చి పవర్ స్టార్ మార్క్ స్టైలిష్ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గా ఓజీతో సూపర్ హిట్ అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ తో మళ్లీ ఆ హిట్ మేనియా రిపీట్ చేయాలని చూస్తున్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్ లో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా రాశి ఖన్నా కూడా ఒక సర్ ప్రైజ్ రోల్ లో మెరుస్తుందని తెలుస్తుంది. ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలకు కొంత బ్రేక్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని టాక్.
