Begin typing your search above and press return to search.

తెలుగులో సినిమా కోట్లు..డేట్స్..మ‌ల‌యాళ తిర‌కాసు!

మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీ దేశంలో చాలా ప్ర‌త్యేకం. ఎందుకంటే ఇక్క‌డ నిర్మించే సినిమాల‌న్నీ కంటెంట్ బేస్డ్ సినిమాలే.

By:  Ravindar Gorantla   |   2 April 2026 5:00 PM IST
తెలుగులో సినిమా కోట్లు..డేట్స్..మ‌ల‌యాళ తిర‌కాసు!
X

మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీ దేశంలో చాలా ప్ర‌త్యేకం. ఎందుకంటే ఇక్క‌డ నిర్మించే సినిమాల‌న్నీ కంటెంట్ బేస్డ్ సినిమాలే. అంతే కాకుండా బ‌డ్జెట్ ఫ్లెండ్లీ, అండ్ మేకింగ్ డేస్ ఫ్రెండ్లీ మూవీస్ కూడా కావ‌డం విశేషం. మ‌న సినిమాల బ‌డ్జెట్‌, వ‌ర్కింగ్ డేస్‌తో పోలిస్తే అక్క‌డి సినిమాలు చాలా త‌క్కువ బ‌డ్జెట్‌, త‌క్కువ వ‌ర్కింగ్ డేస్‌తో నిర్మాణం జ‌రుపుకుంటాయి. ఇక్క‌డ మ‌నం వంద‌ల కోట్ల‌తో పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే అక్కడ వాళ్లు రెండంకెలు మించ‌ని బ‌డ్జెట్‌ల‌తో అద్భుతాలు చేస్తుంటారు.

అందుకే మల‌యాళ ఇండ‌స్ట్రీ దేశంలోనే ఫిల్మ్ మేకింగ్ విష‌యంలో ప్ర‌త్యేకంగా నిలుస్తోంది. ఇక్క‌డి స్టార్స్ తీసుకునే రెమ్యూస‌న‌రేష‌న్‌లు కూడా త‌క్కువే. మనం ఒక సినిమా షూటింగ్‌కు తీసుకునే వ‌ర్కింగ్ డేస్‌లో వాళ్లు రెండు, మూడు సినిమాలు చేసేస్తుంటారు. అందుకే రీసెంట్‌గా కెరీర్ ప్రారంభించినా ఒక్కో స్టార్ 50 కి మించి సినిమాలు చేసేసి ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. ఇదిలా ఉంటే మ‌ల‌యాళ సినిమాలు తెలుగులో క్రేజ్‌ని సొంతం చేసుకుంటూ భారీ విజ‌యాల్ని సొంతం చేసుకుంటుంటే అక్క‌డి స్టార్స్ మాత్రం మ‌న సినిమాల్లో న‌టించ‌డానికి ఆస‌క్తిని చూపించ‌డం లేదు.

ఇదే ఇప్పుడు ప్ర‌ధాన చ‌ర్చ‌గా మారింది. తెలుగులో సినిమా అంటే ఫ‌హ‌ద్ ఫాజిల్ కోట్లు ఇస్తే గానీ చేయ‌నంటూ ఒక్కో సినిమాకు రూ.15 కోట్లు డిమాండ్ చేస్తుంటే టొవినో థామ‌స్ లాంటి హీరో మాత్రం డేట్స్‌..ఒక్కో సినిమాకు ఏళ్లు కేటాయించ‌లేన‌ని చెప్ప‌డం చ‌ర్చ‌కు తెర తీస్తోంది. మ‌రో ప‌క్క మ‌ల‌యాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార‌న్ వ‌రుస‌గా తెలుగులో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమాల్లో న‌టిస్తుంటే వీళ్ళు మాత్రం కోట్లు, డేట్స్ అంటూ తిర‌కాసుగా వాదిస్తుండ‌టం విస్మ‌యాన్ని క‌లిగిస్తోంది.

తెలుగు పాన్ ఇండియా మూవీ `పుష్ప‌`, ఫుష్ప 2`ల్లో మ‌ల‌యాళ హీరో ఫ‌హ‌ద్ ఫాజిల్ భ‌న్వ‌ర్ సింగ్ ష‌కావ‌త్‌గా న‌టించి ఆక‌ట్టుకున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ మూవీస్ త‌రువాత ఆయా సినిమాల్లో న‌టించి త‌ప్పు చేశాన‌ని ఫ‌హ‌ద్ అన్న మాట‌లు వైర‌ల్ కావ‌డం తెలిసిందే. ఇప్ప‌టికీ తెలుగులో ఫ‌హ‌ద్ మ‌రో సినిమా చేయ‌లేదు. ఒక వేళ చేయాల‌ని మేక‌ర్స్ సంప్ర‌దిస్తే ఒక్కో సినిమాకు ఏకంగా రూ.15 కోట్లు డిమాండ్ చేస్తున్నాడ‌ట‌. దీంతో అంత రెమ్యూన‌రేష‌న్ ఇవ్వ‌డం ఎందుకులే అని మ‌రో న‌టుడితో కానిచ్చేస్తున్నార‌ని ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది.

ఇక మ‌ల‌యాళ సినిమాల్లో చిన్న క్యారెక్ట‌ర్ల‌లో న‌టించి గెస్ట్ అప్పియ‌రెన్స్‌లు ఇస్తున్న టొవినో థామ‌స్ తెలుగులో న‌టించ‌డానికి పెద్ద థియేరీనే చెబుతున్నాడు. తెలుగు సినిమాల‌లో న‌టించాల‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నాన‌ని చెబుతూనే టాలీవుడ్ వ‌ర్కింగ్ క‌ల్చ‌ర్ మ‌ల‌యాళ వ‌ర్కింగ్ క‌ల్చ‌ర్‌కు భిన్నంగా ఉంటుంద‌ని చెబుతున్నాడు. అక్క‌డ త‌క్కువ టైమ్‌లోనే షూటింగ్‌లు పూర్తి చేస్తామ‌ని, అయితే తెలుగులో మాత్రం అలా కాద‌ని ఎక్కువ షెడ్యూల్స్ ఉంటాయంటున్నాడు. ఆ స‌మ‌యంలో మ‌ల‌యాళంలో అయితే రెండు నుంచి నాలుగు సినిమాల్లో న‌టించొచ్చ‌ని స్ప‌ష్టం చేస్తున్నాడు. అంటే డైరెక్ట్‌గా తెలుగు సినిమాల నిర్మాణంపై కౌంట‌ర్ ఇచ్చాడ‌న్న‌మాట‌. మ‌రి తెలుగు సినిమాలంటే ఫ‌హ‌ద్ కోట్లు, టొవినో చెబుతున్న వ‌ర్కింగ్ డేస్ లెక్క‌ల తిర‌కాసు గోల‌ని మ‌న వాళ్లు ఎలా తీసుకుంటారో వేచి చూడాల్సిందే.