Begin typing your search above and press return to search.

హృదయం రీమేక్ ఉందా లేదా..?

మలయాళంలో సూపర్ హిట్టైన ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ ఈ సినిమా రీమేక్ చేస్తే బాగుంటుందని అనుకున్నారు.

By:  Ramesh Boddu   |   11 Aug 2025 2:00 PM IST
హృదయం రీమేక్ ఉందా లేదా..?
X

2022లో మలయాళంలో రిలీజైన సినిమా హృదయం. మళయాళ స్టార్ మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ ఈ సినిమాలో నటించాడు. ప్రణవ్ తో పాటు కళ్యాణి ప్రియదర్శన్, దర్శన రాజేంద్రన్ నటించారు. వినీత్ శ్రీనివాసన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు హేషం అబ్దుల్ వాహబ్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాలో సాంగ్స్ అన్నీ అదిరిపోతాయి. మలయాళంలో సూపర్ హిట్టైన ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ ఈ సినిమా రీమేక్ చేస్తే బాగుంటుందని అనుకున్నారు.

హృదయం సినిమా లవ్ స్టోరీ..

బడా నిర్మాణ సంస్థ హృదయం రీమేక్ రైట్స్ ని తీసుకుందని అనౌన్స్ చేశారు. తెలుగు, తమిళ భాషల్లో ఆ సినిమా రీమేక్ చేస్తారని అన్నారు. కానీ ఇప్పటివరకు అది జరగలేదు. హృదయం సినిమా లవ్ స్టోరీనే కానీ జీవితాన్ని చూపిస్తుంది. కాలేజ్ డేస్ లవ్ నుంచి లవ్ స్టోరీ, బ్రేకప్ ఇంకా లైఫ్ లో బిజీ అవ్వడం.. తన సోల్ మేట్ ని కలవడం మళ్లీ తన లవర్ పెళ్లికి వెళ్లడం ఇవన్నీ మనసుకి దగ్గరగా అనిపిస్తాయి.

ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు తెలుగులో అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అనుకున్నారు. తెలుగు రీమేక్ ఎప్పుడా అని ఆడియన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఆ సినిమా రీమేక్ గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. హృదయం తర్వాత ప్రణవ్ సినిమాలు చేస్తున్నాడు. ఐతే ఈమధ్య అతను ఎక్కువగా అవుట్ ఆఫ్ కంట్రీ ఒక ప్రశాంతమైన వాతావరణంలో జీవిస్తున్నట్టు తెలుస్తుంది.

హృదయం తెలుగు రీమేక్ పరిస్థితి..

హృదయం సినిమా లవర్స్ కోసం కనీసం ఆ డబ్బింగ్ సినిమా అయినా రిలీజ్ చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మరి హృదయం తెలుగు రీమేక్ పరిస్థితి ఏంటి ఈ సినిమాపై మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది చూడాలి. ఒకవేళ హృదయం తెలుగు రీమేక్ చేస్తే అందులో ఎవరు నటిస్తారన్నది కూడా ఇంట్రెస్టింగ్ థింగ్ అని చెప్పొచ్చు.

ప్రణవ్ మోహన్ లాల్, కళ్యాణి, దర్శన అక్కడ అదరగొట్టారు.. మరి తెలుగు హృదయంలో ఎవరు నటిస్తారన్నది చూడాలి. ఒకవేళ మళ్లీ ఈ రీమేక్ లు మళ్లీ ఎందుకు ఆ సినిమానే డబ్ చేసి రిలీజ్ చేస్తే పోలా అనుకుంటే మాత్రం ఇంకా సూపర్ అని చెప్పొచ్చు.

హృదయం సినిమాకు తెలుగులో సూపర్ ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే ఆ సినిమాకు హేషం అందించిన మ్యూజిక్ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి. ఇక హేషం ఈమధ్య తెలుగులో వరుస హిట్లు ఇస్తున్నాడు. నానితో హాయ్ నాన్న చేశాడు హేషం. ఆ సినిమాలో సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి.