టాలీవుడ్‌లో మలయాళ భామలు చప్పగానే!
ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో మలయాళ కథానాయికల హవా ఏ స్థాయిలో ఉండేదో తెలిసిందే.
By: Srikanth Kontham | 25 Oct 2026 9:00 PM ISTఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో మలయాళ కథానాయికల హవా ఏ స్థాయిలో ఉండేదో తెలిసిందే.నయనతార, నిత్యామీనన్, సాయిపల్లవి, అనుపమ పరమేశ్వరన్ వంటి భామలు నేచురల్ పెర్ఫార్మెన్స్‌తో, అందంతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించి స్టార్ హీరోయిನ್లుగా ఏలారు. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి నెమ్మదిగా మారుతోంది. మలయాళం నుంచి తెలుగులోకి ఎంతమంది హీరోయిన్లు అడుగుపెడుతున్నా? వారు వరుస సినిమాలు చేస్తున్నా? టాలీవుడ్ స్టార్ లీగ్ స్థానం సంపాదించడంలో తడబాడు తప్పడం లేదు.
మలయాళంలో విజయం సాధించిన చిత్రాతో పాపులారిటీ తెచ్చుకుని తెలుగులో ఎంట్రీ ఇస్తున్న భామలకు ఆరంభంలో ఆఫర్లు బాగానే వస్తున్నాయి. ఇటీవల అనుపమ పరమేశ్వరన్, కళ్యాణి ప్రియదర్శన్, మమితా బైజు, మాళవిక మోహనన్ వంటి కథానాయికలు టాలీవుడ్ ప్రాజెక్ట్‌లలో నటించారు. కానీ ఈ భామలకు ప్రేక్షకుల నుంచి ప్రత్యేకమైన క్రేజ్ దక్కలేదు. అగ్ర హీరోల సరసన సుదీర్ఘకాలం నిలదొక్కుకునే అవకాశాలు మాత్రం దక్కడం లేదు.
`ప్రేమమ్` చిత్రంతో మెప్పించిన అనుపమ పరమేశ్వరన్ `టిల్లు స్క్వేర్` వంటి భారీ కమర్షియల్ హిట్ అందుకుని ఇమేజ్‌ను మార్చుకునే ప్రయత్నం చేసినా? అది ఆమెను టాలీవుడ్ టాప్-3 హీరోయిన్ల రేసులో నిలబెట్ట లేకపోయింది. `ప్రేమలు` చిత్రంతో సౌత్ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మమితా బైజుకు తెలుగులో భారీ అంచనాలు ఏర్పడినా? ఆ క్రేజ్‌ను టాలీవుడ్ బిగ్ ప్రాజెక్టులుగా మార్చుకోవడంలో ఆశించిన విజయం దక్కలేదు.
మరోవైపు మాళవిక మోహనన్ ప్రభాస్ నటించిన `ది రాజా సాబ్` తో టాలీవుడ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చినా? ఆ సినిమా ఫలితం ఆమె కెరీర్‌కు ఆశించిన స్థాయిలో మైలేజ్ ఇవ్వలేకపోయింది. కళ్యాణి ప్రియదర్శన్ గ్లామరస్.. హోమ్లీ రోల్స్‌లో అలరించినా? ఎక్కువగా మీడియం రేంజ్ ప్రాజెక్ట్‌లకే పరిమితమైపోయింది. గ్లామర్ హంగుల కంటే కూడా ఎక్కువగా నటనకే ప్రాధాన్యముండే పాత్రలకు మలయాళ భామలు ప్రసిద్ధి చెందడం, టాలీవుడ్‌లో వాణిజ్య అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉండటం వీరి ప్రయాణానికి కొంత ప్రతిబంధకంగా మారుతోంది.
ప్రస్తుతం రష్మిక మందన్న సహా పలువురు యువ భామలు గ్లామర్, డాన్స్, మాస్ ఎలిమెంట్స్‌తో కమర్షియల్ సినిమాలలో వరుసగా అగ్ర హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటున్నారు. వారితో పోలిస్తే మలయాళ హీరోయిన్లు పెర్ఫార్మెన్స్-ఓరియెంటెడ్ పాత్రలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. టాలీవుడ్ మేకర్స్ కూడా వీరిని మైండ్ గేమ్‌తో స్టార్ లీగ్ రేసులో రాకుండా ప్రత్యేకమైన పాత్రలకే పరిమితం చేస్తున్నట్లు తెలుస్తోంది.
మొత్తానికి మలయాళ నటీమణులకు నటన పరంగా తిరుగులేకపోయినా? టాలీవుడ్ స్టార్ రేసులో మాత్రం వారి ప్రయాణం కాస్త చప్పగానే సాగుతోందనేది వాస్తవం. భవిష్యత్ లో అయినా సరైన కమర్షియల్ విజయాన్ని అందు కుని అగ్ర హీరోలతో జోడీ కట్టి టాలీవుడ్ ని ఏల్తారేమో చూడాలి.
