Begin typing your search above and press return to search.

వరుస ఛాన్సులు.. సాయి తేజ్ హీరోయిన్ ప్లానేదో సరిగ్గా ఉందే..

ప్రస్తుతం ఐశ్వర్య లక్ష్మి పరిస్థితి చూస్తే పారితోషికం పెంచడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మలయాళంలో మంచి గుర్తింపు ఉంది.

By:  M Prashanth   |   25 Jun 2026 8:00 AM IST
వరుస ఛాన్సులు.. సాయి తేజ్ హీరోయిన్ ప్లానేదో సరిగ్గా ఉందే..
X

సినీ ఇండస్ట్రీలో అవకాశాలు పెరిగిన వెంటనే రెమ్యూనరేషన్ పెంచుకోవడం, వచ్చిన క్రేజ్‌ ను వెంటనే క్యాష్ చేసుకోవడం చాలా మంది హీరోయిన్లు ఫాలో అయ్యే విధానం. కానీ మాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి మాత్రం భిన్నమైన ప్లాన్‌ తో ముందుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, తన కెరీర్‌ ను మెల్లగా స్ట్రాంగ్ గా మార్చుకోవాలనే ఆలోచనతోనే అడుగులు వేస్తోంది.

ఇటీవల ఆమె చేసిన కామెంట్స్ చూస్తే ఆ విషయం క్లియర్ గా అర్థమవుతోంది. హిట్లు వస్తున్నాయని, అవకాశాలు పెరుగుతున్నాయని వెంటనే పారితోషికం డిమాండ్ చేయడం లేదని ఆమె చెప్పింది. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే మార్కెట్ వాల్యూ వచ్చిన తర్వాతే రెమ్యూనరేషన్ గురించి ఆలోచిస్తానని పేర్కొన్నారు. ఆ ఒక్క మాటే ఆమె కెరీర్ ప్లానింగ్ ఎలా ఉందో చెప్పేస్తోంది.

ప్రస్తుతం ఐశ్వర్య లక్ష్మి పరిస్థితి చూస్తే పారితోషికం పెంచడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మలయాళంలో మంచి గుర్తింపు ఉంది. తమిళంలో అవకాశాలు వస్తున్నాయి. తెలుగులోనూ వరుసగా ప్రాజెక్టులు చేస్తోంది. సాయి దుర్గ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న సంబరాల ఏటి గట్టు వంటి పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్‌ గా నటిస్తోంది. అయినప్పటికీ ఆమె ఫోకస్ డబ్బు మీద కాకుండా మార్కెట్ బిల్డ్ మీద ఉన్నట్లు కనిపిస్తోంది.

సాధారణంగా ఒక నటికి క్రేజ్ పెరిగినప్పుడు నిర్మాతలు కూడా నెక్స్ట్ సినిమాల విషయంలో లెక్కలు మార్చుకుంటారు. కానీ ఐశ్వర్య లక్ష్మి మాత్రం ముందుగా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకోవాలని చూస్తోంది. తాను నటించిన సినిమా విడుదలైతే ప్రేక్షకులు ప్రత్యేకంగా తన కోసం కూడా థియేటర్‌ కు వచ్చే రేంజ్ ఏర్పడాలని భావిస్తున్నట్లు ఆమె మాటల్లో తెలుస్తోంది. ఇదే ఆమె కెరీర్ ప్లాన్‌ లోని అసలు బలం.

ఒకటి రెండు హిట్ల ఆధారంగా కాకుండా, పలు భాషల్లో తనకంటూ మార్కెట్‌ ను నిర్మించుకోవడంపై దృష్టి పెట్టడం.. భవిష్యత్తులో స్టార్ హీరోయిన్‌ గా ఎదగాలంటే ఇదే సరైన మార్గమని ఆమె నమ్ముతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా తెలుగు మార్కెట్‌ పై కూడా ఐశ్వర్య లక్ష్మి ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. గాడ్సే తర్వాత ఇప్పుడు సంబరాల ఏటి గట్టు వంటి ప్రాజెక్టులో నటించడం ద్వారా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చే సినిమాలను ఎంచుకుంటూ తన రేంజ్ ను పెంచుకోవాలనే ప్లాన్ తో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు వేగంగా ఎదగాలని చూస్తుంటే, ఐశ్వర్య లక్ష్మి మాత్రం స్థిరంగా ఎదగాలని చూస్తోంది. ముందు పేరు, తర్వాత మార్కెట్, ఆ తర్వాత పారితోషికం అనే ఫార్ములాను ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు ఆమె చేతిలో ఉన్న సినిమాల కంటే, వాటి వెనుక ఉన్న కెరీర్ ప్లానింగ్ గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది. వరుస అవకాశాలు, పెరుగుతున్న క్రేజ్ మధ్య తొందరపడకుండా అడుగులు వేస్తున్న ఆమె ప్లాన్ చూస్తుంటే... ఫ్యూచర్ లో హై రేంజ్ కు వెళ్లాలనే టార్గెట్ తో ప్లాన్ చేసుకుంటోందని చెప్పొచ్చు. అందుకే సాయి తేజ్ హీరోయిన్ ప్లానేదో సరిగ్గా ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది.