Malavika Mohanan: వైబ్ ఉంది బేబీ.. వైబ్ ఉందిలే..!
పాపులర్ హీరోయిన్ మాలవిక మోహనన్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ లో ఒక ప్రత్యేకమైన ఫోటోను షేర్ చేసింది.
By: Priya Chowdhary Nuthalapti | 4 Jan 2026 2:50 PM ISTపాపులర్ హీరోయిన్ మాలవిక మోహనన్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ లో ఒక ప్రత్యేకమైన ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోకు ఆమె “That’s the vibe” అనే చిన్న క్యాప్షన్ ఇచ్చింది. క్యాప్షన్ కి తగ్గట్టుగానే ఈ ఫోటోతో అందరికీ వైబ్ ఇచ్చింది ఈ హీరోయిన్. సముద్ర తీరంల..వెనుక పాత రాతి కట్టడాలతో నిలబడి ఉన్న మాలవిక ఫోటో చాలా ఎనర్జీతో కనిపిస్తోంది.
ఈ ఫోటో బయటకు వచ్చిన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మాలవిక లుక్, బ్యాక్‌గ్రౌండ్, ఆమె స్టైల్ అన్నీ కలసి ఒక పాజిటివ్ వైబ్‌ను క్రియేట్ చేశాయని.. ఆమె అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
సినిమాల విషయానికి వస్తే.. మాలవిక ప్రస్తుతం తన రాబోయే తెలుగు సినిమా ది రాజా సాబ్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ సినిమాలో ఆమె ప్రభాస్ సరసన నటిస్తోంది. ఈ చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 9న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. పెద్ద స్టార్‌తో తొలి తెలుగు సినిమా కావడంతో ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఈ హీరోయిన్..
ఈ సినిమా వరకు వచ్చిన తన ప్రయాణం గురించి.. మాలవిక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఒకప్పుడు తాను సాలార్ సినిమాలో నటించే అవకాశం వచ్చిందని.. సినిమా మాస్టర్ విడుదలైన తర్వాత, దర్శకుడు ప్రశాంత్ నీల్ తనను కలవాలని కోరినట్లు ఆమె గుర్తుచేసుకుంది. అందుకోసమే ఆమె ఆమె బెంగళూరుకు వెళ్లిందంట.
అక్కడ ప్రశాంత్ నీల్ స్వయంగా ఆమె ఫోటోలు కూడా తీసుకున్నారంట. ఆమె ఇండియన్ లుక్‌లో, వెస్ట్రన్ లుక్‌లో ఎలా కనిపిస్తుందో తెలుసుకోవడానికే ఆ ఫోటోలు తీశారని మాలవిక చెప్పింది. ఇక ఆ మీటింగ్ తో తనకు తప్పకుండా ఆ సినిమా ఆఫర్ వస్తుంది అని అనుకున్నట్లు తెలిపింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ అవకాశం కథకు రాలేద.. అప్పుడు తాను చాలా నిరాశకు గురయ్యానని మాలవిక చెప్పింది. ప్రభాస్‌తో పని చేసే అవకాశం అందరికీ రావని..అలాంటి ఛాన్స్ మిస్ కావడం బాధగా అనిపించిందని ఆమె వెల్లడించింది.
కొంతకాలం పాటు ఆ విషయం తన మనసులోనే ఉంది పోయిందని..అయితే, కొన్ని నెలల తర్వాత ఆమెకు మరో ఫోన్ కాల్ వచ్చిందని. ఈసారి కూడా ప్రభాస్ సినిమా కోసమే అని తెలియడంతో చాలా సంతోషపడ్డాను అని తెలిపింది.
మొదట ఆ ఫోన్ కాల్ వచ్చింది సలార్ సినిమా కోసమే అని అనుకున్నాను అని.. కానీ ఆ ఫోన్ కాల్ వచ్చింది ది రాజా సాబ్ సినిమా కోసమని మళ్లీ తెలిసిందని చెప్పుకొచ్చింది. “అప్పుడే అన్నీ ఒక కారణంతోనే జరుగుతాయని అనిపించింది. తెలుగు సినిమా ఎంట్రీ ప్రభాస్‌తోనే జరగాలని విధి రాసి పెట్టింది,” అంటే చెప్పుకొచ్చింది ఈ హీరోయిన్.
