ఫెస్టివ్ లుక్‌లో మాళవిక మోహనన్.. ట్రెడిషనల్ ఎలిగెన్స్‌తో అదరగొట్టిందిగా!
దివాలి పండుగ వైబ్‌ను చాటుతూ ‘థట్ టైం అఫ్ ది ఇయర్ ’ అనే క్యాప్షన్‌తో మాళవిక మోహనన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని అద్భుతమైన ఫోటోలను పోస్ట్ చేసింది.
By: Madhu Reddy | 26 Oct 2026 8:18 PM ISTసౌత్ ఇండస్ట్రీలో తనదైన అందం, నటనతో కుర్రకారు హృదయాలను కొల్లగొడుతోంది మలయాళ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్. ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన ‘ది రాజాసాబ్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ భామ, సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ తన గ్లామరస్ ఫోటోలతో సందడి చేస్తూ ఉంటుంది. తాజాగా దీపావళి పండుగ సందడిని పురస్కరించుకుని ఈ బ్యూటీ షేర్ చేసిన ట్రెడిషనల్ ఫోటోషూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ విశేషాలు చూద్దాం..
రెడ్ బనారసీ లెహంగాలో దేవకన్యలా:
దివాలి పండుగ వైబ్‌ను చాటుతూ ‘థట్ టైం అఫ్ ది ఇయర్ ’ అనే క్యాప్షన్‌తో మాళవిక మోహనన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని అద్భుతమైన ఫోటోలను పోస్ట్ చేసింది. వైబ్రెంట్ క్రిమ్సన్ రెడ్ కలర్ బనారసీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ లెహంగా లంగా ఓణీలో ఆమె అప్సరసలా మెరిసిపోయింది. ఈ అవుట్‌ఫిట్‌లో ఆమె చూపిన సంప్రదాయ అందం, రాయల్ ఎలిగెన్స్ చూసి ఫ్యాన్స్ మంత్రముగ్ధులవుతున్నారు.
తురుముకున్న పూల చెండు.. బంగారు జుంకాలు:
ఈ ఫెస్టివ్ లుక్కు మరింత అందాన్ని తేవడానికి మాళవిక మోహనన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. తలలో నీట్‌గా తురుముకున్న మల్లెపూల చెండు, చెవులకు హెవీ స్టేట్మెంట్ బంగారు జుంకాలు, చేతులకు మ్యాచింగ్ గాజులు, నుదుటిన చిన్న నల్లటి బొట్టుతో పక్కా భారతీయ సంప్రదాయ యువతిలా మురిపించింది. ఈ క్లాసిక్ ఎత్నిక్ లుక్ ఆమెను పండుగ వేళ మరింత అందంగా ఆవిష్కరించింది.
'ది రాజాసాబ్' నుంచి చేతిలో క్రేజీ ప్రాజెక్టుల వరకు:
మోడల్‌గా కెరీర్ ప్రారంభించి మలయాళ చిత్రం ‘పట్టం పోల్’ ద్వారా వెండితెరకు పరిచయమైన మాళవిక, 'చెన్నై టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2020'లో ఐదవ స్థానంలో నిలిచింది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. ఇక ఇటీవల తమిళంలో కార్తి సరసన 'సర్దార్ 2' లో పవర్ఫుల్ యాక్షన్ రోల్ చేసిన ఈ భామ, ప్రస్తుతం తిరుమల కుమారరాజ దర్శకత్వంలో విజయ్ సేతుపతితో కలిసి 'పాకెట్ నావెల్' అనే క్రైమ్ డ్రామాలో నటిస్తోంది.
సోషల్ మీడియాలో నెటిజన్ల ఫిదా:
మాళవిక మోహనన్ షేర్ చేసిన ఈ లేటెస్ట్ ఫోటోలకు నెటిజన్ల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. లవ్, ఫైర్ సింబల్స్‌తో కామెంట్లు చేస్తూ ఈ రాయల్ ట్రెడిషనల్ వైబ్‌ను తెగ పొగిడేస్తున్నారు. ఇక అటు వెండితెరపై విభిన్న పాత్రలతో మెప్పిస్తూనే, ఇటు సోషల్ మీడియాలో సంప్రదాయ దుస్తుల్లో రాయల్ లుక్స్‌తో తన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను మరింత పెంచుకుంటోంది ఈ రాజాసాబ్ బ్యూటీ.
ఇక మొత్తానికి చూస్తే, మోడ్రన్ అవుట్ఫిట్స్లోనే కాకుండా ఇలాంటి ట్రెడిషనల్ బనారసీ డ్రెస్‌లలో కూడా తాను ఎంత రాయల్‌గా కనిపిస్తానో మాళవిక మోహనన్ మరోసారి నిరూపించింది. ఇక పండుగ వాతావరణంలో క్లాసిక్ ఇండియన్ గ్లామర్‌తో మెరిసిన ఈ బ్యూటీ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
