ముంబై నడిబొడ్డున నటి ఇల్లు చిన్న కేరళలా!
ప్రస్తుతం తమిళ్ లో మ ఆత్రం బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో మాళవిక తాజాగా మలయాళీ మూలాలపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
By: Srikanth Kontham | 26 Aug 2026 8:00 PM ISTమలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అసవరం లేని పేరు. `ది రాజాసాబ్` తో టాలీవుడ్ లో లాంచ్ అయిన అమ్మడు తొలి సినిమా రిలీజ్ కు ముందే ఎంతో ఫేమస్ అయింది. ప్రభాస్ సరసన ఛాన్స్ కావడంతో? అమ్మడికి అంతగా గుర్తింపు దక్కింది. అయితే ఆ సినిమా అంచనాలు అందుకోవడంలో విఫలమవ్వడంతో మాళవిక తదుపరి తెలుగులో అవకాశాలు అందుకోలేకోయింది. ప్రస్తుతం తమిళ్ లో మ ఆత్రం బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో మాళవిక తాజాగా మలయాళీ మూలాలపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
కేరళలో కాకుండా ముంబైలో పుట్టి పెరిగినా? తనకు ఓనం పండుగ సాంస్కృతిక వేర్లతో అనుసంధానం కావడానికి గొప్ప వేదిక అని తెలిపారు. ఈ పండుగ తనకు కేవలం ఒక వేడుక మాత్రమే కాదని. తన మలయాళీ అస్తిత్వాన్ని సగర్వంగా చాటుకునే సుందరమైన రోజని పేర్కొన్నారు. ముంబై నగరంలో విద్యాభ్యాసం, బాల్యం గడిచినా? ఇంట్లో మాట్లాడే భాష మలయాళం కావడం .. సంప్రదాయ ఆహారపు అలవాట్లు తమ కుటుంబంలో ఎప్పుడూ చెక్కుచెదరలేదని గుర్తు చేసుకున్నారు. బాల్యంలో తనకు కేరళ సద్య (సాంప్రదాయ భోజనం) కంటే ముగ్గులు, పూలతో వేసే పూకాలం తయారీ అంటేనే ఎంతో ఇష్టమన్నారు.
పొరుగున ఉండే స్నేహితులను ఇంటికి పిలిచి, అందరూ కలిసి పూలతో డిజైన్లు తయారు చేయడం మంచి అనుభూతి ఇస్తుండేదన్నారు. వయసు పెరిగేకొద్దీ ఓనం పండుగ ప్రాముఖ్యత తన జీవితంలో మరింత మారిందన్నారు. కేరళ సంప్రదాయ వస్త్రమైన కసవు చీరను ధరించడం ఎంతో ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుందని మాళవిక తెలిపారు. కేరళ సంప్రదాయ వస్త్రాలలోని అందం, వాటిని ఎంత సింపుల్‌గా ? ఎంత గ్రాండ్‌గానైనా? ధరించవచ్చనే సౌలభ్యం కసవు చీర సొంతమని కొనియాడారు.
తెల్లటి వస్త్రంపై బంగారు అంచులు ఉండే శైలి ఎప్పుడూ ప్రత్యేకమేనని మాళవిక అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం బిజీ షెడ్యూల్స్ మధ్య కూడా ఓనం పండుగ కోసం సమయం కేటాయించుకుని కేరళలోని సొంతూరికి వెళ్లడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. పెద్దలు వయసు మీదపడుతున్న తరుణంలో కుటుంబ సభ్యులంతా ఒక్కచోట చేరి కజిన్స్‌తో కలిసి సంతోషంగా గడపడమే ఈ పండుగ అసలైన అర్థమని పేర్కొన్నారు.
తమ కుటుంబంలోని అమ్మాయిలందరూ కలిసి సంప్రదాయ వంటకాలు ఆరగించడం, కార్డ్ గేమ్స్ ఆడటం ద్వారా పండుగను ఆస్వాదిస్తామన్నారు. ముంబైలోని తమ ఇంట్లో కూడా అమ్మ స్వయంగా అరటాకులో కేరళ సద్యను తయారు చేసి బంధుమిత్రులను ఆహ్వానిస్తుంటారని తెలిపారు. తమ ఇల్లు ముంబై నడిబొడ్డున చిన్న కేరళలా మారుతుందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. తన మూలాలను ఎప్పటికీ మరువకూడదనే ఉద్దేశంతోనే కేరళతో తన అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్నానని మాళవిక మోహనన్ తెలిపారు.
