వీడియో : మేకప్ రూంలో మాళవిక హొయలు
మలయాళి ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా అడుగు పెట్టి దశాబ్ద కాలం దాటింది.
By: Ramesh Palla | 28 Oct 2025 8:00 PM ISTమలయాళి ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా అడుగు పెట్టి దశాబ్ద కాలం దాటింది. ఇప్పటి వరకు మలయాళం, కన్నడం, హిందీ, తమిళ్ సినిమాలను చేస్తూ వచ్చిన ఈ అమ్మడు ఎట్టకేలకు టాలీవుడ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రభాస్‌తో మారుతి దర్శకత్వంలో ఈమె చేసిన రాజాసాబ్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. టాలీవుడ్‌లో ఈమె ఎంట్రీ కోసం దాదాపు రెండు మూడు ఏళ్లుగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. డబ్బింగ్ సినిమాలతో ఇప్పటికే తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ అమ్మడు ముందు ముందు టాలీవుడ్‌లో డైరెక్ట్ సినిమాలతో అలరిస్తాను అనే నమ్మకంను కలిగి ఉంది. ఆకట్టుకునే అందం తో పాటు, మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం కావడంతో అన్ని భాషల ఇండస్ట్రీలోనూ ఈమెతో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు ఆసక్తి చూపిస్తారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో మాళవిక మోహనన్
ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా అందాల ఆరబోత ఫోటోలు, వీడియోలను షేర్ చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తుంది. ఈ పదేళ్ల కాలంలో ఈమె సినిమాలతో దక్కించుకున్న గుర్తింపుతో పోల్చితే అందమైన ఫోటో షూట్స్‌తో దక్కించుకున్న గుర్తింపు, స్టార్‌డం ఎక్కువ అనే అభిప్రాయం ఉంది. అందుకే సోషల్ మీడియాలో క్రమం తప్పకుండా మాళవిక తన అందమైన ఫోటోలు, వీడియోలను షేర్ చేయడం మనం చూస్తూ ఉంటాం. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 43 లక్షలకు పైగా ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న మాళవిక మోహనన్ తాజాగా మరో అందమైన వీడియోను షేర్ చేసింది. ఎప్పటిలాగే ఈమె షేర్ చేసిన వీడియో గంటల వ్యవధిలోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ స్థాయిలో అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేస్తూ, ఆకట్టుకుంటున్న మాళవిక దక్కించుకోవాల్సిన స్థాయిలో ఆఫర్లు దక్కించుకోవడం లేదు అనేది చాలా మంది మాట.
మాళవిక మోహనన్ అందాల ఆరబోత..
తాజాగా షేర్ చేసిన వీడియోలో మాళవిక మోహనన్‌ను ఒక షూటింగ్ సమయంలో రెడీ అయ్యే మేకప్ రూంలో చూడవచ్చు. మిర్రర్ ముందు, మెరిసే లైట్స్ ముందు ఆమె హొయలు పోతూ ఫోటోలకు ఫోజ్ ఇస్తూ ఫోటోలు తీయించుకుంది. ఆ ఫోటోలకు సంబంధించిన వీడియోను మాళవిక షేర్ చేసింది. ఎప్పుడూ ఫోటో షూట్స్ మాత్రమే కాకుండా అప్పుడప్పుడు ఇలా అందమైన వీడియోలను షేర్ చేయడం ద్వారా అభిమానులను అలరించినట్లు అవుతుంది. ఇలాంటి అందమైన వీడియోలను షేర్ చేయడం ద్వారా నెట్టింట ఈమె ఫాలోయింగ్ మరింతగా పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ అమ్మడికి ఉన్న ఫాలోయింగ్ కి ప్రత్యక్ష సాక్ష్యం అన్నట్లుగా ఈ వీడియో షేర్ చేసిన కొన్ని గంటల్లోనే దాదాపు లక్షకు పైగా లైక్స్ నమోదు కావడం విశేషం.
ప్రభాస్ రాజాసాబ్ సినిమాలో...
మాళవిక మోహనన్ సినిమాల విషయానికి వస్తే ఇటీవలే మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన హృదయపూర్వకం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలో విభిన్నమైన పాత్రలో కనిపించడంతో పాటు, నటనకు ఆస్కారం ఉన్న పాత్రను చేసింది. అంతకు ముందు ఈమె తంగలాన్, యుద్ర సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రభాస్‌తో ఈమె చేసిన రాజాసాబ్ సినిమా ఈ ఏడాదిలోనే విడుదల కావాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.
2026 సంక్రాంతికి ఈ అమ్మడు టాలీవుడ్ ఎంట్రీకి ముహూర్తం ఖరారు అయింది. ఇటీవల విడుదలైన రాజాసాబ్ టీజర్, ట్రైలర్ కి మంచి స్పందన లభించింది. అందులో మాళవిక మోహనన్ పాత్రను రివీల్ చేయడం జరిగింది. సినిమాలో మాళవిక పాత్ర చాలా ప్రధానంగా, కథలో ముఖ్యమైనదిగా సాగుతుందని అందులోని విజువల్స్‌ను చూస్తే అనిపిస్తుంది. మరి రాజాసాబ్‌లో మాళవిక పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే.
