మెగా 158లో ప్రభాస్ బ్యూటీ.. ఒక్క పోస్ట్ తో క్లారిటీ!
ఇక విశిష్ట మల్లిడి దర్శకత్వంలో 'విశ్వంభర' సినిమా షూటింగ్ అయితే పూర్తి చేశారు కానీ విడుదలకు మాత్రం నోచుకోలేదు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ చేయబోతున్నారు.
By: Madhu Reddy | 29 Oct 2025 2:56 PM ISTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి ఏడు పదుల వయసులో కూడా వరుసగా చిత్రాలు ప్రకటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు చివరిగా 'వాల్తేరు వీరయ్య' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న చిరంజీవి.. ఆ తర్వాత వచ్చిన 'భోళాశంకర్' సినిమాతో డిజాస్టర్ ను చవిచూశారు. ఇక విశిష్ట మల్లిడి దర్శకత్వంలో 'విశ్వంభర' సినిమా షూటింగ్ అయితే పూర్తి చేశారు కానీ విడుదలకు మాత్రం నోచుకోలేదు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ చేయబోతున్నారు.
ఇదిలా ఉండగా మరొక వైపు ఈ ఏడాది సంక్రాంతి బరిలో దిగి 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో బ్లాక్ బాస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'మన శంకర వరప్రసాద్ గారు' అనే సినిమా చేస్తున్నారు చిరంజీవి. ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా వచ్చే యేడాది సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతోంది. ఇదిలా ఉండగా మరొకవైపు చిరంజీవి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. తనకు వాల్తేరు వీరయ్య సినిమాతో మంచి విజయాన్ని అందించిన డైరెక్టర్ బాబి కొల్లి దర్శకత్వంలో 'మెగా 158' అనే వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమా అనౌన్స్ చేశారు. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్లో షూటింగ్ జరుపుకోనుంది.
ఇదిలా ఉండగా ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న కిది రాజాసాబ్ ' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్న మాళవిక మోహనన్ హీరోయిన్గా నటిస్తోంది అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలు చాప కింద నీరులా వ్యాపిస్తున్న నేపథ్యంలో తాజాగా దీనిపై స్పందించింది మాళవిక మోహనన్. ఆమె తన ట్విట్టర్ అధికారిక ఖాతా ద్వారా.. "మెగాస్టార్ చిరంజీవి హీరోగా, బాబీ దర్శకత్వంలో రానున్న మెగా 158 సినిమాలో మాళవిక మోహనన్ నటిస్తోంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఇవి నా వరకు చేరాయి. నిజానికి నా కెరియర్ లో ఒక్కసారైనా నేను చిరంజీవి లాంటి అగ్ర కథానాయకుడితో నటించాలని కోరుకుంటున్నాను. ఆ రోజు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్టులో నేను నటిస్తున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. నేను ఇందులో నటించడం లేదు" అంటూ ఆమె క్లారిటీ ఇచ్చారు. మొత్తానికైతే ఒక్క పోస్టుతో రూమర్స్ కి చెక్ పెట్టారు మాళవిక మోహనన్.
ఈ ముద్దుగుమ్మ ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. ప్రముఖ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి నటిస్తున్న హారర్ బ్యాక్ డ్రాప్ మూవీ ది రాజా సాబ్. ఇందులో నిధి అగర్వాల్ , రిద్ధి కుమార్ తో పాటు మాళవిక మోహనన్ కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. అంతేకాదు ఇదే ఆమె తొలి తెలుగు చిత్రం కూడా కావడం గమనార్హం.
