పర్ఫెక్ట్ ఫోజులతో ఆకట్టుకుంటున్న మాళవిక!
మాళవిక తాజాగా బ్రౌన్ కలర్ డ్రెస్ ధరించి అందాలతో ఆకట్టుకుంది . ముఖ్యంగా బాడీ పర్ఫెక్ట్ లుక్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది .సమ్మర్ స్పెషల్ గా తన అందాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
By: Madhu Reddy | 25 April 2026 12:49 PM ISTసోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత భాషతో సంబంధం లేకుండా హీరోయిన్స్ అందరూ తమ అందాలను ఆరబోస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. అలాంటి వారిలో మాళవిక మోహనన్ కూడా ఒకరు.. చక్కని రూప లావణ్యం.. ఆశ్చర్యపరిచే ఎత్తు.. ఆకట్టుకునే హుందాతనం అన్నీ ఈమె సొంతం. అటు నటనలో గ్లామర్ ఒలకబోయడమే కాదు యాక్షన్ పర్ఫామెన్స్ ఇవ్వడానికి కూడా తాను వెనుకాడను అని నిరూపిస్తోంది ఈ ముద్దుగుమ్మ.. అందులో భాగంగానే ఒకవైపు సినిమాలలో బిజీగా ఉంటూనే మరొకవైపు ఇంస్టాగ్రామ్ వేదికగా అందాలు ఆరబోస్తూ షేర్ చేసిన ఫోటోలు.. ఇచ్చిన పర్ఫెక్ట్ ఫోజులు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
మాళవిక తాజాగా బ్రౌన్ కలర్ డ్రెస్ ధరించి అందాలతో ఆకట్టుకుంది . ముఖ్యంగా బాడీ పర్ఫెక్ట్ లుక్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది .సమ్మర్ స్పెషల్ గా తన అందాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. మొత్తానికైతే ఇంస్టాగ్రామ్ వేదికగా మాళవిక పంచుకున్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మాళవిక విషయానికి వస్తే ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేయు మోహనన్ వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. 1993 ఆగస్టు 4న కేరళ పయ్యనూర్ లో జన్మించిన మాళవిక 2013లో పట్టం పోల్ అనే మలయాళ చిత్రం ద్వారా నటిగా ఇండస్ట్రీకి పరిచయం అయింది.
మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత కన్నడ , హిందీ భాషల్లో కూడా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక 2021లో వచ్చిన మాస్టర్ సినిమాలో చారులత పాత్ర పోషించి ఇటు తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించింది మాళవిక. అలా పలు చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఈమె ఈ ఏడాది తొలిసారి తెలుగులో నటించి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ కెరియర్లో తొలిసారి హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్లో వచ్చిన చిత్రం ది రాజా సాబ్.
ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. పైగా ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది మాళవిక మొదటి సినిమానే డిజాస్టర్ గా నిలవడంతో పూర్తి నిరాశ వ్యక్తం చేసినా.. ఇందులోని ఈమె యాక్షన్ సీక్వెన్స్ కి అభిమానులు ఫిదా అయిపోయారు. అందం అభినయంతో ప్రభాస్ కి ఈడు జోడు అంటూ కామెంట్లు కూడా చేశారు. అలా తన నటనతో తెలుగు అభిమానులను కూడా మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.
ఇకపోతే మాళవిక ప్రస్తుతం సర్దార్ 2 చిత్రంలో నటిస్తోంది. కార్తీ హీరోగా వచ్చిన సర్దార్ సినిమాకి సీక్వెల్. భారీ అంచనాల మధ్య షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలని చూస్తోంది మాళవిక. మరి అమ్మడికి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.
