రష్మిక ఎక్స్ప్రెషన్స్.. మలైకా డాన్స్.. అదిరిపోయిందిగా!
బాలీవుడ్ నటి మలైకా అరోరా ఐటెం సాంగ్ లకు కేరాఫ్ అడ్రస్స్ గా నిలిచింది.. ఈమె తన బాడీని స్ప్రింగ్ మాదిరి తిప్పుతూ.. ఏ స్టెప్పు అయినా సరే అలవోకగా చేస్తుంది.
By: Madhu Reddy | 14 Oct 2025 1:55 PM ISTబాలీవుడ్ నటి మలైకా అరోరా ఐటెం సాంగ్ లకు కేరాఫ్ అడ్రస్స్ గా నిలిచింది.. ఈమె తన బాడీని స్ప్రింగ్ మాదిరి తిప్పుతూ.. ఏ స్టెప్పు అయినా సరే అలవోకగా చేస్తుంది. అయితే అలాంటి బాలీవుడ్ నటి మలైకా అరోరా థామా సినిమాలో చేసిన స్పెషల్ సాంగ్ ని చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ పాటలో మలైకా అరోరా తన స్టెప్పులతో అందరిని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ పాటలో కేవలం మలైకా అరోరా మాత్రమే కాదు రష్మిక మందన్నా కూడా చిందులు వేసింది. అయితే ప్రస్తుతం రష్మిక మందన్నా, మలైకా అరోరాలకు సంబంధించిన ఒక డాన్స్ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో నెట్టింట చెక్కర్లు కొట్టడంతో ఆ వీడియో చూసిన నెటిజన్లు రష్మిక ఎక్స్ప్రెషన్స్ కి క్యూట్ కామెంట్లు పెడుతున్నారు.
ఇక విషయంలోకి వెళ్తే.. ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్నా కలిసి నటించిన తాజా మూవీ థామా. కామెడీ హార్రర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమాకి ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహించగా.. మడ్దాక్ ఫిల్మ్ బ్యానర్ పై దినేష్ విజన్, అమర్ కౌశిక్ లు నిర్మించారు. అయితే తాజాగా ఈ సినిమాలోని పాయిజన్ బేబీ అనే స్పెషల్ సాంగ్ ని చిత్ర నిర్మాతలు విడుదల చేశారు. ఈ పాయిజన్ బేబీ సాంగ్ లో మలైకా అరోరా తన స్టెప్పులతో ఇరగదీసింది. అలాగే ఈ స్పెషల్ సాంగ్ లో రష్మిక మందన్నా కూడా చేసింది. అయితే ఈ విషయం పక్కన పెడితే.. తాజాగా థామా మూవీ ప్రమోషన్స్ లో రష్మిక మందన్నా, మలైకా అరోరా ఇద్దరు కలిసి స్టేజిపై స్టెప్పులు వేశారు. మలైకా అరోరా స్టేజ్ పై స్టెప్పులు వేస్తూ ఉంటే.. ఆమెను చూసుకుంటూ రష్మిక మందన్నా కూడా స్టెప్పులు వేసింది.
అయితే రష్మిక మందన్నా, మలైకా చేసే స్టెప్పులను కాస్త ఇబ్బంది పడుతూ చేసినప్పటికీ తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో రష్మిక వైరల్ అయింది. స్టేజ్ పై మలైకా వేసే స్టెప్పులు అన్నింటిని రష్మిక ఫాలో అవుతూ చేసింది. మలైకా అరోరా వేసే స్టెప్పులకి రష్మిక మందన్నా మలైకాని చూస్తూ స్టెప్పులు వేయడమే కాకుండా ఆమె చెప్పే స్టెప్స్ అన్నింటికీ క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది.ప్రస్తుతం మలైకా, రష్మిక మందన్న ఇద్దరు కలిసి స్టేజ్ పై చేసిన డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో ఈ వీడియోలో రష్మిక ఎక్స్ప్రెషన్స్ కి చాలామంది కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు..
అలా ఓవైపు స్ప్రింగ్ ల బాడీని తిప్పే మలైకా అరోరా డ్యాన్స్ చేస్తున్నా కూడా రష్మిక మందన్నా అందం మీదకే అందరి కన్ను పోతుంది. ఆమె ఇచ్చే క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కి ఫిదా అవుతున్నారు ఇక రష్మిక మందన్నా, ఆయుష్మాన్ ఖురానా కలిసి నటించిన థామా మూవీ అక్టోబర్ 21న విడుదల కాబోతోంది.. అలా రష్మిక ఓవైపు సౌత్ సినిమాల్లో రాణిస్తూనే మరోవైపు బాలీవుడ్ సినిమాల్లో కూడా తన సత్తా చాటుతోంది.
