పిక్‌టాక్ : 50లో 20 అందంతో పిచ్చెక్కిస్తోంది
బాలీవుడ్ ముద్దుగుమ్మల్లో మలైకా అరోరా చాలా స్పెషల్ అనడంలో సందేహం లేదు. ఇండస్ట్రీలో అడుగు పెట్టి మూడు దశాబ్దాలు దాటింది.
By: Ramesh Palla | 26 Nov 2025 4:33 PM ISTబాలీవుడ్ ముద్దుగుమ్మల్లో మలైకా అరోరా చాలా స్పెషల్ అనడంలో సందేహం లేదు. ఇండస్ట్రీలో అడుగు పెట్టి మూడు దశాబ్దాలు దాటింది. ఆమె చేసిన సినిమాలు పెద్దగా ఏమీ లేదు. ఎక్కువ ఐటెం సాంగ్స్ చేసింది. బుల్లి తెర ద్వారా ఇండస్ట్రీలో గుర్తింపు దక్కించుకుంది. కానీ ఆమె చేసిన ఐటెం సాంగ్స్ కారణంగా 30 ఏళ్లు కాదు 50 ఏళ్లు అయినా ఆమెను గుర్తు పెట్టుకుంటారు ప్రేక్షకులు. ఆమె ఇండస్ట్రీలో అడుగు పెట్టింది మొదలుకుని అన్ని భాషల ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూ వచ్చింది. ఆకట్టుకునే అందంతో పాటు డాన్స్ విషయంలో ఎంతో మందికి పోటీ అన్నట్లుగా ఈ అమ్మడు నిలిచింది. అందుకే బాలీవుడ్‌లో అత్యంత ఖరీదైన ఐటెం గర్ల్ అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. తెలుగులో ఈమె కెవ్వుకేక పెట్టించడం ద్వారా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పనక్కర్లేదు.
మలైకా అరోరా ఇన్‌స్టాగ్రామ్ ఫోటో...
మలైకా అరోరా వయస్సు విషయంలో కాస్త గందరగోళం ఉంది. అయితే కాస్త అటు ఇటుగా ఆమె వయసు 50 ఏళ్లు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సాధారణంగా 50 ఏళ్ల వయసులో ముసలితనంకు వచ్చినట్లుగా అంతా ఫీల్ అవుతారు. కానీ మలైకా మాత్రం తాను ఇంకా ఇరవై ఏళ్ల వయసులోనే ఉన్నట్లుగా ఫీల్ అవుతున్నట్లుగా ఉంది. అందుకే ఆమె ఔట్ ఫిట్ అలాంటివి ధరిస్తుందని కొందరు అంటూ ఉంటారు. అయితే ఆమె ఇప్పటికీ పాతికేళ్ల పడుచు అమ్మాయి మాదిరిగా ఉంది కనుక అలాంటి ఔట్ ఫిట్ వేస్తుంది అనేది కొందరి అభిప్రాయం. మొత్తానికి మలైకా అరోరా ఏ ఔట్ ఫిట్ వేసినా కూడా చర్చనీయాంశం కావడం ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం మాళవిక అరోరా సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసే ఫోటోలు కనీసం చూపు తిప్పనివ్వడం లేదు అంటూ చాలా మంది అంటూ ఉంటారు.
50 ఏళ్ల వయసులో ఏమీ ఈ అందం...
తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫోటోలతో మలైకా అరోరా కన్నుల విందు చేసింది. 50 ఏళ్ల వయసులో ఇలాంటి ఔట్ ఫిట్‌ను ట్రై చేయాలి అనుకోవడం చాలా పెద్ద విషయం అంటూ ఉంటారు. కానీ మలైకా ట్రై చేయడం మాత్రమే కాకుండా రెండు పదుల వయసు ఉన్న హీరోయిన్స్‌ను మించి అందంగా కనిపిస్తోంది అంటూ ఇండస్ట్రీ వర్గాల, మీడియా సర్కిల్స్ వారు మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్స్ ఈ ఫోటోల గురించి ప్రముఖంగా చర్చించుకోవడం మనం చూడవచ్చు. మలైకా అరోరా చాలా తక్కువ సినిమాలు చేయడం వల్ల ఆమె ప్రేక్షకులను మోసం చేసిందని, ఇంత అందం ఉన్న మలైకా ఇప్పటికీ అయినా సినిమాల్లో హీరోయిన్‌గా నటించవచ్చు కదా అంటూ చాలా మంది ఈ ఫోటోలు చూసిన తర్వాత ప్రశ్నిస్తున్నారు. ఆమె మాత్రం ఎప్పటిలాగే మౌనంగా ఫోటోలను షేర్ చేస్తూనే ఉంది.
క్లీ వేజ్ షో చేస్తూ మలైకా అరోరా
మలైకా అరోరా ఈ డ్రెస్‌లో క్లీ వేజ్ షో చేయడంతో పాటు, బ్యూటీఫుల్ మేకోవర్‌తో ఆకట్టుకుంది. బ్లాక్ అండ్ వైట్ కాంబో అంటే చాలా క్లాసికల్ లుక్ అనిపిస్తుంది. మలైకాకు ఇది బాగా సెట్ అయిందని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఈ బ్లాక్ డాట్స్ తో ఆమె మరింత బ్యూటీఫుల్‌గా కనిపిస్తోంది అంటూ కొందరు విశ్లేషిస్తున్నారు. మొత్తానికి స్టైలిష్ అవతార్‌లో ఈ అమ్మడిని చూసిన ప్రతి ఒక్కరూ హీరోయిన్‌గా ఇంకా చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు. మలైకా అరోరా మాత్రం సినిమాలకు సాధ్యం అయినంత దూరంగా ఉంటూ వస్తోంది. అయితే భవిష్యత్తులో ఆమె నుంచి సినిమాలు రావు అని మాత్రం చెప్పడం సాధ్యం కాదని కొందరు అంటున్నారు. అతి త్వరలోనే ఈమె ఒక బుల్లి తెర షో ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుందనే వార్తలు వస్తున్నాయి. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
