Begin typing your search above and press return to search.

మలైకా అందాల మాయ.. ఎంత మోసం అంటే..

ఈ లేటెస్ట్ పిక్స్​లో మలైకా న్యూట్రల్ టోన్స్ థీమ్​తో మతిపోగొడుతోంది. లేత గోధుమ రంగు స్ట్రాపీ బాడీకాన్ డ్రెస్​లో తన వంపుసొంపులను ఎలివేట్ చేస్తూ ఘాటు​గా దర్శనమిచ్చింది.

By:  M Prashanth   |   22 Dec 2025 7:00 PM IST
మలైకా అందాల మాయ.. ఎంత మోసం అంటే..
X

బాలీవుడ్​లో ఫిట్​నెస్​కు, ఫ్యాషన్​కు కేరాఫ్ అడ్రస్ ఎవరంటే ఠక్కున వినిపించే పేరు మలైకా అరోరా. ఐదు పదుల వయసులోనూ పాతికేళ్ల అమ్మాయిలకు పోటీనిచ్చే గ్లామర్ ఆమె సొంతం. యోగా, జిమ్ అంటూ తన శరీరాన్ని ఎంత పర్ఫెక్ట్​గా మెయింటైన్ చేస్తుందో అందరికీ తెలిసిందే. ఇటీవల ఈ బ్యూటీ షేర్ చేసిన ఫొటోషూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తోంది.




ఈ లేటెస్ట్ పిక్స్​లో మలైకా న్యూట్రల్ టోన్స్ థీమ్​తో మతిపోగొడుతోంది. లేత గోధుమ రంగు స్ట్రాపీ బాడీకాన్ డ్రెస్​లో తన వంపుసొంపులను ఎలివేట్ చేస్తూ ఘాటు​గా దర్శనమిచ్చింది. దానికి మ్యాచింగ్​గా అదే రంగు బ్లేజర్​ను భుజాలపై వేసుకుని, ఒక బాస్ లేడీలా ఇచ్చిన ఫోజులు చూస్తుంటే వావ్ అనాల్సిందే.




"న్యూట్రల్ టోన్స్, స్ట్రాంగ్ ఎనర్జీ" అంటూ మలైకా పెట్టిన క్యాప్షన్ ఆమె ఆటిట్యూడ్​కు అద్దం పడుతోంది. సింపుల్​గా కనిపిస్తూనే ఎంతో పవర్​ఫుల్ వైబ్స్ క్రియేట్ చేయడం మలైకా స్పెషాలిటీ. తన చూపులతోనే నెటిజన్లను కట్టిపడేస్తున్న ఈ భామ, గ్లామర్ డోస్ ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించింది. ఆమె వయసు 50 అంటే అసలు నమ్మడానికి వీలు లేకుండా మోసం చేస్తోంది అంటూ నెటిజన్లు కొంటెగా కామెంట్ చేస్తున్నారు.




ఎవరైనా సడన్ గా చూస్తే ఆమె వయసు 30 అని అనకుండా ఉండలేరని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా అందంతో వయసును దాచాలి అంటే మలైకా తరువాత ఎవరైనా. ఈ లుక్​లో మలైకా వేలికి ధరించిన పెద్ద ఎమరాల్డ్ గ్రీన్ రింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే టాటూ స్పష్టంగా కనిపిస్తూ, ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షిస్తోంది.

మినిమల్ మేకప్, లూజ్ హెయిర్​తో చాలా న్యాచురల్​గా, క్లాసీగా మెరిసిపోతోంది. వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా, కెరీర్ పరంగా, గ్లామర్ పరంగా మలైకా ఎప్పుడూ టాప్​లోనే ఉంటుంది. 'చయ్య చయ్య' అంటూ కుర్రాళ్ల గుండెల్లో చేరిన ఈ సుందరి, ఇప్పటికీ అదే క్రేజ్​ను కొనసాగిస్తోంది. ఈ లేటెస్ట్ ఫొటోలు చూసిన నెటిజన్లు "ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్" అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.