Begin typing your search above and press return to search.

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

బాలీవుడ్ నటి మలైకా అరోరా - అర్బాజ్ ఖాన్ ల కుమారుడు అర్తాన్ ఖాన్ సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక విషయంతో ట్రెండింగ్‌లో నిలుస్తుంటాడు.

By:  Srikanth Kontham   |   2 Nov 2026 3:18 PM IST
సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!
X

బాలీవుడ్ నటి మలైకా అరోరా - అర్బాజ్ ఖాన్ ల కుమారుడు అర్తాన్ ఖాన్ సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక విషయంతో ట్రెండింగ్‌లో నిలుస్తుంటాడు. తాజాగా అర్హాన్ గ్రూమింగ్ సెషన్‌కు సంబంధించి పంచుకున్న ఫొటోలు, వీడియోలు నెట్టింట‌ చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో ప్రత్యేకంగా ఆయన సెలూన్ కుర్చీలో కూర్చుని ఐబ్రోస్‌ను త్రెడ్డింగ్ చేయించుకుంటున్న క్షణాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ ఫొటోలకు అర్హాన్ `బస్ హోగయా` (అయిపోయింది) అంటూ క్యాప్షన్ ఇవ్వడం విశేషం.

అయితే ఈ పోస్ట్‌పై తల్లి మలైకా అరోరా స్పందించిన తీరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కొడుకు కనుబొమ్మలను షేప్ చేయించుకుంటున్న ఫొటోను చూసిన మలైకా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ట్రేడ్‌మార్క్ స్టైల్‌లో ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. `ఇట్స్ డన్ బ్రో!!` అంటూ చేసిన కామెంట్ నెటిజన్లను నవ్విస్తోంది. సల్మాన్ ఖాన్ తరచూ వాడే బాడీ లాంగ్వేజ్ పోలిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ ఫోటో డంప్‌లో ఐబ్రో ట్రెడ్డింగ్ మాత్రమే కాకుండా అర్హాన్ తల్లి మలైకా తల్లి (అర్హాన్ అమ్మమ్మ) స్టైలిష్‌గా పోజిచ్చిన ఫొటోను షేర్ చేసారు. `లాస్ట్ పిక్.. ఎపిక్` అంటూ ప్రశంసించారు. అలాగే పొడవాటి జుట్టు, మీసాలతో ఉన్న క్లోజప్ సెల్ఫీలు, రాత్రి సమయాల్లో మ్యూజిక్ వెన్యూలో గడిపిన కొన్ని మధుర క్షణాలను కూడా ఆయన ఈ పోస్ట్‌లో పంచుకున్నారు. కుటుంబ సభ్యులతో ఉన్న సరదా క్షణాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుం టున్నాయి.

మలైకా అరోరా, అర్బాజ్ ఖాన్‌ల కుమారుడైన అర్హాన్ నటనపై కాకుండా దర్శకత్వం ..మేకింగ్ వైపు ఆసక్తిగా ఉన్నాడు. ఇప్పటికే డిజిటల్ రంగంలోకి ప్రవేశించిన అర్హాన్ స్నేహితులతో కలిసి `డంబ్ బిర్యానీ` అనే పాడ్‌కాస్ట్‌ను విజయవంతంగా నడుపుతున్నారు. ఈ పాడ్‌కాస్ట్‌కు తల్లిదండ్రులతో పాటు సల్మాన్ ఖాన్ వంటి ప్రముఖులు అతిథులుగా హాజరై సందడి చేయడం విశేషం. సినిమాలకు దూరంగా ఉంటూనే డిజిటల్ మీడియా ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

తల్లిదండ్రులు చిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి నటులుగా కొన‌సాగినా? అర్హాన్ తనకంటూ స్వతంత్రమైన దారిని ఎంచుకోవడం గమనార్హం. వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి బదులు బిహైండ్ ది కెమెరా వర్క్‌పై ఫోకస్ పెట్టడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. సెలబ్రిటీ కిడ్ అయినా? చాలా సింపుల్‌గా, ట్రెండ్‌కు తగ్గట్టుగా లైఫ్‌స్టైల్‌ను లీడ్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇలా సాధారణ గ్రూమింగ్ సెషన్ ఫొటోతో ప్రారంభమైన సరదా ముచ్చట మలైకా అరోరా సల్మాన్ ఖాన్ స్టైల్ రియాక్షన్‌తో మరింత పాపులర్ అయింది. కుమారుడి అల్లరిని, విభిన్న ప్రయత్నాలను తల్లిగా మలైకా ప్రోత్సహిస్తున్న తీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.