Begin typing your search above and press return to search.

రూమ‌ర్డ్ బోయ్ ప్రెండ్ తో మ‌లైకా ముంబై వీధుల్లో!

బాలీవుడ్ ఫిట్‌నెస్ ఐకాన్ మలైకా అరోరా వ్యక్తిగత జీవితం ఎప్పుడూ సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గానే ఉంటుంది. సినిమాల కంటే పర్సనల్ లైఫ్, స్టైలిష్ లుక్స్ , రిలేషన్‌షిప్ ల‌తో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.

By:  Srikanth Kontham   |   27 July 2026 7:00 AM IST
రూమ‌ర్డ్ బోయ్ ప్రెండ్ తో మ‌లైకా ముంబై వీధుల్లో!
X

బాలీవుడ్ ఫిట్‌నెస్ ఐకాన్ మలైకా అరోరా వ్యక్తిగత జీవితం ఎప్పుడూ సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గానే ఉంటుంది. సినిమాల కంటే పర్సనల్ లైఫ్, స్టైలిష్ లుక్స్ , రిలేషన్‌షిప్ ల‌తో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఈ బ్యూటీ రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ముంబై వీధుల్లో ఓ పార్టీలలో ప్రత్యక్షమవడం బాలీవుడ్ మీడియాలో మరోసారి చర్చకు దారితీసింది. కొంత కాలంగా మలైకా అరోరా ప్రేమ వ్యవహారానికి సంబంధించి నెట్టింట రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రముఖ డైమండ్ మర్చంట్ హ‌ర్ష మెహతాతో ప్రేమలో ఉన్నా రంటూ బాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

ఈ జంట గతంలో ఓ మ్యూజిక్ కాన్సర్ట్‌తో పాటు ఎయిర్‌పోర్ట్‌లోనూ ఒకే సమయంలో కనిపించడం మీడియా కంట పడింది. అప్పటి నుంచి ఇద్ద‌రి మధ్య ఏదో నడుస్తోందంటూ వ‌స్తోన్న వార్తలకు సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా ముంబైలోని బాంద్రా ప్రాంతంలో కుమారుడు అర్హాన్ ఖాన్ ..కొద్దిమంది సన్నిహిత స్నేహితులతో కలిసి మలైకా డిన్నర్ డేట్ పార్టీకి హాజరయ్యారు. ఇదే వేదికపైకి రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్ హర్ష్ మెహతా కూడా రావడంతో కెమెరాలకు చిక్కారు. అయితే మీడియా ముందుకు ఒకేసారి రాకుండా విడివిడిగా ఎంట్రీ ఇస్తూ కనిపించడం గమనార్హం.

అయినప్పటికీ ఇద్ద‌రి ట్రెండీ లుక్స్ ..కలిసి తిరుగుతున్నారనే వార్తలు మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. మలైకా అరోరా ధరించిన మోడ్రన్ డ్రెస్స్ ..స్టైలిష్ అప్పియరెన్స్ ఎప్పట్లాగే అభిమానులను ఆకట్టుకున్నాయి. కెమెరాలకు చిక్కకుండా జాగ్రత్త పడినప్పటికీ సెలబ్రిటీల కదలికలను నిశితంగా గమనించే మీడియా కన్నుల నుంచి మాత్రం జంట తప్పించుకోలేకపోయింది. తాజా స్పాటింగ్ తో ఇద్ద‌రి మధ్య ఉన్న రిలేషన్‌షిప్ రూమర్స్ మరింత బలపడుతున్నాయి. అయితే ఈ ప్రేమ వార్తలపై ఇప్పటి వరకు మలైకా అరోరా కానీ, హర్ష్ మెహతా కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

తమ వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచడానికే ఇష్టపడుతున్నట్లు క‌నిపిస్తుంది. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఇద్ద‌రి సంబంధించిన ఫొటోలు, వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతూ నెటిజన్ల మధ్య ఆసక్తికర చర్చకు కారణమవుతున్నాయి. మొత్తానికి ముంబై వీధుల్లో హల్‌చల్ చేస్తున్న రూమర్డ్ కపుల్ అప్పియరెన్స్ బాలీవుడ్ కారిడార్లలో మరోసారి ప్రధాన ఆకర్షణగా మారింది. రానున్న రోజుల్లో ఇద్ద‌రు తమ బంధంపై ఎలాంటి క్లారిటీ ఇస్తారా ? లేక సైలెంట్‌గా ఉంటారా? అన్న‌ది చూడాలి.