కోట్లు సంపాదిస్తున్నా? ఖర్చు విషయంలో జాగ్రత్తే!
సక్సెస్ లో ఉన్న సెలబ్రిటీలంటే కోట్ల రూపాయల సంపాదన. సినిమాలు..యాడ్స్ రూపంలో రెండు చేతులా ఆదాయమే. ఆదాయానికి తగ్గట్లే ఖర్చులుంటాయి.
By: Srikanth Kontham | 17 Aug 2025 6:02 PM ISTసక్సెస్ లో ఉన్న సెలబ్రిటీలంటే కోట్ల రూపాయల సంపాదన. సినిమాలు..యాడ్స్ రూపంలో రెండు చేతులా ఆదాయమే. ఆదాయానికి తగ్గట్లే ఖర్చులుంటాయి. గ్లామర్ ఫీల్డ్ లో ఎంత సంపాదించినా? కరెన్సీ ఖర్చుకు లెక్కుండదు. అవకాశాలున్నా లేకపోయినా పీల్డ్ లో ఉన్నంత కాలం కొన్నిరకాల మెయింటనెన్స్ తప్పదు. ఇక్కడే బ్యాలెన్స్ తప్పితే లెక్కలన్నీ తారుమారవుతాయి. పాత తరం నటుల్లో కోట్లుసంపాదించిన వారంతా? చివరి కాలంలో చిల్లి గవ్వ లేకుండానే కాలం చేసారు. అయితే ఇప్పటి జనరేషన్ నటీమణులు డబ్బు విషయంలో జాగ్రత్తగానే ఉంటున్నారు.
ఖర్చు విషయంలో ఆచితూచే వ్యవహరిస్తుంటారు. అలాంటి వాళ్లలో నేను ఉన్నానంటూ ముందుకొచ్చింది ఐటం భామ మలైకా అరోరా. డబ్బు లేని రోజుల్ని.డబ్బున్న రోజుల్ని రెండింటిని చూసానంటూ చెప్పు కొచ్చింది. ఆర్దికంగా కుటుంబం పడిన కష్టాలు తెలియడంతోనే డబ్బు విషయాలు జాగ్రత్తగా ఉంటానని మలైకా తొలిసారి ఓపెన్ అయింది. మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన మలైకా తల్లి ఎంతో కష్టపడి తమని పెంచిందన్నారు. మెడలో పుస్తులు తాకట్టు పెట్టి మరీ స్కూల్ ఫీజులు కట్టేదని తెలిపింది.
'17 ఏళ్ల కే తాను కూడా పనికి వెళ్లడం ప్రారంభించిందంది. డబ్బు సంపాదించాలనే లక్ష్యంగా ప్రతీ రూపాయి కూడబెట్టేదాన్ని. స్నేహితులతో షికార్లకు వెళ్లడం, పార్టీలంటూ ఎంజాయ్ చేసింది లేదంది. సెలబ్రిటీ అయిన తర్వాత కూడా డబ్బుతో అంతే జాగ్రత్తగా ఉన్నట్లు తెలిపింది. పెట్టే ప్రతీ రూపాయి ఖర్చు డైలీ ఓ పుస్తకంలో రాస్తుందట. ఖరీదైన వస్తువులు వంటివి ఇప్పటికీ కొనదట. షాపింగ్ కి వెళ్తే ఎంత ఖర్చు చేయాలి? అన్నది ముందే రాసి పెట్టుకుంటుందట. ఆ లెక్క దాటకుండా ఖర్చు చేస్తానంది.
'ప్రతీసారి బ్రాండెడ్ వస్తువులే తీసుకోవాలి? అనేది ఏమీ ఉండదు. తనకు కావాల్సిన బ్రాండ్ లేకపోతే మరో కంపెనీ బ్రాండ్ తో అడ్జస్ట్ అవుతానంది. వీలైనంత వరకూ తక్కువ ఖరీదులో ఉండే ఐటం కోసమే సెర్చ్ చేస్తానని తెలిపింది. మొత్తానికి మలైకా అరోరా కూడా బడ్జెట్ పద్మనాభం టైపు అని అర్దమవుతుంది. ఇది మంచి అలవాటే. చేతిలో డబ్బుందని విచ్చల విడిగా ఖర్చు పెడితే? డబ్బు లేని రోజంటూ ఒకటి ఎదురైనప్పుడు ఇబ్బందులు తప్పవు. ఆ విషయాన్ని మలైకా బాగా అర్దం చేసుకుంది.
