జబ్బల రవిక డిజైనర్ కోకలో మలైకా కెవ్వు కేక
ఇక మలైకా అరోరా కొత్త రిలేషన్ గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.
By: Srikanth Kontham | 15 March 2026 12:47 PM ISTబాలీవుడ్ సీనియర్ బ్యూటీ మలైకా అరోరా ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని సృష్టించుకుంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోల్లో తన స్టైలిష్ లుక్స్‌తో అభిమానుల గుండెల్లో మంటలు రేపుతోంది. ముఖ్యంగా ఆ జబ్బల రవిక (పఫ్ స్లీవ్ బ్లౌజ్), కాంబినేషన్ డిజైనర్ కోకలో మల్లా మెరిసిపోతున్న తీరు `కేక` పెట్టించేలా ఉంది. సాంప్రదాయ చీరకట్టుకు మోడ్రన్ టచ్ ఇస్తూ మలైకా చేస్తున్న ఈ ఫ్యాషన్ ప్రయోగాలు నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఇది గౌరి అండ్ నైనిక డిజైనర్ శారీ.
ప్రస్తుతం 52 ఏళ్ల వయసులో ఉన్నా కానీ..మలైకా తన ఫిట్‌నెస్‌తో నేటి తరం హీరోయిన్లకు గట్టి పోటీనిస్తోంది. వయసు అనేది కేవలం ఒక నంబర్ మాత్రమేనని నిరూపిస్తోంది. బికినీలు, స్విమ్ వేర్లలో ఎంతటి గ్లామర్‌ను చిందిస్తుందో.. చీరకట్టు వంటి ట్రెడిషనల్ అవతారాల్లో అంతే హుందాతనాన్ని ప్రదర్శిస్తోంది. మలైకా ఫ్యాషన్ సెన్స్ నుండి నేటితరం నేర్చుకోవాల్సింది ఏమిటంటే.. బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా దుస్తులను ఎంపిక చేసుకోవడం.. ఏ రకమైన దుస్తులనైనా పూర్తి ఆత్మవిశ్వాసంతో ధరించడం.
మలైకా వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కెరీర్ పరంగా ఏమాత్రం వెనకడుగు వేయలేదు. ఆర్భాజ్ ఖాన్‌తో వివాహ బంధం ముగిసినా.. ఆ తర్వాత అర్జున్ కపూర్‌తో ప్రేమాయణం బ్రేకప్ అయినా.. కుంగిపోకుండా తన కెరీర్‌పై దృష్టి సారించింది. వ్యక్తిగత బాధలను తన వృత్తిగత ఎదుగుదలకు అడ్డంకిగా మార్చుకోకుండా.. మరింత స్ట్రాంగ్‌గా నిలబడటం మలైకాలోని గొప్ప లక్షణం. ప్రస్తుతం ఈ బ్యూటీ తన ఫోకస్ అంతా కెరీర్, ఫిట్‌నెస్‌పైనే ఉంచుతూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది.
వెండితెరపై ఐటమ్ సాంగ్స్‌తో ఒకప్పుడు ఊపు ఊపిన మలైకా ప్రస్తుతం రియాలిటీ షోలకు జడ్జిగా రాణిస్తోంది. ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్, ఝలక్ దిఖ్లా జా, సూపర్ మోడల్ ఆఫ్ ది ఇయర్ వంటి పాపులర్ షోలలో జడ్జిగా వ్యవహరిస్తూ తన విలక్షణమైన శైలిని ప్రదర్శిస్తోంది. అలాగే తన సొంత షో `మూవింగ్ ఇన్ విత్ మలైకా` ద్వారా తన వ్యక్తిగత జీవితాన్ని ప్రేక్షకులతో పంచుకుంది. సినిమా ఆఫర్లు ఈ బ్యూటీని ఎందుకు వరించడం లేదనే చర్చ వస్తే.. మలైకాకేవలం స్పెషల్ సాంగ్స్ లేదా గెస్ట్ రోల్స్ కే పరిమితం కావడం.. పూర్తి స్థాయి నటిగా కంటే ఫ్యాషన్ ఐకాన్‌గా ఉండటానికే మొగ్గు చూపడం ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
ఇక మలైకా అరోరా కొత్త రిలేషన్ గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అర్జున్ కపూర్‌తో విడిపోయిన తర్వాత ఈ భామ `స్ప్లిట్స్‌విల్లా X6` ఫేమ్ సోరబ్ భేడీతో ప్రేమలో ఉన్నట్లు పుకార్లు షికారు చేశాయి. అయితే ఈ వార్తలపై సోరబ్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. తామిద్దరం కేవలం స్నేహితులమని ఒకరినొకరు బాగా నమ్ముతామని పేర్కొంటూ ఈ రూమర్లకు చెక్ పెట్టారు. మలైకా కూడా ప్రస్తుతం తన ఒంటరి జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ కెరీర్‌పైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
ఓవరాల్ గా.. మలైకా అరోరా తన ఫ్యాషన్, ఫిట్‌నెస్, ధైర్యంతో బాలీవుడ్‌లో ఒక అజేయమైన శక్తిగా కొనసాగుతోంది. ఏజ్ లెస్ బ్యూటీ ధరించే ప్రతి డ్రెస్ ఒక ట్రెండ్ సెట్టర్‌గా మారుతుండటంతో ఫ్యాషన్ ప్రియులు ఆమె అప్‌డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ 52 ఏళ్ల భామ ముందు ముందు ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
