Begin typing your search above and press return to search.

రెడ్ హాట్ లుక్‌లో మ‌లైకా దుమారం

''రాణికి కిరీటం అవ‌స‌రం లేదు.. ర్యాంప్ పై ఆ క్యాట్ వాక్ చాలు!'' ఇదీ ఒక అభిమాని మ‌లైకా అరోరా హంస న‌డ‌క‌ల‌ను చూసి ముగ్ధుడైపోయిన వైనం.

By:  Sivaji Kontham   |   1 Dec 2025 9:11 AM IST
రెడ్ హాట్ లుక్‌లో మ‌లైకా దుమారం
X

''రాణికి కిరీటం అవ‌స‌రం లేదు.. ర్యాంప్ పై ఆ క్యాట్ వాక్ చాలు!'' ఇదీ ఒక అభిమాని మ‌లైకా అరోరా హంస న‌డ‌క‌ల‌ను చూసి ముగ్ధుడైపోయిన వైనం. 53 ఏళ్ల వ‌య‌సులో `వైబుందిలే` అంటూ ర్యాంప్ పై దూసుకెళ్లిపోతోంది మ‌లైకం. హాట్ *స్‌కి డెఫినిష‌న్ ఏమిటి? అని ప్ర‌శ్నిస్తే, అది క‌చ్ఛితంగా మ‌లైకా అరోరా. ఏజ్ లెస్ బ్యూటీగా హృద‌యాల‌ను గెలుచుకుంటున్న ఈ బ్యూటీ ఇప్పుడు రెడ్ హాట్ మినీ డ్రెస్ లో రెడ్ కార్పెట్ వాక్ ల‌తో దుమారం రేపుతోంది.





ఎరుపు రంగు దుస్తులు అందాన్ని ప‌దింతలు పెంచే ఉత్త‌మ ఎంపిక‌.. ఇది విశ్వాసం, ఆనందం క‌ల‌యిక‌తో జ‌రుపుకునే వేడుక గా మారుస్తాయి. మ‌లైకా అలా రెడ్ హాట్ మినీ ఫ్రాక్ ధ‌రించి స్టన్నింగ్ క్యాట్ వాక్ చేస్తుండ‌గా, చూశాక యువ‌త‌రం హృద‌యాల్లో గుబులు రేకెత్తుతోంది. కిల్ల‌ర్ చూపుల‌తో అలా డ్యాషింగ్ గా ర్యాంప్ పై న‌డిచి వ‌స్తున్న మ‌లైకాను చూడ‌గానే కుర్ర‌కారుకు హార్ట్ బ్రేక్ అయింది.

నవంబర్ 29న ముంబైలో మ‌లైకా ఇలా ఎరుపు రంగు దుస్తుల‌లో మెరుపులు మెరిపించింది. అయితే థై అందాల‌ను ఎలివేట్ చేసే మినీ దుస్తుల‌లో మ‌లైకా అంద‌చందాలు హాట్ టాపిగ్గా మారాయి. మలైకా అరోరా ఎరుపు రంగు డ్రెస్ గురించిన డీటెయిల్స్ లోకి వెళితే.. రియాలిటీ టీవీ జడ్జి , మాజీ వీజే స్టైలిస్ట్ ఆష్లే రెబెల్లో లుక్‌ను మ‌లైకా ప్ర‌ద‌ర్శించింది. ఫ్యాషన్ షోలో మలైకా అతనితో పాటు వెండి మినీ డ్రెస్‌లో క‌నిపించ‌గా, త‌న‌తో పాటే ఈవెంట్లో ఇత‌ర న‌టీమ‌ణులు క‌నిపించారు.

మలైకా బాడీ హగ్గింగ్ దుస్తుల్లో మెరిసే ఎరుపు రంగు ఫాబ్రిక్ టాప్ తో క‌నిపించింది. ఇరు వైపులా క్లిష్టమైన కటౌట్‌లతో... పై భాగం పారదర్శక బస్టియర్ లాగా అందంగా క‌నిపించింది. మ‌లైకా ఒక అంద‌మైన కిరీటాన్ని త‌న హెడ్ కి త‌గిలించుకుని క‌నిపించింది. ఎరుపు మినీ డ్రెస్‌ను స్టైల్ చేయడానికి, బంగారం- వెండి చెవిపోగులు లేదా స్టేట్‌మెంట్ నెక్లెస్- మెటాలిక్ క్లచ్ వంటి మెటాలిక్ ఉపకరణాలను ఉప‌యోగించారు.