మలైకా ట్రిక్కు: ఎప్పుడూ ఫోటోగ్రాఫర్లు వెంటపడాలంటే?
50 ప్లస్ వయసులోను గుబులు పుట్టించే అందాలతో మతులు చెడగొడుతోంది మలైకా అరోరా. ఏజ్ లెస్ బ్యూటీగా యువతరం హృదయాలను కొల్లగొడుతోంది.
By: Sivaji Kontham | 27 Dec 2025 8:00 AM IST50 ప్లస్ వయసులోను గుబులు పుట్టించే అందాలతో మతులు చెడగొడుతోంది మలైకా అరోరా. ఏజ్ లెస్ బ్యూటీగా యువతరం హృదయాలను కొల్లగొడుతోంది. ఇప్పుడు క్రిస్మస్ సీజన్‌లోను మలైకా సందడి మామూలుగా లేదు. బాలీవుడ్ సర్కిల్స్ లో పలువురు టాప్ స్టార్లు తమ ఇండ్లలో క్రిస్మస్ పండుగను అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో మలైకా పార్టీ క్రౌడ్ ని అస్సలు విడిచిపెట్టడం లేదు. ఇప్పుడు మరోసారి మలైకా తనలోని ఫ్యాషనిస్టాను బయటకు తీసింది.
తాజాగా రెడ్ థీమ్డ్ డ్రెస్ లో మలైకా క్రిస్మస్ పార్టీకి అటెండయిన ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్ లో గుబులు రేపుతున్నాయి. పార్టీ ఏదైనా కుర్రకారును కిల్ చేయడంలో మలైకా తర్వాతే. ఈవెంట్ లో ఎప్పటిలాగే మరోసారి మలైకా షో స్టాపర్ గా నిలిచింది. మల్లా స్పెషల్ బటన్ లెస్ రెడ్ ఫ్రాక్ ధరించి థై షోస్ తో వేదిక వద్ద మతులు చెడగొట్టింది.
ఈ బ్యూటీ అలా కార్ దిగి నడుచుకుంటూ వెళుతుంటే, ఫోటోగ్రాఫర్లు వెంటపడి మరీ స్నాప్స్, వీడియోలు చిత్రీకరించడంలో బిజీ అయిపోయారు. మరోవైపు మలైకా తన బాడీ హగ్గింగ్ రెడ్ డ్రెస్ ని సవరించుకుంటూ, చాలా జాగ్రత్తలతో కనిపించింది. ఆ సమయంలో మలైకా రకరకాల భంగిమలతో మతులు చెడగొట్టింది. ఏజ్ లెస్ బ్యూటీ మలైకా ఎక్కడ ఉన్నా, అక్కడ అల్ట్రా గ్లామ్ స్టైల్ హీటెక్కిస్తుంది. ఇప్పుడు క్రిస్మస్ పార్టీలోను మల్లా దెబ్బకు అహూతులకు మైండ్ బ్లాంక్ అయింది.
నేటి జెన్ జెడ్ సైతం మలైకా రేంజులో ఫ్యాషన్ సెన్స్ ని అనుసరించడానికి వెనకాడతారు. ఆ రేంజులో కిక్కివ్వడం మాబ్‌కి ట్రీటివ్వడం ఎవరి వల్లా కాదు! అంటూ కామెంట్ చేస్తున్నారు. మలైకా డ్యాషింగ్ ఫ్యాషన్ సెన్స్ కి ఒక వర్గం ప్రశంసలు కురిపిస్తోంది. ఇక టీవీ షోలు, రియాలిటీ ఈవెంట్లలో మలైకా మోడ్రన్ అప్పియరెన్స్, బోల్డ్ లుక్స్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడూ పది మంది ఫోటోగ్రాఫర్లు తన వెంట పడేలా చేయడంలో మలైకా టెక్నిక్ గురించి ఇప్పుడు గుసగుస వినిపిస్తోంది.
