Begin typing your search above and press return to search.

వీడియో: పాతిక వ‌య‌సుకు టాటా.. 50 ప్ల‌స్‌లో మ‌లైకా జింతాత!

మలైకా ధరించిన ఈ ప్రత్యేకమైన డిజైన‌ర్ డ్రెస్ త‌న‌ ఫిట్‌నెస్‌ను పర్ఫెక్ట్‌గా ఎలివేట్ చేసింది.

By:  Sivaji Kontham   |   1 April 2026 10:06 AM IST
వీడియో: పాతిక వ‌య‌సుకు టాటా.. 50 ప్ల‌స్‌లో మ‌లైకా జింతాత!
X

బాలీవుడ్ గ్లామర్ ప్రపంచంలో మలైకా అరోరా(52) పేరు ఒక బ్రాండ్. వయసు కేవలం అంకె మాత్రమేనని నిరూపిస్తూ 50 ప్ల‌స్ లోను మెరుపులు మెరిపిస్తోంది ఈ బ్యూటీ. ఒక ర‌కంగా చెప్పాలంటే టీనేజ‌ర్లు, పాతిక ప్రాయం అంద‌గ‌త్తెల‌కు 50 ప్ల‌స్ మ‌లైకా ఒక స‌వాల్ గా మారింది. తాజాగా జరిగిన గ్రాజియా ఫ్యాషన్ అవార్డ్స్ 2026 వేడుకలో మ‌లైకా అరోరా మరోసారి అహూతుల‌ను మంత్రముగ్ధులను చేసింది. ఈ ఈవెంట్ కోసం త‌ను ఎంచుకున్న డిజైనర్ సిల్వ‌ర్ గౌను ఫ్యాషన్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. థై-హై స్లిట్ .. డీప్ నెక్ లైన్ తో కూడిన ఆ దుస్తుల్లో మలైకా ప్రదర్శించిన ఆత్మవిశ్వాసం చూస్తుంటే.. త‌న‌ను అసలైన `రెడ్ కార్పెట్ క్వీన్` అని అంగీక‌రించాలి.

మలైకా ధరించిన ఈ ప్రత్యేకమైన డిజైన‌ర్ డ్రెస్ త‌న‌ ఫిట్‌నెస్‌ను పర్ఫెక్ట్‌గా ఎలివేట్ చేసింది. ప్రముఖ ఇంటర్నేషనల్ డిజైనర్ రూపొందించిన ఈ డ్రెస్ మోడ్రన్ స్టైల్‌కు నిలువుటద్దంలా నిలిచింది. మినిమల్ మేకప్ .. స్లీక్ హెయిర్ స్టైల్‌తో మ‌లైకా తన లుక్‌ను చాలా క్లాసిక్‌గా నేచుర‌ల్ గా ప్రెజెంట్ చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలు చూస్తుంటే.. కెమెరా ముందు ఫోజులివ్వడంలో మ‌లైకా ఎన‌ర్జీ, గ్రేస్, స్టైల్ నేటి తరం హీరోయిన్లకు కూడా ఒక పాఠం అన‌డంలో సందేహం లేదు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. మ‌లైకా ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. వి.జేగా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత బాలీవుడ్‌లో `చయ్యా చయ్యా` వంటి ఐకానిక్ ఐటెం సాంగ్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. కేవలం డాన్సర్‌గానే కాకుండా.. మోడల్‌గా.. నిర్మాతగా, బుల్లితెర హోస్ట్ గా కూడా తనదైన ముద్ర వేసింది. దశాబ్దాలు గడుస్తున్నా తన క్రేజ్ తగ్గకుండా కాపాడుకోవడంలో మ‌లైకా చూపిస్తున్న అంకితభావం అద్భుతం. ముఖ్యంగా వెండితెరపై త‌ను చేసే స్పెషల్ సాంగ్స్ కోసం ప్రేక్షకులు ఇప్పటికీ ఆస‌క్తిగా వేచి చూస్తుంటారు.

ప్రస్తుతం మలైకా టెలివిజన్ రంగంలో అత్యధిక డిమాండ్ ఉన్న సెలబ్రిటీ జడ్జిగా కొనసాగుతోంది. ఇటీవ‌ల‌ `హిప్ హాప్ ఇండియా సీజన్ 2` వంటి పాపులర్ రియాలిటీ షోలతో బిజీగా ఉంది. అభ్యర్థుల ప్రతిభను గుర్తించడంలో మ‌లైకా నిశిత పరిశీలన.. ఇచ్చే సూటి విశ్లేషణలు ఆ షోల రేటింగ్‌ను పెంచుతున్నాయి. `ఇండియాస్ బెస్ట్ డాన్సర్`వంటి షోల ద్వారా ఇప్పటికే టీవీ ప్రేక్షకులకు మ‌లైకా బాగా దగ్గరైంది.. ఈ వేదిక‌పై త‌ను ఇచ్చే జడ్జిమెంట్స్ ఎంతో విలువైనవిగా భావిస్తారు.

మలైకా అరోరా ఆదాయ వనరులు కూడా త‌న కెరీర్ లాగే విభిన్నంగా ఉన్నాయి. రియాలిటీ షోలకు ఎపిసోడ్‌కు లక్షల్లో పారితోషికం తీసుకుంటూనే మరోవైపు ఫ్యాషన్ , ఫిట్‌నెస్ రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టింది. ది లేబుల్ లైఫ్ వంటి ఫ్యాషన్ బ్రాండ్స్ తో పాటు.. తన సొంత రెస్టారెంట్ వ్యాపారాల ద్వారా స్థిరమైన ఆదాయం లభిస్తోంది. కేవలం గ్లామర్ మాత్రమే కాదు.. తెలివైన వ్యాపారవేత్తగా కూడా మలైకా తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది.