వయసు జస్ట్ 52 మనసు 22.. మలైకా స్టన్నింగ్ అవతార్
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ `గబ్బర్ సింగ్` సినిమాలో `కెవ్వు కేక` అంటూ టాలీవుడ్‌ను ఒక ఊపు ఊపేసిన మలైకా అరోరా.. బాలీవుడ్‌లో `ఛయ్య ఛయ్య`' అంటూ రన్నింగ్ ట్రైన్‌పై షారూఖ్ ఖాన్‌తో కలిసి నర్తించి ఇప్పటికే దశాబ్దాలు గడిచిపోయింది.
By: Sivaji Kontham | 21 Jun 2026 12:00 PM ISTపవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ `గబ్బర్ సింగ్` సినిమాలో `కెవ్వు కేక` అంటూ టాలీవుడ్‌ను ఒక ఊపు ఊపేసిన మలైకా అరోరా.. బాలీవుడ్‌లో `ఛయ్య ఛయ్య`' అంటూ రన్నింగ్ ట్రైన్‌పై షారూఖ్ ఖాన్‌తో కలిసి నర్తించి ఇప్పటికే దశాబ్దాలు గడిచిపోయింది. ఏళ్లు గడుస్తున్నా ఈ డ్యాన్సింగ్ క్వీన్ గ్లామర్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం వయసు 52 ఏళ్లు.. మనసు మాత్రం ఇంకా 22 ఏళ్ల దగ్గరే ఆగిపోయింది. ఫిఫ్టీ ప్లస్ ఏజ్ గ్రూప్‌లోకి వచ్చినా కూడా ఇప్పటికీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిగెంట్ ఫ్యాషనిస్టాగా కుర్రకారు మనసులను గెలుచుకుంటూ.. నిరంతరం తన స్టన్నింగ్ మేకోవర్‌తో సోషల్ మీడియాలో మురిపిస్తూనే ఉంది.
తాజాగా మలైకా అరోరా అదిరిపోయే డిజైనర్ లుక్‌లో నెటిజన్ల హృదయాలను కొల్లగొట్టింది. `బొంబాయి టైమ్స్ అవార్డ్స్-2026` వేడుకలో పాల్గొన్న ఈ బ్యూటీ రెడ్ కార్పెట్‌పై అందాల విందు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ నైట్ లో `లైఫ్‌స్టైల్ ఎంటర్ ప్రెన్యూర్ అవార్డు-2026` ను కూడా సొంతం చేసుకుంది. ఈ వేడుకకు సంబంధించిన బిహైండ్ ది సీన్స్.. రెడ్ కార్పెట్ మూమెంట్స్ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా అది వైరల్ గా దూసుకెళుతోంది. ఎంపిక చేసుకున్న ఆ డిజైనర్ డ్రెస్సులో మలైకా లుక్ చూసి ఈ అవార్డ్ ఫంక్షన్‌కే `షో స్టాపర్`గా మారిందని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
గ్లామర్ ప్రపంచంలోనే కాకుండా బిజినెస్ రంగంలోనూ రాణిస్తున్న మలైకా అరోరా ప్రస్తుతం రియాలిటీ షోలతో .. సోషల్ మీడియా పోస్టింగులతో లక్షల్లో ఆర్జిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రాండ్ ప్రమోషన్లు, పెయిడ్ కొల్లాబరేషన్ల ద్వారా భారీగా సంపాదిస్తున్న ఈ బ్యూటీ ఆదాయంలో తనే `క్వీన్` అని... అలాగే అభిమానుల హృదయాలను గెలవడంలో `గాడెస్` అని నిరూపిస్తోంది. వయసు కేవలం ఒక నంబర్ మాత్రమేనని... ఫిట్‌నెస్ .. సరైన జీవనశైలి ఉంటే ఏ వయసులోనైనా గ్లామరస్‌గా మెరిసిపోవచ్చని మలైకా తన లేటెస్ట్ ఫోటోషూట్‌లతో నిరంతరం నిరూపిస్తూనే ఉంది.
మలైకా అరోరా రియాలిటీ షోల ద్వారా బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. ప్రస్తుతం ప్రముఖ డాన్స్ రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ... తన పదునైన విమర్శలు - గ్రేస్‌ఫుల్ కామెంట్లతో షోకు అదనపు ఆకర్షణగా నిలుస్తోంది. దీనితో పాటు ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ , ఫిట్‌నెస్‌కు సంబంధించిన పలు సెలబ్రిటీ టాక్ షోలు... రియాలిటీ సిరీస్‌లలో చురుగ్గా పాల్గొంటోంది. తన సొంత డిజిటల్ రియాలిటీ షోలతోను తన వ్యక్తిగత .. ప్రొఫెషనల్ లైఫ్‌ను ప్రేక్షకులతో షేర్ చేసుకుంటూ.. టెలివిజన్ రేటింగ్‌లలో... ఓటీటీ వేదికలపైనా సరికొత్త ట్రెండ్ సృష్టిస్తోంది.
నిరంతరం జిమ్, యోగా, పైలేట్స్ శిక్షణతో తన శరీరాకృతిని సన్నజాజి తీగలా కాపాడుకుంటున్న మలైకా అరోరా... నేటి తరం యంగ్ హీరోయిన్లకు సైతం గట్టి పోటీనిస్తోంది. ఫ్యాషన్ ప్రపంచంలో ఈ సీనియర్ బ్యూటీ వేసే ప్రతి అడుగు ఒక సరికొత్త ట్రెండ్‌గా మారుతోంది. వయసు పెరుగుతున్నా కొద్దీ మరింత అందంగా.. హా*ట్‌గా తయారవ్వడం మలైకాకే చెల్లిందని..అందుకే ఈ భామ ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్ ఎప్పుడూ మిలియన్ల కొద్దీ లైకులు, వ్యూస్‌తో దూసుకుపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
