Begin typing your search above and press return to search.

అవును అత‌డిపై ర‌గిలిపోయాను: మ‌లైకా

26 ఏళ్ల అర్జున్ కపూర్, త‌న కంటే రెట్టింపు వ‌య‌సున్న మ‌లైకా అరోరాతో డేటింగ్ చేసిన సంగ‌తి తెలిసిందే.

By:  Sivaji Kontham   |   15 Jan 2026 9:43 AM IST
అవును అత‌డిపై ర‌గిలిపోయాను: మ‌లైకా
X

26 ఏళ్ల అర్జున్ కపూర్, త‌న కంటే రెట్టింపు వ‌య‌సున్న మ‌లైకా అరోరాతో డేటింగ్ చేసిన సంగ‌తి తెలిసిందే. దాదాపు ఆరేళ్ల పాటు ఈ జంట అనుబంధం కొన‌సాగింది. కానీ అక‌స్మాత్తుగా అర్జున్ త‌న నుంచి విడిపోయి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. అన్యోన్య‌మైన జంట ఇలా విడిపోవ‌డంపై చాలా చ‌ర్చ సాగింది. నేడో రేపో పెళ్లి చేసుకుంటార‌ని అనుకుంటే, దూర‌మ‌వ్వ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

అయితే అర్జున్ కపూర్ తో బ్రేకప్ తర్వాత తన మాన‌సిక‌స్థితి ఎలా ఉండేదో నటి మలైకా అరోరా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. `ది నమ్రతా జకారియా షో` అనే యూట్యూబ్ టాక్ షోలో మ‌లైకా తన వ్యక్తిగత జీవితం గురించి సంచలన విష‌యాలు బ‌య‌ట‌పెట్టారు. ఒక రిలేషన్‌షిప్ ముగిసినప్పుడు ఎవరైనా కొన్ని కఠినమైన దశలను దాటాల్సి ఉంటుందని మలైకా పేర్కొన్నారు. మేము కూడా మనుషులమే. బ్రేకప్ తర్వాత కోపం, బాధ, నిరాశ కలగడం చాలా సహజం. నేను కూడా ఆ కోపంతో కూడిన దశలను అనుభవించాన‌ని మ‌లైకా ఒప్పుకున్నారు. ఆ కోపం నుండి తాను ఎలా బయటపడ్డాననే విషయంపై స్పందిస్తూ.. కాలం అన్ని గాయాలను మాన్పుతుంది అనేది ఒక పాత మాట అయినా కానీ, అది నా విషయంలో నిజమైంది. సమయం గడిచేకొద్దీ మనకు ఒక స్పష్టత వస్తుంది! అని అన్నారు.

విడిపోయినప్పటికీ అర్జున్ కపూర్ పై త‌న‌కు ఎటువంటి ద్వేషం లేదని మ‌లైకా అన్నారు. పరిస్థితులు ఏవైనా కావచ్చు, కానీ అర్జున్ ఇప్పటికీ నా జీవితంలో ఒక ముఖ్యమైన అంతర్భాగమైన వ్యక్తి! అని గౌరవంగా చెప్పారు. బంధం కేవలం విడిపోవడంతో ముగిసిపోదని, ఒకరిపై ఒకరికి ఎప్పుడూ గౌరవం ఉంటుందని పేర్కొన్నారు.

మిస్టరీ మ్యాన్ అంటూ విసిగిస్తారు:

ఇదే ఇంటర్వ్యూలో తనపై వస్తున్న డేటింగ్ రూమర్ల గురించి కూడా మ‌లైకా ఘాటుగా స్పందించారు. తను ఎవరితోనైనా కనిపిస్తే చాలు అతడిని `మిస్టరీ మ్యాన్` అని పిలుస్తూ రూమర్లు పుట్టించడం తనకు నవ్వు తెప్పిస్తోందని, తన తల్లి కూడా ఫోన్ చేసి `వీడెవడు కొత్తగా?` అని అడుగుతుంటుందని జోక్ చేశారు.

మలైకా అరోరా ప్ర‌తి విష‌యాన్ని ఎంతో ప‌రిణ‌తితో హ్యాండిల్ చేస్తార‌ని దీనిని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు. కేవలం గ్లామర్ ఆర‌బోస్తూ, ఐటెం సాంగ్స్ చేయ‌డం మాత్రమే కాదు. ఒక మహిళగా తన భావోద్వేగాలను ధైర్యంగా చెప్పుకోవ‌డం ఆమె ఫ్యాన్స్‌కు బాగా నచ్చింది. ఒక రిలేషన్‌షిప్ ముగిసిన తర్వాత కూడా భాగ‌స్వామిపై ఇంకా గౌర‌వం ఉండ‌టం నిజంగా ప‌రిణ‌తికి సంబంధించిన మ్యాట‌ర్. ఈ విష‌యంలో త‌న‌ను అభినందించాల్సిందే