Begin typing your search above and press return to search.

మ‌న‌సుకు న‌చ్చినవాడితో పెళ్లి కాకుండానే.. మ‌లైకా కామెంట్

స్వేచ్ఛ‌గా జీవించ‌డంపై నిర‌భ్యంత‌రంగా మాట్లాడ‌టంలో ఎప్పుడూ ముందుంటుంది మ‌లైకా అరోరా.

By:  Sivaji Kontham   |   6 Nov 2025 1:00 AM IST
మ‌న‌సుకు న‌చ్చినవాడితో పెళ్లి కాకుండానే.. మ‌లైకా కామెంట్
X

స్వేచ్ఛ‌గా జీవించ‌డంపై నిర‌భ్యంత‌రంగా మాట్లాడ‌టంలో ఎప్పుడూ ముందుంటుంది మ‌లైకా అరోరా. మాజీ భ‌ర్త ఆర్భాజ్ ఖాన్ నుంచి విడిపోయిన మ‌లైకా అరోరా త‌న కంటే వ‌య‌సులో చిన్న‌వాడైన అర్జున్ క‌పూర్ తో స‌హ‌జీవ‌నం చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ ఇద్ద‌రూ క‌లిసి బ‌హిరంగంగా షికార్లు చేసారు. అత‌డితో త‌న శృంగార జీవితం చాలా బావుంద‌ని కొన్నిసార్లు మ‌లైకా బ‌హిరంగంగా అంగీక‌రించారు.

ఇప్పుడు ఓ ఇంట‌ర్వ్యూలో మ‌లైకా చేసిన వ్యాఖ్య‌లు దుమారంగా మారాయి. ప్ర‌తి వ్య‌క్తికి త‌న జీవితాన్ని త‌న ఇష్టానుసారం జీవించే హ‌క్కు ఉంది. మ‌న‌సుకు న‌చ్చిన‌వాడితో శృంగారం చేయ‌డం త‌ప్పేమీ కాదు. దీనికి పెళ్లి కావాల్సిన అవ‌స‌రం లేదు. ఎంత స్వేచ్ఛ‌గా జీవించాము అన్న‌దే ముఖ్యం.. అని మ‌లైకా వ్యాఖ్యానించారు.

అయితే మ‌లైకా ఇలాంటి విష‌యాల‌ను ప‌బ్లిగ్గా మాట్లాడటం స‌రికాద‌ని ప‌లువురు సూచిస్తున్నారు. మ‌న‌సులోని మాట‌ను బోల్డ్ గా మాట్లాడేయ‌డం మ‌లైకా ఎప్పుడూ వెన‌కాడ‌దు. త‌న జీవితంలో ప్ర‌తి చ‌ర్యా ఎంతో స్వేచ్ఛ‌తో ముడిప‌డి ఉంది.

30 ఏళ్ల కుర్రాడితో మ‌ళ్లీ డేటింగ్?

మలైకా అరోరా అర్జున్ క‌పూర్ నుంచి విడిపోయాక పూర్తిగా డేటింగ్ లైఫ్ కి దూరంగా ఉంది. కానీ ఇటీవ‌ల 53ఏళ్ల మ‌లైకా 30 ఏళ్ల కుర్రాడితో ఓ ప‌బ్లిక్ ఈవెంట్లో క‌నిపించడంతో మరోసారి అంద‌రి దృష్టిని ఆకర్షించింది. ఇటీవల ముంబైలో జరిగిన ఎన్రిక్ ఇగ్లేసియాస్ కచేరీలో క‌నిపించిన ఆ ముప్పై ఏళ్ల యువ‌కుడు ఎవ‌రో అంటూ హిందీ మీడియా చాలా ఊహాగానాలను సాగించింది. ఈవెంట్లో మ‌లైకా హుషారుగా, సరదాగా సాయంత్రం గడుపుతూ, నృత్యం చేస్తూ, పాప్ స్టార్ హిట్ పాట‌లతో హ‌మ్ చేస్తూ కనిపించింది. అయితే ఆ స‌మ‌యంలో త‌న చెంత‌నే ఉన్న ఆరున్న‌ర అడుగుల ఆజానుభాహుడు ఎవ‌రో అంటూ కెమెరాల‌ను జూమ్ చేయ‌డం ఆస‌క్తిని రేకెత్తించింది.

మలైకా అరోరా మిస్టరీ మ్యాన్ ఎవ‌రై ఉంటారు? అన్న చ‌ర్చా సోష‌ల్ మీడియాలో మొద‌లైంది. ఈ భారీ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వ‌డంతో మలైకాతో ఉన్న‌ మిస్టరీ మ్యాన్ ని గుర్తు ప‌ట్టేందుకు చాలా మంది ప్ర‌య‌త్నించారు. ఇన్నిరోజులు మ‌లైకాపై స‌రైన గాసిప్పులు లేవు. ఇక‌పై ప్ర‌తిరోజూ ఏదో ఒక విధంగా కొత్త వార్త‌లు పుట్టుకు రావ‌డం ఖాయం.

కుమారుడి డెబ్యూ ఎప్పుడు?

మ‌లైకా ఇప్ప‌టికే ఎదిగేసిన టీనేజ‌ర్ కి మామ్. ఇప్పుడు తన బాధ్య‌త‌లు చాలా పెద్ద‌వి. న‌ట‌వార‌సుడు అర్హాన్ ఖాన్ ని బాలీవుడ్ కి ఘ‌నంగా ప‌రిచ‌యం చేయాల‌నే ఆలోచ‌న‌లు త‌న‌కు ఉన్నాయి. మ‌లైకా ఇటీవ‌ల స‌ల్మాన్ ఖాన్ కుటుంబ మ‌ద్ధ‌తును కూడ‌గ‌డుతోంది. అయితే మ‌లైకా కుమారుడి డెబ్యూ మూవీ గురించి ప్ర‌క‌టించేందుకు ఇంకా స‌మ‌యం ప‌డుతుంద‌ని భావిస్తున్నారు.