మొన్న హేమా మాలిని.. ఇప్పుడు మలైకా అరోరా
ఇటీవల బాలీవుడ్ సీనియర్ హీరోయిన్, డ్రీమ్ గర్ల్ హేమా మాలిని తన రెండు అపార్ట్‌మెంట్‌లను అమ్మేసిన విషయం తెల్సిందే.
By: Ramesh Palla | 9 Sept 2025 1:01 PM ISTఇటీవల బాలీవుడ్ సీనియర్ హీరోయిన్, డ్రీమ్ గర్ల్ హేమా మాలిని తన రెండు అపార్ట్‌మెంట్‌లను అమ్మేసిన విషయం తెల్సిందే. ఖరీదైన ఏరియాలో ఉన్న ఆ అపార్ట్‌మెంట్‌లను అమ్మడం ద్వారా హేమా మాలిని దాదాపు రూ.12.5 కోట్లను పొందినట్లు సైతం ఇటీవల మనం మాట్లాడుకున్నాం. ముంబైలోనే అత్యంత రద్దీ ఏరియా, ప్రైమ్ ఏరియాగా పేరున్న ప్రాంతంలో ఉన్న అపార్ట్‌మెంట్‌లను అమ్మడం ద్వారా హేమామాలిని అప్పుడు వార్తల్లో నిలిచింది. ఇప్పుడు మరో బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరా సైతం ఇదే తరహా వార్తలతో నిలిచింది. హీరోయిన్‌గా తక్కువ సినిమాలు చేసినప్పటికీ, తాను చేసిన ఐటెం సాంగ్స్ కారణంగా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ వచ్చిన మలైకా అరోరా ఇప్పుడు సోషల్ మీడియాలో తన అపార్ట్‌మెంట్ అమ్మడం ద్వారా చర్చనీయాంశం అయింది.
బాలీవుడ్ నటి మలైకా అరోరా..
మలైకా ఎందుకు తన అపార్ట్‌మెంట్‌ను అమ్మాల్సి వచ్చింది అనే విషయంలో క్లారిటీ లేదు, కానీ ఆమె ఈ అమ్మకం ద్వారా దాదాపు రూ.2 కోట్లకు మించి లాభంను దక్కించుకున్నట్లు చెబుతున్నారు. ఈ కొనుగోలుకు సంబంధించి రూ.31 లక్షల స్టాంప్ డ్యూటీ, రూ.30 వేల రిజిస్ట్రేషన్ ఫీజ్‌ను చెల్లించినట్లు అధికారులు చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా ఇలాంటి కొనుగోలు, అమ్మకాలు చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కానీ ఈ సారి మాత్రం మలైకా అరోరా అమ్మడం ద్వారా వార్తల్లో నిలిచింది. గత నెలలో మలైకా అరోరా ఈ అపార్ట్‌మెంట్‌ను అమ్మినట్లు అధికారులు చెబుతున్నారు. బాలీవుడ్‌లో ఆ సమయంలో పెద్దగా ఈ విషయం గురించి ప్రచారం జరగలేదు, కానీ గత రెండు రోజులుగా ఈ విషయం గురించి ప్రముఖంగా ఇండస్ట్రీ వర్గాల్లో మాట్లాడుతున్నారు.
సోషల్ మీడియాలో మలైకా అరోరా అందమైన ఫోటోలు
ప్రస్తుతం సినిమాలతో యాక్టివ్‌గా లేని మలైకా అరోరా సోషల్ మీడియా ద్వారా రెగ్యులర్‌గా అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. అంతే కాకుండా పలు షోల్లోనూ నటిస్తూ ఉంటుంది. దాంతో ఆమె ఆదాయం విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. అంతే కాకుండా ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మంచి సంపాదన వస్తుందని అంటారు. ఇలా ఎక్కువ సంపాదన వస్తున్నప్పటికీ ఎందుకు మలైకా ఆ అపార్ట్‌మెంట్‌ను అమ్ముతుంది అనేది చాలా మందిలో ఉన్న ప్రశ్న. అయితే ఆమె కొనుగోలు చేసిన సమయంలో ఉన్న విలువ కంటే ఇప్పుడు దాదాపు సగానికి పైగా పెరిగింది. అందుకే ఇప్పుడు అమ్మేసి మళ్లీ కొత్తగా పెట్టుబడి పెడితే బాగుంటుంది కదా అనేది ఆమె అభిప్రాయం అయ్యి ఉంటుంది. అందుకే మలైకా అరోరా ఆ అపార్ట్‌మెంట్‌ను అమ్మేసి ఉంటుందని అంటున్నారు.
మలైకా అరోరా ముంబై అపార్ట్‌మెంట్ అమ్మకం
2018లో మలైకా ఆ అపార్ట్‌మెంట్‌ను అప్పటి మార్కెట్ విలువ ప్రకారం రూ.3.26 కోట్లు పెట్టి కొనుగోలు చేసిందట. ఈ ఏడు ఏళ్లలో ఆ అపార్ట్‌మెంట్ విలువ భారీగా పెరిగింది. గత నెలలో ఆ అపార్ట్‌మెంట్‌ను రూ.5.3 కోట్లకు మలైకా అమ్మేసింది. అంటే మలైకా కి దాదాపు రూ.2 కోట్ల లాభం దక్కింది. తక్కువ సమయంలో ఈ స్థాయిలో లాభం వచ్చింది కాబట్టి ఆమె ఈ నిర్ణయం తీసుకుని ఉంటుంది. మరో వైపు ఆమె తీసుకున్న ఈ నిర్ణయం ను అభినందిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. అపార్ట్‌మెంట్ విలువ పెరిగిన సమయంలో అమ్మేయడం అనేది రియల్ ఎస్టేట్ వ్యాపారుల వ్యాపార సూత్రం. అందుకే ఈ అపార్ట్‌మెంట్ అమ్మడం అనేది ఆమె వ్యాపార తెలివికి నిదర్శనం అంటున్నారు. ఆమె రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెడుతూ మరింత ముందుకు సాగుతుందేమో చూడాలి.
