ప్రేమ మళ్లీ తలుపు తడితే తీయడానికి సిద్దంగా!
స్వేచ్ఛగా జీవించడంపై నిరభ్యంతరంగా మాట్లాడటంలో ఎప్పుడూ ముందుంటుంది మలైకా అరోరా.
By: Srikanth Kontham | 1 Jan 2026 5:00 AM ISTస్వేచ్ఛగా జీవించడంపై నిరభ్యంతరంగా మాట్లాడటంలో ఎప్పుడూ ముందుంటుంది మలైకా అరోరా. మాజీ భర్త ఆర్భాజ్ ఖాన్ నుంచి విడిపోయిన మలైకా అరోరా తన కంటే వయసులో చిన్నవాడైన అర్జున్ కపూర్ తో సహజీవనం చేసిన సంగతి తెలిసిందే. ఆ ఇద్దరూ కలిసి బహిరంగంగా షికార్లు చేసారు. అతడితో తన శృంగార జీవితం చాలా బావుందని కొన్నిసార్లు మలైకా బహిరంగంగా అంగీకరించారు. ఇద్దరి బాండింగ్ చూసి పెళ్లి కూడా చేసుకుంటారు? అన్న ప్రచారం జరిగింది. కానీ ఆ రిలేషన్ షిప్ కి బ్రేక్ తప్పలేదు.
ఆ తర్వాత కొంత కాలానికి శ్రీలంక క్రికెటర్ కుమార్ సంగక్కారతో చెట్టా పట్టాలేసుకుని తిరుగుతందనే ప్రచారం జరిగింది. ఐపీఎల్ మ్యాచ్ ల సందర్భంగా ఇద్దరు క్లోజ్ గా ఉన్న ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. కానీ ఆ తర్వాత మళ్లీ ఇద్దరు మీడియా కంట పడలేదు. దీంతో అది స్నేహమా? అన్న సందేహాలు నెట్టింట వ్యక్తమవుతున్నాయి. అంతేనా మరోసారి ఓ 30 ఏళ్ల కుర్రాడితో కలిసి ఉన్న ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అవ్వడంతో? అతడితోనూ డేటింగ్ మొదలు పెట్టిందా? అంటూ బాలీవుడ్ మీడియా కోడై కూసింది. కానీ అతడి వివరాలు మాత్రం ఇప్పటికీ గోప్యంగానే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా స్వేచ్ఛా జీవితం గురించి మాట్లాడుతూ మళ్లీ ప్రేమ అన్నది తలుపు తడితే తీయడానికి మాత్రం తాను సిద్దంగానే ఉన్నట్లు ప్రకటించింది. 'కొందరితో ప్రేమలో పడ్డాను. కానీ ఎప్పుడూ విసుగు చెందలేదు. ఇప్పటికీ లైఫ్ ని ఎంతో ఆస్వాదిస్తున్నాను. ప్రేమ అనే ఆలోచన ఎంతో ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ప్రేమను పంచడమే కాదు అందించడం అంటే చాలా ఇష్టమంది. 'అలాగని ఇప్పుడు ప్రేమకోసం ఎదురు చూడాలేదు. కానీ అదే ప్రేమ నన్ను వెతుక్కుంటూ వస్తే మాత్రం ఇంటి తలుపు తీయకుండా ఉండలేనంది.
ఎవరి నుంచైనా ప్రేమను పొందడం అంత సులభం కాదు. తల్లిదండ్రుల ప్రేమ అయినా? ప్రియుడు ప్రేమ అయినా అదృష్టం ఉంటేనే దక్కుతుందంది. మరి పైన పేర్కొన్న ప్రేమికుల సంగతేంటి? అన్నది మాత్రం రివీల్ చేయలేదు. మలైకా తాజా వ్యాఖ్యల్ని బట్టి చూస్తుంటే అవన్నీ పుకార్లే నని తెలుస్తోంది. ప్రేమ విషయాన్ని మలైకా దాచే నటి కాదు. ఇలాంటి విషయాలు ఎంతో ఓపెన్ గా మాట్లాడుతుంది. అలాంటి నటికి ప్రేమను రహస్యంగా దాచేయాల్సినంత అవసరం ఏముంటుంది? అన్నది ఆలోచించాల్సిన విషయమే. మలైకా అరోరా చివరిగా 'థామా'లో 'పాయిజన్ బేబి' సాంగ్ తో అలరించింది. ఐటం బామగా అవకాశాలు అందుకోవడంలో బాగా వెనుక బడింది. అమ్మడు ఎంత మెయింటెన్ చేస్తున్నా? వయో భారం మాత్రం వెంటాడుతూనే ఉంది.
