50 ప్లస్ మలైకాపై నెటిజన్ల ఘాటు విమర్శలు
బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ మలైకా అరోరా ముంబై నగరంలో సందడి చేసిన ఒక లేటెస్ట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలలో విపరీతంగా వైరల్ అవుతోంది.
By: Sivaji Kontham | 17 July 2026 11:15 PM ISTబాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ మలైకా అరోరా ముంబై నగరంలో సందడి చేసిన ఒక లేటెస్ట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఒక ఇన్ స్టా పేజీలో `మలైకా అరోరా స్పాటెడ్ ఇన్ టౌన్` అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ వీడియోకు బ్యాక్‌గ్రౌండ్‌లో `ఆర్యభట్ కా జీరో` సినిమాలోని `దిల్ నైయో లగ్నా` అనే పాటను జత చేశారు. ఈ వీడియో నెటిజన్ల దృష్టిని విశేషంగా ఆకర్షించినా.. దీనికి వచ్చిన కామెంట్స్ సెక్షన్ పరిశీలిస్తే మాత్రం సెలబ్రిటీలపై నెటిజన్లు ఎంతలా ట్రోలింగ్ చేస్తున్నారో అర్థమవుతోంది. మలైకా బాడీ ఫిట్ షార్ట్ ట్రాక్ ధరించి ఇలా జిమ్ కి వెళ్లడంతో యువతరం కళ్లన్నీ తననే వెంబడించాయి.
ఈ పోస్ట్‌కు వచ్చిన కామెంట్లలో ఎక్కువ శాతం నెటిజన్లు మలైకా వస్త్రధారణ, నడక శైలి.. వయస్సును టార్గెట్ చేస్తూ తీవ్రమైన విమర్శలు గుప్పించారు. తాము వేసుకునే దుస్తులు సరిగ్గా లేనప్పుడు.. వాటిని చేతులతో దాచుకుంటూ వెళ్ళడం ఎందుకని... అసలు అలాంటి దుస్తులు ఎందుకు ధరిస్తారంటూ కొందరు ఆక్షేపించారు. మరికొందరు వయస్సును ఉద్దేశించి విమర్శిస్తూ.. ముసలి వయస్సులో ఇవన్నీ అవసరమా.. అనే అర్థం వచ్చేలా కామెంట్లు పెట్టగా, మీడియాలు సెలబ్రిటీల వెనుక పడుతూ అనవసరమైన విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారంటూ మీడియా సంస్థలపై కూడా నెటిజనులు తమ అసంతృప్తిని వెళ్లగక్కారు.
అయితే ఒకవైపు ఇంతటి ఘాటు విమర్శలు.. ట్రోలింగ్ ఎదురవుతుంటే.. మరోవైపు మలైకా అభిమానులు మాత్రం ఈ పోస్ట్ కి హార్ట్ - ఫైర్ ఎమోజీలతో తమ మద్దతును తెలిపారు. మలైకా అరోరా స్టైల్ .. హాట్‌నెస్ అద్భుతంగా ఉన్నాయంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతూ తన లుక్‌ను అభినందించారు. అయితే సాధారణ కామెంట్ల కంటే కూడా ఈ పోస్ట్ కింద బాట్‌లు- ఫేక్ ప్రొఫైల్స్ ద్వారా వచ్చిన అశ్లీల-స్పామ్ మెసేజ్‌లు... ఫాలోవర్స్ కావాలంటూ వచ్చే ప్రకటనలే ఎక్కువగా దర్శనమిచ్చాయి. ఇది నేటి సోషల్ మీడియా కల్చర్‌లోని నెగెటివిటీని ప్రతిబింబిస్తోంది.
మలైకా అరోరా ఈ తరహా ఫోటోషూట్లలో పాల్గొనడం ఇదే మొదటి సారి కాదు. కొన్నేళ్లుగా ఈ తరహా ఫోటోషూట్లతో కుర్రకారులో హుషారు పెంచుతోంది. ఇన్ స్టా సహా సోషల్ మీడియాల్లో తనకు ఉన్న ఫాలోవర్ల దృష్ట్యా ఒక్కో యాడ్ పోస్ట్ కు సుమారు 5లక్షలు అందుకుంటోందని తెలుస్తోంది. టీవీ షోలు, రియాలిటీ షోలతోను మలైకా భారీగానే ఆర్జిస్తోంది.
