'ఐటమ్ భామ' అంటూ తక్కువగా చూసారు!- మలైకా
నటిగా పెద్ద స్థాయిని ఎందుకు కోరుకోరు? అని ప్రశ్నిస్తే... మొదటి నుంచి తాను నర్తకిగా కొనసాగానని, స్పెషల్ నంబర్లు చేయడం తన ప్రధాన బలం, ఆసక్తి అని చెప్పింది.
By: Sivaji Kontham | 18 Nov 2025 3:00 AM ISTబాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ మలైకా అరోరా వ్యక్తిగత, వృత్తిగత జీవితం ఎప్పుడూ హెడ్ లైన్స్ లో నిలుస్తుంది. యువహీరో అర్జున్ కపూర్ తో ఎఫైర్ కారణంగా నిరంతరం మీడియా హెడ్ లైన్స్ లోకి వచ్చిన మలైకా అతడితో బ్రేకప్ అయ్యాక, ఇటీవల స్థబ్ధుగా ఉంది. కొంతకాలంగా తన కెరీర్ పైనే ఫోకస్ చేస్తోంది.
అయితే మలైకా అరోరా భవిష్యత్ లో సినిమాల నిర్మాణం, దర్శకత్వం వైపు అడుగులు వేసే ఆలోచనలో ఉందా? అంటే దానికి అవకాశం లేకపోలేదని సమాధానం ఇచ్చింది. తనకు కెమెరా వెనక సాంకేతిక అంశాలపైనా ఆసక్తి ఉందని మలైకా తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. తెరవెనక చాలా అంశాలు ఆసక్తిని కలిగిస్తాయని, ఏదో ఒకరోజు ఆ పని చేస్తానని పేర్కొంది.
నటిగా పెద్ద స్థాయిని ఎందుకు కోరుకోరు? అని ప్రశ్నిస్తే... మొదటి నుంచి తాను నర్తకిగా కొనసాగానని, స్పెషల్ నంబర్లు చేయడం తన ప్రధాన బలం, ఆసక్తి అని చెప్పింది. నాకు ఎందులో బలం ఉందో అదే దారిలో వెళ్లానని చెప్పారు. ఒకానొక దశలో ఐటమ్ పాటను తక్కువగా చూసారు. ఐటమ్ నర్తకిని చిన్నగా చూసారు. కానీ కాలక్రమంలో అది మారింది. ఐటమ్ పాటలో నర్తించడం అంటే అందాలు ఆరబోయడం ఒక్కటే కాదు.. హావభావాల వ్యక్తీకరణ, క్రియేటివిటీ పరంగా సవాల్‌ని ఎదుర్కోవడం అని నెమ్మదిగా గ్రహించారని కూడా మలైకా అన్నారు. కథనాన్ని నడిపించే దమ్ము ఐటమ్ పాటలోను ఉంటుందని మలైకా అన్నారు. ఐటమ్ నంబర్ల మేకింగ్ పై ఇప్పుడు మంచి గౌరవం ఉందని అన్నారు.
ఈమధ్యనే 50కి ఒక సంవత్సరం అదనంగా పెరిగింది. ఎప్పటికీ ఇదే ఉత్సాహం ఉంది నాలో. నాపై అభిమానం, ప్రేమ చూపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఇన్నేళ్లుగా నన్ను ఆదరించిన వారందరికీ ప్రత్యేకించి కృతజ్ఞతలు అని అన్నారు. తన వ్యక్తిగత జీవితం గురించి ఎదురయ్యే ట్రోలింగ్ పైనా మలైకా మనసు విప్పి మాట్లాడారు. నిజానికి మనల్ని అనేవాళ్లు ఎప్పుడూ ఉంటారు. కానీ నేను నాపై దృష్టి పెట్టడం నేర్చుకున్నాను. ప్రతికూలత నన్ను డిసైడ్ చేయనివ్వను. ట్రోల్స్ ఉంటాయి. కానీ నేను ఆ విషాన్ని స్వీకరించను. నా కుటుంబం, స్నేహితులు నాకు చాలా ముఖ్యం.. మనశ్శాంతి ఇంకా ఎక్కువ ముఖ్యం! అని అన్నారు.
మలైకా ప్రస్తుతం డ్యాన్స్ రియాలిటీ షోల జడ్జిగా ఆర్జిస్తున్నారు. ఇండస్ట్రీలో టాప్ మోడల్ గా కొన్ని బ్రాండ్లతో కాంట్రాక్టుల ద్వారా కూడా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.
